corporate employees
-
రోజుకు 17 గంటలు పని చేస్తున్న ఉద్యోగికి డాక్టర్ సలహా..
కార్పొరేట్ ఉద్యోగాలంటే రూ.లక్షల్లో జీతాలు, విలాసవంతమైన జీవనశైలి ఉంటాయనేది నాణేనికి ఒకవైపు మాత్రమే. మరోవైపు వారి పని గంటలు, పడుతున్న ఒత్తిడి గురించి తెలుసుకుంటే ఇవేం ఉద్యోగాలురా నాయనా.. అనిపిస్తుంది. కార్పొరేట్ ఉద్యోగుల పని గంటలు, ఒత్తిడి ఏ స్థాయిలో ఉంటాయనేది ఈ వార్త చదివితే తెలుస్తుంది. కార్పొరేట్ సంస్థలో పనిచేసే ఓ 37 ఏళ్ల వ్యక్తి తాను రోజుకు 17 గంటలు పనిచేస్తున్నానని, ఇటీవల తన రక్తపోటు స్థాయిల్లో మార్పుల గురించి ఆందోళన చెందుతూ ట్విటర్లో వైద్యుడిని సంప్రదించాడు. ఆ డాక్టర్ మొదటి సిఫార్సు ఏమిటంటే.. ట్విటర్లో హర్షల్ (@HarshalSal67) అనే వ్యక్తి తన ఆరోగ్య సమస్యపై హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ను ట్విటర్లో సంప్రదించాడు. ‘హాయ్ డాక్టర్, నాకు 37 ఏళ్లు, కార్పొరేట్ ఉద్యోగంలో ఉన్నాను. గత 6 నెలల నుంచి రోజుకు 16 నుంచి 17 గంటలు పని చేస్తున్నాను. ఇటీవల బీపీ చెక్ చేసుకోగా 150 /90 వచ్చింది. ఇప్పుడేం చేయమంటారు?’ అంటూ ట్వీట్ చేశాడు. దానికి హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటల్స్‌కు చెందిన న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్ కుమార్ స్పందిస్తూ ‘పని గంటలను 50 శాతం తగ్గించండి. మరో నిరుద్యోగికి ఉద్యోగం వచ్చే అవకాశం కల్పించండి. అంటే మీ ఉద్యోగంతో పాటు మీరు మరొకరి ఉద్యోగం చేస్తున్నారు’ అని సలహా ఇచ్చారు. దీంతో డాక్టర్‌కి కృతజ్ఞతలు తెలుపుతూ ఆ ఉద్యోగం మానేస్తున్నట్లు సదరు వ్యక్తి ప్రకటించారు. దీనికి మంచి నిర్ణయం తీసుకున్నారని డాక్టర్ సుధీర్ అభినందించారు. పలువురు ట్విటర్ యూజర్లు అతని పరిస్థితిపై సానుభూతి వ్యక్తం చేశారు. 1. Reduce working hours by 50%, and ensure an unemployed person gets a job (whose job you are doing in addition to yours) (+follow other advice from the pinned post on my timeline) https://t.co/wThD7cEvMt — Dr Sudhir Kumar MD DM (@hyderabaddoctor) June 10, 2023 ఇదీ చదవండి: కార్మిక శాఖను ఆశ్రయించిన ఐటీ ఉద్యోగులు.. ఎందుకంటే.. -
కార్పొరేట్ కొలువు.. మనశ్శాంతి కరువు
