Childrens Rights Committee
-
కుమారుడికి తల్లి చిత్రహింసలు
మాట వినడం లేదనే అక్కసుతో కొడుకును చిత్రహింసలు పెడుతున్న తల్లిపై బాలల హక్కుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. వివరాలివీ.. ఎస్‌ఆర్‌నగర్‌కు చెందిన కిరణ్, అపర్ణ దంపతులకు ఆరేళ్ల కుమారుడు ఉన్నాడు. ఇంటి వద్ద అల్లరి చేస్తున్నాడని ఆగ్రహించిన తల్లి అపర్ణ కొడుకును కొట్టి, వాతలు పెట్టింది. దీనిపై తండ్రి కిరణ్ సోమవారం బాలల హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఆమెపై చర్యలు తీసుకుని, కౌన్సెలింగ్ ఇప్పించాలని కోరారు.ఈ ఘటన వివరాలు తెలుసుకున్న సంఘం అపర్ణపై ఆగ్రహం వ్యక్తం చేసింది. -
చిన్నారులపై నేరాలకు వాట్సాప్ అలర్టు
పిల్లలపై ఎలాంటి వేధింపులు జరిగినా వెంటనే స్పందించేందుకు బాలల హక్కుల సంఘం వాట్సాప్ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చింది. బాల కార్మికులు, వీధిబాలలు, మాఫియా చేతిలో బిచ్చగాళ్లుగా మారినా, స్కూల్స్‌లో వేధింపులు, అత్యాచారాలు జరిగినా, ఆఖరకు కుటుంబ సభ్యులు వేధింపులకు గురిచేసినా 9491292424 అనే నంబరుకు వాట్సాప్ చేస్తే వెంటనే స్పందిస్తామని బాలల హక్కుల సంఘం గౌరవాధ్యక్షులు అచ్యుతరావు తెలిపారు. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సంఘం అధ్యక్షురాలు అనూరాధా రావు, స్లేట్ స్కూల్ విద్యార్ధులతో కలిసి వాట్సాప్ నంబర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ... ఈ వాట్సాప్ నంబర్ 24 గంటలు అందుబాటులో ఉంటుందని, ఫిర్యాదు చేసిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని వెల్లడించారు. ఇటీవల ఖైరతాబాద్ పెద్ద వినాయకుని వద్ద ఓ బాలుడు గాంధీ వేశధారణలో భిక్షాటన చేస్తున్నాడని అతన్ని పట్టుకుని హోంకు తరలించి వివరాలు తెలుసుకోగా ... పెద్ద మాఫియా అని గుర్తించినట్లు పిల్లలకు టీ, బన్ ఇచ్చి జనసంచారం ఎక్కువగా ఉన్న చోట భిక్షాటన చేయిస్తున్నారని, పిల్లాడు ప్రతీ రోజు 200 నుంచి 300 వారికి ఇవ్వాలని లేని పక్షంలో వాతలు పెడుతున్నట్లు సదరు బాలుడు తెలిపారని ఆవేదనవ్యక్తం చేశారు. వీధి పిల్లలు ప్రభుత్వ పిల్లలే అని గతంలో ప్రభుత్వాలు తెలిపాయని, ప్రస్తుతం వీధిపిల్లలు భిక్షాటన చేస్తుంటే ప్రభుత్వ పిల్లలు భిక్షాటన చేస్తున్నారా ..? అని ప్రశ్నించారు. తెలుగు రాష్ట్రల్లో పిల్లలు గాని, పెద్దలు గాని భాధ్యత గల ప్రతీ వ్యక్తులు వేధింపులకు గురౌతున్న పిల్లల వివరాలు తమకు వాట్సాప్ ద్వారా అందించాలని పిలుపునిచ్చారు. -
నాలుగేళ్లు కాపురం చేసి రూ.30 లక్షలు దోచుకున్నాడు
నాకు న్యాయం చేయండి హిమాయత్‌నగర్: తన భర్త తనను మోసం చేశాడని, నాలుగేళ్లు కాపురం చేసి రూ.30 లక్షలు దోచుకున్నాడని ఆరోపిస్తూ ఓ మహిళ తన కుమార్తెతో కలిసి బాలల హక్కుల సంఘం, మహిళా సంఘాలను ఆశ్రయించింది. ఈ సందర్భంగా మహిళా సంఘం నార్త్‌జోన్ అధ్యక్షురాలు రేఖ, బాలల హక్కుల సంఘం గౌరవ అధ్యక్షులు అచ్యుతరావు గురువారం నారాయణగూడలోని కుబేరా టవర్స్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. బాధితురాలు సరస్వతి మాట్లాడుతూ కేరళకు చెందిన తాము నగరంలోని మల్కాజగిరిలో స్థిరపడినట్లు తెలిపారు. ఔరంగాబాద్‌కు చెందిన పంకజ్ కాంతిలాల్సుఖియా(60) ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి తనను లోబరుచుకున్నాడని, 2001లో తాము పెళ్లి చేసుకున్నట్లు తెలిపారు. ఆ తరువాత కొద్దిరోజులు కోదాడలో నివాసం ఉండి, అక్కడి నుంచి హైదరాబాద్‌కు వచ్చామన్నారు. 2007లో తమకు అమ్మాయి పుట్టిందన్నారు. అయితే అతను గత నాలుగేళ్లుగా తనకు తెలియకుండా సంతకాలను ఫోర్జరీ చేసి రూ.30లక్షల వరకు కాజేశాడని. అతనికి గతంలోనే విహహం జరిగినట్లు తెలియడంతోనిలదీయగా, దిక్కున్న చోట చెప్పుకోమంటూ బెదిరిస్తున్నాడన్నారు. పాప చదువు ఖర్చులను భరించడం లేదని, తన సంతకాలను ఫోర్జరీ చేసి లోన్లు తీసుకున్నందున బ్యాంకుల నుంచి తనకు నోటీసులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. మహిళా సంఘం నార్త్ జోన్ అధ్యక్షురాలు రేఖ మాట్లాడుతూ మాయ మాటలు చెప్పి పెళ్లి చేసుకుని ఆర్థికంగా, శారీరకంగా మోసం చేసిన కాంతిలాల్ తక్షణమే తన భార్యకు క్షమాపణ చెప్పాలని, ఆమె పేరుతో తీసుకున్న లోన్లను చెల్లించాలన్నారు. లేని పక్షంలో కవాడిగూడలోని అతని ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. బాలల హక్కుల సంఘం గౌరవ అధ్యక్షులు అచ్యుతరావు మాట్లాడుతూ తన కుమార్తె బ్రింద చదువుతో సంబంధం లేదనడం సమంజసం కాదని, కుమార్తె విద్యాభ్యాసానికి చర్యలు తీసుకోకపోతే చైల్డ్ కమీషన్ నుంచి చర్యలు తీసుకుంటామన్నారు. అప్పుడు మూడు నెలలకు.. సైబరాబాద్ కమిషనరేట్‌ను ఏర్పాటు చేస్తూ అప్పటి ప్రభుత్వం 2002 నవంబర్‌లో ఉత్తర్వులు జారీ చేసింది. కమిషనర్‌గా మహేందర్‌రెడ్డిని 2003 ఫిబ్రవరిలో నియమించింది. సైబరాబాద్ పోలీసు యాక్ట్ ఆ ఏడాది డిసెంబర్ నుంచి అమలులోకి వచ్చింది. ఇప్పుడు సైబరాబాద్‌ను రెండుగా విభజిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. వీటికి కమిషనర్లను నియమించాల్సి ఉంది. ఐజీ హోదాలో ఉన్న ఐపీఎస్ అధికారులు నవీన్‌చంద్ (వెస్ట్), మహేష్ మురళీధర్ భగవత్‌కు (ఈస్ట్) తొలి కమిషనర్లుగా చాన్స్ దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. రానున్న అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో రెండు కమిషనరేట్లకు విడివిడిగా చట్టాలు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఏ టైంలో ఎవరు కమిషనర్.. 2003 నుంచి 2006 డిసెంబర్ అఖరు వరకు మహేందర్‌రెడ్డి 2007 జనవరి నుంచి 2010 డిసెంబర్ వరకు ప్రభాకర్‌రెడ్డి 2011 జనవరి నుంచి 2013 మే 26 వరకు తిరుమలరావు 2013 మే 27 నుంచి ఇప్పటివరకు సీవీ ఆనంద్ -
తల్లిదండ్రులు వేధిస్తున్నారని...
