రాష్ట్రంలో వ్యవసాయం ఇక ప్రైవేట్ పరం కానుంది. సన్న, చిన్నకారు రైతుల భూములను కార్పొరేట్ కంపెనీలకు లీజుకు ఇచ్చేందుకు వీలుగా భూమి లీజు చట్టాన్ని తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. చిన్న, సన్నకారు రైతుల భూములను కార్పొరేట్ కంపెనీలకు అప్పగించేందుకు రాష్ట్రంలో అనేక చర్యలు చేపట్టామని నీతి ఆయోగ్‌కు ఇప్పటికే నివేదిక సమర్పించింది.