సాక్షి, అమరావతి: ‘ఐదంకెల జీతం.. ఆఫీస్ కారు.. దేశ, విదేశాల్లో క్యాంప్‌లు.. నీకేంట్రా లైఫ్ మొత్తం దిల్‌కుష్‌గా ఎంజాయ్ చేస్తున్నావ్’ అని స్నేహి తులెవరైనా అంటే.. ‘చూసేవాళ్లకు బాగానే కనిపి స్తుంది. జీవితంలో బొత్తిగా మానసిక ప్రశాంతత లేకుండా పోతోంది. రోజు రోజుకూ యాజమాన్యం నుంచి ఒత్తిళ్లు పెరిగిపోతున్నాయి. రాత్రిళ్లు కంటినిండా నిద్ర ఉండటం లేదు. ముద్ద మింగుడు పడటం లేదు’ అని నిట్టూరుస్తున్నారు కార్పొరేట్ ఉద్యోగులు. దేశంలో కార్పొరేట్ కంపెనీల్లో పనిచేసే సగం మంది ఉద్యోగులు తమ మానసిక ఆరోగ్యం క్షీణిస్తోందని ఆందోళన చెందుతున్నారు. సైలెంట్ స్ట్రగుల్ సర్వే ఏం తేల్చిందంటే.. కార్పొరేట్ ఉద్యోగుల మానసిక పరిస్థితులపై ‘ది సైలెంట్ స్ట్రగుల్’ పేరిట ఆదిత్య బిర్లా ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఎంపవర్ చేపట్టిన సర్వేలో ఉద్యోగులు మానసిక ఆరోగ్యం క్షీణిస్తోందని రూఢీ అయ్యింది. కార్పొరేట్ ఉద్యోగుల మానసిక ఆరోగ్యాన్ని అంచనా చేయడంతోపాటు మెరుగైన మానసిక ఆరోగ్య కార్యక్రమాల నిర్వహణకు అవసరమైన అంతరాలను గుర్తించడం కోసం ఈ అధ్యయనం చేశారు. ఇందులో భాగంగా దేశంలోని ముంబై, కోల్‌కతా, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, అహ్మదాబాద్, పూణె నగరాల్లో 3,000 మంది ఉద్యోగులపై అధ్యయనం చేశారు. అధ్యయనానికి ఎంపిక చేసిన వారిలో 1,627 మంది పురుషులు, 1,373 మంది మహిళలు ఉన్నారు. వీరిలో 2,640 మంది 30–45 ఏళ్లు, 291 మంది 46–60 ఏళ్లు, 69 మంది 60 ఏళ్లు పైబడిన వారున్నారు. రిస్క్‌లో 48 శాతం మంది ఉద్యోగులు అధ్యయనంలో భాగంగా 48 శాతం మంది ఉద్యోగుల మానసిక ఆరోగ్యం రిస్క్‌లో ఉన్నట్టు తేలింది. సమూహాల వారీగా మెంటల్ హెల్త్ రిస్క్ ప్రొఫైల్‌ను పరిశీలించగా.. 56 శాతం మంది మహిళలు, 41 శాతం మంది పురుషులు రిస్క్‌లో ఉన్నారు. అత్యధికంగా 60 ఏళ్లు పైబడిన వారిలో అత్యధికంగా 71 శాతం మంది రిస్క్‌లో ఉండగా.. 46–60 ఏళ్ల వారిలో 48 శాతం, 30–45 ఏళ్ల వారిలో 47 శాతం మంది రిస్క్‌ను ఎదుర్కొంటున్నారు -
పాడు చేతుల నుంచి కాపాడుకో
అననుకూల ప్రదేశాలనీ, సమయాలనీ, ముందు జాగ్రత్తలతో ప్రయాణాలనీ, ఇలా ఎన్ని తరాలని భయాలను వెంటేసుకుని దినదిన గండంగా మసులుకోవాలి? ‘మీటూ’ వంటి ఉద్యమాలు మహిళల్లో చైతన్యం పెరుగుతున్న విషయాన్నీ, అదే సమయంలో మహిళలపై వేధింపుల తీవ్రత, లోతుల్ని తెలియజేస్తున్న నేపథ్యంలో వేధింపుల గురించి చెప్పడానికి ధైర్యం చేసిన మహిళలు ఎదుర్కోవడానికీ మరింత ధైర్యంగా సిద్ధం కావాలి. స్వీయరక్షణ నేర్వాలి. అకస్మాత్తుగా, అనూహ్యంగా వేధింపులకు గురైన మహిళ అచేతనురాలు అవుతుంది. నెర్వస్నెస్, భయం, నిస్సత్తువ ఆవరిస్తాయి. ఆత్మవిశ్వాసం నీరుగారిపోతుంది. ఇవన్నీ ఆ పరిస్థితిని ఎదుర్కునే శక్తియుక్తుల్ని మరింతగా తగ్గించివేస్తాయి. అందుకే కొన్ని స్వీయరక్షణ మెళకువలు, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం తప్పనిసరి. ప్రస్తుతం ఇదే ఆలోచనతో పలువురు మహిళలు, కార్పొరేట్ ఉద్యోగినులు మార్షల్ ఆర్ట్స్ ఎంచుకుంటున్నారు. ఇటీవలి కాలంలో వీరు బాగా ఆసక్తి చూపుతున్న స్వీయరక్షణ శైలిగా వింగ్‌చున్ కుంగ్‌ఫూ పేరొందింది. ఎందుకంటే... అన్నీ అనువైనవి కావు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో యుద్ధ కళలు, శైలులు అందుబాటులో ఉన్నాయి. కొన్ని మార్షల్ ఆర్ట్స్ మిలటరీ శిక్షణ తరహాలో కఠినంగా ఉంటాయి. ఇటుకరాళ్లు పగుల గొట్టడం వంటివి అందరూ సాధన చేయగలిగినవి కావు. దాదాపుగా అన్ని యుద్ధ కళలూ పురుషుల చేత, పురుషుల కోసం రూపొందించినవే కావడం దీనికో కారణం. మహిళల చేత.. మహిళల కోసం దాదాపు 300 ఏళ్ల చరిత్ర కలిగిన వింగ్ చున్ కుంగ్ ఫూ మాత్రమే ప్రపంచంలో మహిళ సృష్టించిన యుద్ధ కళ. కొంగ, పాముల మధ్య పోరాటాన్ని చూసిన తర్వాత వచ్చిన స్ఫూర్తితో, దీన్ని ఎంగ్ మ్యూ అనే షావొలిన్ బుద్ధిస్ట్ మఠాధిపతి హోదాలో ఉన్న చైనీస్ మహిళ.. వాటి కదలికల్ని చైనీస్ కుంగ్ ఫూ రూపంలో మేళవించి రూపొందించారని చెబుతారు. ఆ తర్వాత ఆమె యిమ్ వింగ్ చున్ అనే శిష్యురాలికి ఈ కళను ధారాదత్తం చేశారట. ఎంతో అందమైన ఆ యువతి తనను పెళ్లాడమని వేధిస్తున్న దృఢకాయుడిని ఓడించేందుకు ఈ కళనే ఆధారం చేసుకుందట. నిజానికి ఆమె అందగత్తే కాబట్టే పురుషుల అవాంఛనీయ వేధింపుల నుంచి రక్షించుకోవడానికే ఎంగ్ మ్యూ ఈ కళను నేర్పిందంటారు. ఈ యుద్ధ కⶠవింగ్ చున్గా ప్రాచుర్యంలోకి వచ్చి ఆ తర్వాత తర్వాత యిమ్ వింగ్ చున్గా మారింది. దీన్ని మహిళే డిజైన్ చేసినప్పటికీ... బ్రూస్లీ గురువు, గ్రాండ్ మాస్టర్ ఐపి మ్యాన్ దీన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం కోట్లాది మంది వింగ్ చున్ను ప్రపంచవ్యాప్తంగా సాధన చేస్తున్నారు. శక్తి ప్రదర్శన కోసం కాదు ఒక వేధింపు పరిస్థితి నుంచి పుట్టిన ఈ యిమ్ వింగ్ చున్.. సంపూర్ణమైన స్వీయ రక్షణాత్మక యుద్ధకళ. అంతే తప్ప తన శారీరక శక్తిని ప్రదర్శించుకోవడానికి కాదు. మహిళల్లోని అత్యంత