కాచిగూడ(హైదరాబాద్): నిత్యం తల్లిదండ్రులు వేధిస్తున్నారంటూ ఓ బాలిక సోమవారం నారాయణగూడలోని బాలల హక్కుల సంఘాన్ని ఆశ్రయించింది. బోడుప్పల్ ఇందిరానగర్ ప్రాంతానికి చెందిన జ్యోతిరాణి, శ్రీనివాస్ దంపతుల కూతురు ఐశ్వర్య. లాలాగూడలోని రైల్వే గర్ల్స్ హైస్కూల్లో 7వ తరగతి చదువుతోంది. శ్రీనివాస్ ఆటో డ్రైవర్. తల్లిదండ్రులు ఇద్దరు మద్యానికి బానిలసై ఆమెను స్కూల్ మాన్పించి, పనిలో పెట్టారు. ఆమెతోనే మద్యం తెప్పించుకుని, గ్లాసుల్లో పోసి తెమ్మనేవారు. ఆమెను తండ్రి శ్రీనివాస్ లైంగిక వేధించేవాడు. అందుకు తల్లి అంగీకరించేది. తన తల్లే తనను సవతిగా చూస్తూ చెప్పుకోడానికి వీలులేని విధంగా తిడుతూ చిత్రహింసలకు గురి చేస్తోంది. ఆమెను చంపేందుకు తల్లి ఇటీవల ఓ బస్సు కిందకు నెట్టివేసే ప్రయత్నం చేసింది. శనివారం కత్తితో పొడవడానికి కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో ఆ బాలిక తల్లిదండ్రులు చంపేస్తారని, వారివద్ద తనకు రక్షణలేదని భావించి ఆమె బాలల హక్కుల సంఘాన్ని వేడుకుంది.. తన మనుమరాలు ఐశ్వర్యను దొంగతనం చేయాలని తల్లిదండ్రులు బలవంతం చేస్తున్నారని ఆ బాలిక అమ్మమ్మ ప్రేమ తెలిపింది. తన కూతురే ఇలా చేయడంతో తనమనుమరాలు ఐశ్వర్యకు ప్రాణహానీ ఉందని, తన కూతురు ఇంటికి మనుమరాలిని పంపించేది లేదని కరాఖండిగా చెప్పింది. ఐశ్వర్యకు చదువు చెప్పించి రక్షణ కల్పించి ఆదుకోవాలని ఆమ్మమ్మ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా బాలల హక్కుల సంఘం గౌరవ అధ్యక్షులు అచ్యుతరావు మాట్లాడుతూ బాలికను వేధిస్తున్న తల్లిదండ్రులపై కేసు నమోదు చేయించి వారిపై చర్యలు తీసుకునేలా చేస్తామని తెలిపారు. వారిపై చర్యలు తీసుకునే వరకు బాలల హక్కుల సంఘం పోరాడుతుందని తెలిపారు. ఐశ్వర్యకు ఇద్దరు చెల్లెళ్లు, ఒక తమ్ముడు ఉన్నారు. -
ప్రత్యూషను నిమ్స్‌కు తరలించాలి
బాలల హక్కుల సంఘం డిమాండ్ హైదరాబాద్: సవతితల్లి చేతిలో తీవ్రంగా గాయపడి గ్లోబల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రత్యూషను నిమ్స్‌కు తరలించాలని బాలల హక్కుల సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ప్రత్యూషను ఆదుకునేందుకు చాలా మంది దాతలు ముందుకు వచ్చారని, ఇప్పటి వరకు రూ.1.75 లక్షలు విరాళంగా వచ్చాయని వెల్లడించింది. అయితే, ఆస్పత్రి యాజమాన్యం ప్రత్యూషకు ఉచితంగా వైద్యం చేస్తున్నట్లు ప్రకటిస్తూనే.. దాతల ద్వారా వచ్చిన ఆర్థిక సహాయాన్ని వైద్య ఖర్చుల కింద సొంత ఎకౌంట్లో జమ చేసుకుంటోందని ఆరోపించింది. రూ.1.22 లక్షలు వైద్య ఖర్చుల కింద చూపుతూ, రూ.55 వేలు మాత్రమే బ్యాలెన్స్ చూపిస్తోందని ఆరోపించింది. దాతల నుంచి అందిన ఆర్థిక సహాయంపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆస్పత్రి యాజమాన్యాన్ని డిమాండ్ చేసింది. కాగా, ఆస్పత్రిలో