న్యూఢిల్లీ: కార్పొరేట్ కంపెనీల్లో గంటల కొద్దీ పనిచేసే వారు డయాబెటిస్, అధిక రక్తపోటు బారిన పడే అవకాశం ఎక్కువగా ఉందని అధ్యయనంలో వెల్లడైంది. సోమవారం వరల్డ్ డయాబెటిస్ దినోత్సవం సందర్భంగా అపోలో మ్యూనిచ్, నీల్సన్‌ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ చేసిన∙సర్వేలో ఈ మేరకు వెల్లడైంది.
కార్పొరేట్ కంపెనీల్లో పనిచేసే వారిలో ప్రతి ఐదుగురిలో ఒకరు మధుమేహం, అధిక రక్తపోటు బారిన పడుతున్నారని తేలింది. మహిళా ఉద్యోగుల కంటే 13 శాతం ఎక్కువగా పురుషులు ఈ వ్యాధులకు గురవుతున్నారని తెలిపారు. ఆరోగ్య బీమా కలిగిన దాదాపు 8 లక్షల మంది కార్పొరేట్ ఉద్యోగులను సర్వే చేసి ఈ వివరాలు వెల్లడించింది.
కార్పొరేట్ ఉద్యోగులకు డయాబెటిస్!
Published Tue, Nov 15 2016 10:30 AM | Last Updated on Mon, Sep 4 2017 8:10 PM
Advertisement