నిగూఢమైన శక్తి యుక్తుల్ని ఇది వెలికి తీస్తుంది. ప్రత్యర్ధి అంతరంగం లో ఉద్దేశాలనూ పసిగట్టేందుకూ ఉపకరిస్తుంది. కొంగ చూపే ఉగ్రతత్వం, ఏకాగ్రత పూర్వక దాడి, సర్పంలా మెలికలు తిరిగే గుణం.. ఇవన్నీ దీనిలో కలిసి ఉంటాయి. ఎటువంటి ప్రత్యేక వస్త్రధారణగాని అవసరం లేదు. మగవాళ్లు / మహిళలు నేర్చుకోవచ్చు. ఏ రకమైన శరీర తత్వం అయినా ఓకే. ఎలివేటర్స్, వాష్ రూమ్స్, మెట్లు, ఇరుకు గల్లీలు, సన్నని కారిడార్స్... వంటి ఇరుకైన ప్రదేశాల్లో సమర్ధంగా పోరాడేందుకు వీలు కల్పించడం వింగ్ చున్ ప్రత్యేకత. తగిన వెలుతురు లేకపోయినా లేదా పూర్తి అంధకారంలో కూడా మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఎక్కడ నేర్పిస్తారు? స్వీయరక్షణ సామర్ధ్యాలను మహిళలకు అందించే లక్ష్యంతో పనిచేస్తున్న ఎన్జిఓ ‘స్వరక్షణ్ ట్రస్ట్ ఇండియా వింగ్ చున్ అకాడమీ’ (ఐడబ్లు్యసిఎ) స్కూల్స్ నిర్వహిస్తూ వింగ్ చున్ కుంగ్ ఫూను కార్పొరేట్స్‌కి, ఎన్జిఓలకు నేర్పుతోంది. అలాగే ఉమెన్స్ సెల్ఫ్ డిఫెన్స్ వర్క్‌షాప్స్ నిర్వహిస్తోంది. గత పదేళ్లుగా ముంబయి, ఢిల్లీ, పుణేలలో నిర్వహిస్తూ ఇటీవలే హైదరాబాద్‌లో శిక్షణా కేంద్రం స్థాపించింది. రెండేళ్లు సాధన... ► ఇది ఆధునిక యుగానికి నప్పే అత్యంత ప్రాక్టికల్ శైలి. అత్యంత జనసమ్మర్దం కలిగిన నగర వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రూపొందింది. ► కనీసం 10 సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ సమయం పట్టే ఇతర మార్షల్ ఆర్ట్స్‌తో పోలిస్తే దీనిని తక్కువ సమయంలో నేర్చుకోవచ్చు. సరైన పద్ధతిలో సాధన చేస్తే రెండేళ్లు చాలు. ► అన్ని రకాల పరిమాణంలో, షేప్స్‌లో ఉన్న అందరూ దీన్ని సాధన చేయవచ్చు. ► శక్తి కన్నా స్ట్రక్చర్‌ని, వేగం కన్నా టైమింగ్‌ని అధికంగా ఉపయోగించుకుంటుంది. సాధారణ మానవ శరీరపు తీరుపై ఆధారపడుతుంది కాబట్టి జంతువుల కదలికలను అనుసరించక్కర్లేదు. సాధకులకు అసాధారణ ఫ్లెక్సిబులిటీ, క్రీడా నైపుణ్యం అవసరం ఉండదు. ► ప్రాధమికంగా ఇది ఖాళీ చేతులను కదిపే శైలి. మనల్ని మనం రక్షించుకోవడానికి ఉద్దేశించింది కాబట్టి నిరాయుధులుగా ఉన్నా ఉపయోగించవచ్చు. ► అకస్మాత్తుగా జరిగే దాడుల నుంచి రక్షించుకునేందుకు వీలైన శిక్షణ ఇందులో ప్రధానం. వేధింపులను సమర్ధవంతంగా ఎదుర్కునే కళను నేర్చుకుంటున్న యువతులు – ఎస్.సత్యబాబు -
కార్పొరేట్ ఉద్యోగులకు డయాబెటిస్!