ప్రత్యూషకు రక్షణగా ఉన్న కానిస్టేబుల్ స్థానంలో తల్లిలా ఆదరించే మహిళా పోలీసులను రక్షణగా ఏర్పాటు చేయాలని బాలల హక్కుల సంఘం అధ్యక్షురాలు అనురాధరావు పోలీసు యంత్రాంగానికి విజ్ఞప్తి చేశారు. హైకోర్టు పేరు చెప్పి బాలల హక్కుల సంఘం ప్రతినిధులు.. ప్రత్యూషను కలవకుండా అడ్డుకుంటున్న ఆస్పత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరారు. డిశ్చార్జ్ సమయంలో తిరిగి ఇస్తాం: డాక్టర్ రవీంద్రనాథ్, గ్లోబల్ ఆస్పత్రి సీఎండీ ప్రత్యూష వైద్యానికి దాతలు అందించిన డబ్బులను ఆస్పత్రి యాజమాన్యం వైద్య ఖర్చులకు వాడుకుంటున్నట్లు వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని గ్లోబల్ ఆస్పత్రి సీఎండీ రవీంద్రనాథ్ వివరణ ఇచ్చారు. ఆమెకు ఉచితంగా వైద్యం చేస్తున్నామని, ఇప్పటికే ఆ విషయాన్ని కోర్టుకు కూడా తెలిపామన్నారు. ప్రత్యూష డిశ్చార్జైన సమయంలో అధికారుల సమక్షంలో డబ్బులను తిరిగి ఇచ్చివేస్తామని తెలిపారు. -
బాలుడిపై థర్డ్‌డిగ్రీ!
యాకుత్‌పురా: దాడి కేసులో అరెస్టైన ఓ బాలుడిపై పోలీసులు థర్డ్‌డిగ్రీ ప్రయోగించారనే ఆరోపణలు రావడంతో పాతబస్తీలో కలకలం రేగింది. థర్డ్‌డిగ్రీ ప్రయోగించిన భవానీనగర్ ఇన్స్పెక్టర్ను వెంటనే సస్పెండ్ చేయాలని ఎంబీటీ నాయకులతో పాటు బాలల హక్కుల సంఘం నేతలు డిమాండ్ చేశారు. అయితే అలాంటిదేమీ జరగలేదని పోలీసులు అంటున్నారు. భవానీనగర్ ఎస్సై నార్ల శ్రీశైలం తెలిపిన వివరాల ప్రకారం... తలాబ్‌కట్టా చాచా గ్యారేజీకి చెందిన మహ్మద్ చాంద్ (24), అబ్దుల్ బిన్ మెహఫేజ్ (15) అన్నదమ్ములు. సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు రెయిన్బజార్కి చెందిన మహ్మద్ ముజఫర్ (24)పై మహ్మద్ చాంద్, మెహఫేజ్ (15) కత్తులతో దాడికి పాల్పడ్డారు. తీవ్ర గాయాలపాలైన ముజఫర్ వెంటనే భవానీనగర్ పోలీసులను ఆశ్రయించాడు. అతనిని ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. దాడికి పాల్పడిన వారిలో ఒకడైన మెహఫేజ్ను మంగళవారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చగా బెయిల్‌పై విడుదలయ్యాడు. మహ్మద్ చాంద్ పరారీలో ఉన్నాడు. కాగా, తలాబ్కట్టాకి చెందిన బాలుడు అబ్దుల్ బిన్ మెహఫేజ్ (15)పై భవానీనగర్ పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించి చితకబాదారని ఆజంపురా కార్పొరేటర్, ఎంబీటీ నాయకుడు అంజదుల్లాఖాన్ ఆరోపించారు. బాధితుడిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారన్నారు. బాలల హక్కుల సంఘం ఖండన మెహఫేజ్పై పోలీసులు థర్డ్‌డిగ్రీ ప్రయోగించడాన్ని బాలల హక్కుల సంఘం తీవ్రంగా ఖండించింది. అక్కడి స్టేషన్ హౌజ్ఆఫీసర్ను వెంటనే తొలగించి విచారణ జరిపించాలని సంఘం అధ్యక్షురాలు అనురాధ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. -
ఉట్టిపై బెట్టు!
