నాలుగేళ్లు కాపురం చేసి రూ.30 లక్షలు దోచుకున్నాడు
నాకు న్యాయం చేయండి
హిమాయత్‌నగర్: తన భర్త తనను మోసం చేశాడని, నాలుగేళ్లు కాపురం చేసి రూ.30 లక్షలు దోచుకున్నాడని ఆరోపిస్తూ ఓ మహిళ తన కుమార్తెతో కలిసి బాలల హక్కుల సంఘం, మహిళా సంఘాలను ఆశ్రయించింది. ఈ సందర్భంగా మహిళా సంఘం నార్త్‌జోన్ అధ్యక్షురాలు రేఖ, బాలల హక్కుల సంఘం గౌరవ అధ్యక్షులు అచ్యుతరావు గురువారం నారాయణగూడలోని కుబేరా టవర్స్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. బాధితురాలు సరస్వతి మాట్లాడుతూ కేరళకు చెందిన తాము నగరంలోని మల్కాజగిరిలో స్థిరపడినట్లు తెలిపారు. ఔరంగాబాద్‌కు చెందిన పంకజ్ కాంతిలాల్‌సుఖియా(60) ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి తనను లోబరుచుకున్నాడని, 2001లో తాము పెళ్లి చేసుకున్నట్లు తెలిపారు. ఆ తరువాత కొద్దిరోజులు కోదాడలో నివాసం ఉండి, అక్కడి నుంచి హైదరాబాద్‌కు వచ్చామన్నారు.
2007లో తమకు అమ్మాయి పుట్టిందన్నారు. అయితే అతను గత నాలుగేళ్లుగా తనకు తెలియకుండా సంతకాలను ఫోర్జరీ చేసి రూ.30లక్షల వరకు కాజేశాడని. అతనికి గతంలోనే విహహం జరిగినట్లు తెలియడంతోనిలదీయగా, దిక్కున్న చోట చెప్పుకోమంటూ బెదిరిస్తున్నాడన్నారు. పాప చదువు ఖర్చులను భరించడం లేదని, తన సంతకాలను ఫోర్జరీ చేసి లోన్లు తీసుకున్నందున బ్యాంకుల నుంచి తనకు నోటీసులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. మహిళా సంఘం నార్త్ జోన్ అధ్యక్షురాలు రేఖ మాట్లాడుతూ మాయ మాటలు చెప్పి పెళ్లి చేసుకుని ఆర్థికంగా, శారీరకంగా మోసం చేసిన కాంతిలాల్ తక్షణమే తన భార్యకు క్షమాపణ చెప్పాలని, ఆమె పేరుతో తీసుకున్న లోన్లను చెల్లించాలన్నారు. లేని పక్షంలో కవాడిగూడలోని అతని ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. బాలల హక్కుల సంఘం గౌరవ అధ్యక్షులు అచ్యుతరావు మాట్లాడుతూ తన కుమార్తె బ్రింద చదువుతో సంబంధం లేదనడం సమంజసం కాదని, కుమార్తె విద్యాభ్యాసానికి చర్యలు తీసుకోకపోతే చైల్డ్ కమీషన్ నుంచి చర్యలు తీసుకుంటామన్నారు.
అప్పుడు మూడు నెలలకు..
సైబరాబాద్ కమిషనరేట్‌ను ఏర్పాటు చేస్తూ అప్పటి ప్రభుత్వం 2002 నవంబర్‌లో ఉత్తర్వులు జారీ చేసింది. కమిషనర్‌గా మహేందర్‌రెడ్డిని 2003 ఫిబ్రవరిలో నియమించింది. సైబరాబాద్ పోలీసు యాక్ట్ ఆ ఏడాది డిసెంబర్ నుంచి అమలులోకి వచ్చింది. ఇప్పుడు సైబరాబాద్‌ను రెండుగా విభజిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. వీటికి కమిషనర్లను నియమించాల్సి ఉంది. ఐజీ హోదాలో ఉన్న ఐపీఎస్ అధికారులు నవీన్‌చంద్ (వెస్ట్), మహేష్ మురళీధర్ భగవత్‌కు (ఈస్ట్) తొలి కమిషనర్లుగా చాన్స్ దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. రానున్న అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో రెండు కమిషనరేట్లకు విడివిడిగా చట్టాలు ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
ఏ టైంలో ఎవరు కమిషనర్..
2003 నుంచి 2006 డిసెంబర్ అఖరు వరకు మహేందర్‌రెడ్డి
2007 జనవరి నుంచి 2010 డిసెంబర్ వరకు ప్రభాకర్‌రెడ్డి
2011 జనవరి నుంచి 2013 మే 26 వరకు తిరుమలరావు
2013 మే 27 నుంచి ఇప్పటివరకు సీవీ ఆనంద్