న్యూఢిల్లీ: కార్పొరేట్ కంపెనీల్లో గంటల కొద్దీ పనిచేసే వారు డయాబెటిస్, అధిక రక్తపోటు బారిన పడే అవకాశం ఎక్కువగా ఉందని అధ్యయనంలో వెల్లడైంది. సోమవారం వరల్డ్ డయాబెటిస్ దినోత్సవం సందర్భంగా అపోలో మ్యూనిచ్, నీల్సన్ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ చేసిన∙సర్వేలో ఈ మేరకు వెల్లడైంది. కార్పొరేట్ కంపెనీల్లో పనిచేసే వారిలో ప్రతి ఐదుగురిలో ఒకరు మధుమేహం, అధిక రక్తపోటు బారిన పడుతున్నారని తేలింది. మహిళా ఉద్యోగుల కంటే 13 శాతం ఎక్కువగా పురుషులు ఈ వ్యాధులకు గురవుతున్నారని తెలిపారు. ఆరోగ్య బీమా కలిగిన దాదాపు 8 లక్షల మంది కార్పొరేట్ ఉద్యోగులను సర్వే చేసి ఈ వివరాలు వెల్లడించింది. -
దెబ్బకు ఠా దొంగల ముఠా
సిటీలోని వినోద కేంద్రాలు విచిత్రాలను చూపిస్తున్నాయి. రొటీన్ వర్క్‌కు బై చెప్పి ప్రొటీన్ లాంటి ఎంటర్టైన్మెంట్ను కోరుకుంటున్న కార్పొరేట్ ఉద్యోగులే లక్ష్యంగా ఏర్పాటవుతున్న వినోద కేంద్రాలు.. వైవిధ్య లోతుల్ని తవ్వి తీస్తున్నాయి. పబ్, క్లబ్, కాఫీ షాప్స్, స్పోర్ట్స్ ఎరీనాలు.. ఇవన్నీ బోర్ కొట్టేశాయంటున్న యువత కోసం అరుదైన ఆటల కేంద్రాలు ఆవిర్భవిస్తున్నాయి. రియాలిటీ షోలను తలదన్నే రీతిలో గేమ్‌లను డిజైన్ చేసి యువ సందడికి వేదికలవుతున్నాయి. ట్రెజర్ గేమ్.. ఒక సంపన్నుడు 1950లో తమ పూర్వీకుల సమాధితో పాటు నేలమట్టం అయిన నిధిని తిరిగి పొందాలని ఆశిస్తాడు. దీని కోసం కొందరిని నియమించుకొని వారిని టైమ్ మెషిన్ మీద కొన్ని దశాబ్దాల వెనుకకు పంపించేందుకు ప్రయత్నిస్తాడు. అయితే మెషిన్ పొరపాటు వల్ల అది వారిని సమాధి నేలమట్టం అవడానికి కేవలం గంట ముందుకు మాత్రమే పంపుతుంది. దీంతో వాళ్లు కేవలం 60 నిమిషాల్లో నిధిని కనిపెట్టడంతో పాటు కుప్పకూలనున్న సమాధి నుంచి బయటపడాల్సి వస్తుంది. అప్పుడు మొదలువుతుంది ఆట.. రంజుగా. నిజాం ఆభరణాల చోరీకి... సిటీలోని సాలార్జంగ్ మ్యూజియంలోని నిజాం నగల తాత్కాలిక ప్రదర్శన నుంచి అత్యంత ఆకర్షణీయమైన, విలువైన 250 క్యారట్ల నిజామీ డైమండ్‌ని దొంగిలించేందుకు స్కెచ్ వేస్తుందో ముఠా. కేవలం గంట వ్యవధిలో దీన్ని దొంగలించి, సెక్యూరిటీ గార్డ్స్‌కి చిక్కకుండా చాకచక్యంగా తప్పించుకోవడానికి ముఠాలోని కొందరు సిద్ధమవుతారు. అందాల నటికి ఆపదొస్తే.. ఒక టాలీవుడ్ నటి జీవితం చిక్కుల్లో పడుతుంది. నటికి ఆపద కల్పించాలనే ఉద్దేశంతో ఆమె నటిస్తున్న షూటింగ్ సెట్లో సైతం ప్రమాదకరమైన సంఘటనలు జరుగుతుంటాయి. తనకు మరో గంటలో ఏమైనా జరగొచ్చనే హెచ్చరికల నేపథ్యంలో సినిమా షూటింగ్‌కు అంతరాయం కలుగకూడదని అనుకుంటారు నిర్మాత, దర్శకులు. గంట వ్యవధిలో నటికి కీడు తలపెట్టిన వారిని పట్టుకోవాలని సిటీకి చెందిన టాప్ డిటెక్టివ్‌లను పురమాయిస్తారు. ఈ వినోద క్రీడల్లో నిధిని అన్వేషించే వాళ్లు, ఆభరణాల దొంగలు, డిటెక్టివ్లు.. వీరంతా ఆటగాళ్లే. ఇలాంటి ఆటలు ఆడేందుకు వీరికి ‘ది ఎస్కేప్ హంట్ ఎక్స్పీరియన్స్ హైదరాబాద్’ లాంటి విచిత్రమైన వినోద వేదికలు అందుబాటులోకి వచ్చాయి. ఈ ఎస్కేప్ హంట్ దాదాపు 4,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో గేమ్‌కి ఒకటి చొప్పున రూమ్స్ ఉన్నాయి. వినోదం.. విశేషం స్నేహితులు, కుటుంబాలతో కలిసి వెళ్లి ఆడుకునేందుకు వీలుగా ఈ గేమ్ సెంటర్లలో ప్యాకేజీలు ఆఫర్ చేస్తున్నారు. కార్పొరేట్ టీమ్ బిల్డింగ్ ఈవెంట్స్, క్రిటికల్ థింకింగ్, అబ్జర్వేషన్ వంటి స్కిల్స్ పెరిగేందుకు ఇవి ఉపకరిస్తున్నాయని అంటున్నారు నిర్వాహకులు ఆదిత్య, సనా. ‘బ్యాంకాక్, థాయ్‌ల్యాండ్‌లలో పెరిగాను. ఆస్ట్రేలియా నుంచి కొన్నేళ్ల క్రితమే నగరానికి తిరిగి వచ్చాను. ఇక్కడ వినోద వేదికలున్నా మరిన్ని విశేషాలకు అవకాశం ఉందని అర్థమైంది. బ్యాంకాక్‌లో ఆడిన అనుభవమే ఇక్కడ ప్రారంభించేందుకు కారణమైంది. సిటీలో ఇదే ఫస్ట్ ఎస్కేప్ రూమ్ గేమ్. దేశంలోనే రెండోది. ఇందులో 60 నిమిషాల ఆట, 30 నిమిషాలు రిలాక్స్ అవడం ఉంటాయి. ఇక్కడ ఫైవ్‌స్టార్ లాంజ్‌లో అవసరమైన రీఫ్రెష్‌మెంట్స్ ఉంటాయి. అలాగే స్పెషల్ కాస్ట్యూమ్స్ ధరించి ఫొటోలు దిగేందుకు వీలుగా ఫొటో వాల్స్ ఉన్నాయ’ని చెప్పారు సనా. -
కార్పొరేట్ ఉద్యోగులకు ఆరోగ్య చిట్కాలు
న్యూఢిల్లీ: నిత్యం కంప్యూటర్లతో కుస్తీ పట్టే కార్పొరేట్ ఉద్యోగులు తమ ఆరోగ్యంపై శ్రద్ధ చూపించరు. వేళాపాళా లేని నిద్ర, కొత్త కొత్త ఆహారపు అలవాట్లు వీరిలో ఎక్కువగా కనిపిస్తాయి. ఇవి ఆరోగ్యంపై పెను ప్రభావాన్నే చూపిస్తాయంటున్నారు ‘హెల్ప్‌మీడాక్’ వెబ్సైట్ ఫౌండర్ సువ్రో ఘోష్. ఆరోగ్యవంతమైన జీవనం కోసం ఆయన కొన్ని చిట్కాలను చెప్పారు. ఎల్లప్పుడూ నీళ్లబాటిల్: నిత్యం వాటర్‌బాటిల్‌ను వెంట తీసుకెళ్లడం మంచి అలవాటు. పనిలో పడి కొన్నిసార్లు నీరు తాగడం మర్చిపోతుంటాం. అయితే తరచూ నీటిని సిప్ చేస్తూ ఉండాలి. పళ్లరసాలు తాగితే ఇంకా మంచిది. ఇంటి ఆహారం: ఇంటి దగ్గర నుంచి తెచ్చుకునే సలాడ్లు, ఆహారం చాలా మంచిది. మీరు కుటుంబానికి దూరంగా పనిచేయాల్సి వస్తోందని బయటిఫుడ్ తినాల్సిన పనిలేదు. తాజా పళ్లు, ఇంటి ఆహారం అందించే సంస్థలు చాలా ఉన్నాయి. వాటిలో ఆర్డర్ చేయండి. ఫాస్ట్‌ఫుడ్‌కు దూరంగా ఉండండి. ఒత్తిడి వద్దు: ప్రతి గంటకూ రెండు నిమిషాలపాటు కళ్లు మూసుకుని రిలాక్స్ అవ్వండి. ఈ కొద్ది సమయం మీ సంస్థకేమీ నష్టం కలిగించదని గుర్తించండి. ఇది మీ మెదడును, మిమ్మల్ని హుషారుగా ఉంచుతుంది. కుర్చీలో నిటారుగా: ఆఫీస్ కుర్చీలు ఎంతసేపు కూర్చున్నా సౌకర్యంగానే ఉంటాయి. అలా అని ఎలా పడితే అలా కూర్చోవద్దు. ఇది మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. మీ వెన్ను కుర్చీకు ఆన్చి నిటారుగా కూర్చొని పనిచేయండి. నిద్ర: మీ శరీరానికి సరిపడా నిద్రించండి. 30 నిమిషాలు తక్కువైనా ఆ రోజంతా మెదడు, శరీరం చురుకుగా ఉండవు. ఇది దీర్ఘకాలిక దుష్ర్పభావాలు చూపుతుంది. వారాంతాలు సహా రోజుకు ఎనిమిది గంటల నిద్ర శరీరానికి మంచిది. కెఫైన్‌కు నో: కెఫైన్ నిద్రను చెడగొడుతుందని తెలిసిందే. సాధ్యమైనంత వరకూ రాత్రిపూట కాఫీ, టీ, సాఫ్ట్‌డ్రింక్‌లను దూరం పెట్టండి. ఉదయాన్నే గ్లాసుడు పళ్లరసం, సాయంత్రాన ఓ కప్పు గ్రీన్ టీ శరీరానికి మేలు చేస్తాయి. -
జాయ్ ఆఫ్ డాన్స్
కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం.. ఐదంకెల జీతం.. లగ్జరీ లైఫ్. ఇదంతా పైకే. మరోవైపు భరించలేని ఒత్తిడి.. ప్రశాంతత దూరం. ఈ మానసిక వేదనకు చెక్ పెట్టాలనుకున్నారు సరస్వతి. తనలాగే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వారినీ గట్టెక్కించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ‘డ్యాన్స్’తో ఒత్తిడిని చిత్తు చేయవచ్చని నిరూపించారు. డ్యాన్స్ కాంపిటీషన్స పెట్టి ఉద్యోగుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. హైదరాబాద్‌కు చెందిన బొల్ల సరస్వతి రావు సీఏ పూర్తి చేసి కొన్నాళ్లు ఓ కార్పొరేట్ కంపెనీలో ప్రాజెక్ట్ ఫైనాన్స్ కన్సల్టెంట్‌గా పనిచేశారు. ఆ తర్వాత ఇంకొంత కాలం ఇతర కంపెనీల్లో విధులు నిర్వహించారు. ఏ కంపెనీలో చూసినా ఒత్తిడి తప్పలేదు. అందరి పరిస్థితీ ఇదేనని ఆమె గమనించారు. విధులకు కాసింత ఉత్సాహం తోడైతే ఉరిమే ఉల్లాసాన్ని పొందవచ్చని గ్రహించారు. ఇందుకోసం ఆమె డ్యాన్స్‌ను ఎంచుకున్నారు. కార్పొరేట్ ఉద్యోగులకు డ్యాన్స్‌ని వంటబట్టిస్తే చాలు.. కచ్చితంగా మనసు కుదుట పడుతుందని నమ్మారు. ఈ సూత్రాన్ని లయబద్ధం చేసేందుకు ప్రత్యేకంగా ‘చాస్ డ్యాన్స్ స్టూడియో’కి ప్రాణం పోశారు. సదరు కంపెనీల అనుమతి తీసుకుని ఉద్యోగులు పనిచేస్తున్న చోటే నృత్యాక్షరాలు నేర్పిస్తున్నారామె. కేవలం డ్యాన్స్ నేర్పడంతో ఊరుకోకుండా ‘లైమ్లైట్ ఇంటర్-కార్పొరేట్ డ్యాన్స్ కాంపిటీషన్’ను తెరమీదకు తీసుకొచ్చారు. ‘జాయ్ ఆఫ్ డ్యాన్స్’... లాస్ట్ ఇయర్ బెంగళూరులో నిర్వహించిన ఈ కాంపిటీషన్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇన్ఫోసిస్ టీమ్ ఫస్ట్ ప్రైజ్ గెలుచుకుంది. తొలిసారి నగరంలో... మొదటిసారిగా హైదరాబాద్‌లో ఈ పోటీ నిర్వహిస్తున్నారు. నవంబర్ రెండో వారంలో హైటెక్ సిటీ ఇందుకు వేదిక కానుంది. ఒక్కో కార్పొరేట్ కంపెనీ నుంచి 15 మంది సభ్యులకు మించకుండా ఎన్ని గ్రూపులైనా పాల్గొనవచ్చు. విజేతలకు బహుమతులుంటాయి. కాంపిటీషన్ నిర్వహణకు పోను మిగిలిన డబ్బును అనాథ పిల్లలకు డొనేట్ చేస్తున్నామని గురువారం సోవూజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన సవూవేశంలో సరస్వతి చెప్పారు. వివరాలకు 080-41620127లో సంప్రదించవచ్చన్నారు. - మహి -
కూల్ ఖాదీ!
వేసవి వేడికి చెక్ పెట్టాలంటే నూలు దుస్తులదే కీలక పాత్ర. అందులోనూ స్వచ్ఛమైన ఖాదీ దుస్తులైతే పెరుగుతున్న ఉష్ణోగ్రతల ధాటిని నిలువరించి మేనికి హాయినిస్తాయి. పెద్దలు ధరించే దుస్తుల కోటాలో చేరిపోయిన ఖాదీ పిల్లలు, యువత వార్డ్‌రోబ్‌లోనూ ఆకర్షణీయంగా కనువిందుచేయాలంటే... వారి ముస్తాబు మోడ్రన్‌గా మెరిసిపోవాలంటే ఖాదీ దుస్తుల డిజైనింగ్‌లో ఆధునిక హంగులను తీసుకురావాలి. పిల్లలతో పాటు కాలేజీ విద్యార్థులను, కార్పొరేట్ ఉద్యోగులనూ ఆకట్టుకునే కూల్ ఖాదీ దుస్తుల డిజైన్లు ఇవి. 1- కోరా ఖాదీ (హాఫ్‌వైట్) కుర్తా నేటి మహిళకు సరిగ్గా నప్పుతుంది. వంగపండు రంగు డబుల్ థ్రెడ్ ఖాదీ పైజామా దీనికి సరైన ఎంపిక. అధిక వేడిమి వల్ల కలిగే అసౌకర్యాన్ని దూరం చేస్తుంది. కార్పొరేట్ కంఫర్ట్‌కి, కాలేజీ స్టైల్‌కి బాగా సూటవుతుంది. 2-కాలేజీకి వెళ్లే అమ్మాయిల కోసం రూపొందించిన డ్రెస్ ఇది. ‘వి’ నెక్ గల కలంకారి ఖాదీ బ్లౌజ్, ప్రింటెడ్ ఖాదీ స్కర్ట్ ధరిస్తే అటు క్యాజువల్‌గానూ, ఇటు కలర్‌ఫుల్‌గానూ కనిపిస్తారు. 3- టై అండ్ డై ఖాదీ క్లాత్‌తో డిజైన్ చేసిన డ్రెస్ ఇది. పై భాగంలో క్రోచెట్ని జత చేయడంతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. 4- టై అండ్ డై చేసిన ఖాదీ మెటీరియల్‌తో తీర్చిదిద్దిన ఫ్రాక్ ఇది, నర్సాపూర్ క్రోషెట్ను బ్లౌజ్ భాగంలో అమర్చడంతో స్టైల్‌గా రూపుకట్టింది. వంగపండు రంగు కలంకారి ఖాదీ ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన ఫ్రాక్ ఇది. వేసవిలో చమటను పీల్చుకునే ఈ ఫ్యాబ్రిక్ పిల్లలకు అత్యంత సౌకర్యంగా ఉంటుంది. నారింజ రంగు ఇన్నర్ టాప్‌పై బూడిద రంగు ఓవర్‌కోట్ స్కర్ట్ చిన్నారులకు బాగా నప్పుతుంది. ఖాదీ ఫ్యాబ్రిక్ సహజసిద్ధమైనది కనుక పిల్లల లేత చర్మానికి హాయినిస్తుంది. లేత అకుపచ్చ రంగు టై అండ్ డై ఖాదీ ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన స్లీవ్‌లెస్ ఫ్రాక్ ఇది. ఫ్రాక్‌కు బాటమ్‌లో క్రోషెట్తో చిన్న పాకెట్‌ను అమర్చితే డ్రెస్ లుక్ అహ్లాదంగా మారిపోతుంది. కర్టెసి: అరవింద్ జాషువా ఫ్యాషన్ డిజైనర్ హైదరాబాద్