* ఉత్సవాల్లో పాల్గొనేందుకు పిల్లలను అనుమతించేది లేదంటున్న బాలల హక్కుల కమిషన్ ఉత్సవాల్లో పిల్లలు పాల్గొనడాన్ని నిషేధిస్తే అసలు ఉట్టి ఉత్సవాలే నిర్వహించమంటున్న మండళ్లు సాక్షి, ముంబై: ఉట్టి ఉత్సవాలపై బాలల హక్కుల సంఘం, ఉత్సవ మండళ్లు మొండిపట్టు పడుతున్నాయి. ఉట్టి ఉత్సవాల్లో పిల్లలు పాల్గొనడంపై బాలల హక్కుల సంఘం నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఉత్సవాల సందర్భంగా నిర్వహించే మానవ పిరమిడ్‌లో పిల్లలు కనిపిస్తే సదరు మండలిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాలల హక్కుల సంఘం పోలీసులను ఆదేశించింది. అయితే పిల్లలు పాల్గొనకుండా ఉత్సవాలను నిర్వహించలేమని, పిల్లలు పాల్గొనడంపై ప్రభుత్వం నిషేధం విధిస్తే అసలు ఉత్సవాలనే జరుపుకోమని మండళ్లు తేల్చి చెప్పాయి. ఇలా ఎవరి పట్టు వారు పడుతుండడంతో వివాదం మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది. వేలమంది పాల్గొనే ఉత్సవాల్లో ఉట్టి కొట్టేందుకు మానవ పరిమిడ్‌లను నిర్మిస్తారు. పైన ఆకాశంలో వేలాడే ఉట్టిని కొట్టేందుకు నిర్మించే పిరమిడ్‌లో పెకైక్కి కొట్టేందుకు పిల్లలు పాల్గొంటున్నారు. పెద్దవారు అంతపైకి ఎక్కేందుకు అవకాశం లేకపోవడం, ఎక్కినా వారి బరువును కిందనున్నవారు ఆపే పరిస్థితి ఉండదు. దీంతో పిల్లలను పైకి ఎక్కిస్తుంటారు. అయితే 12 ఏళ్లలోపు పిల్లలు పాల్గొనడాన్ని బాలల హక్కుల కమిషన్ నిషేధించడంతో మండళ్లు ఇరుకునపడ్డాయి. పిల్లలు లేకుండా ఉట్టి ఉత్సవాలను ఎలా నిర్వహించేదంటూ మండళ్లు ఆందోళనకు దిగాయి. చర్చలు విఫలం...: ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు వైద్యవిద్య, ఆరోగ్యశాఖ మంత్రి జితేంద్ర అవ్హాడ్, బాలల హక్కుల సంరక్షణ కమిషన్ కార్యదర్శి ఎ.ఎన్.త్రిపాఠి, దహి హండీ సమన్వయ సమితి అధ్యక్షుడు బాలా పడేల్కర్, వివిధ ఉట్టి ఉత్సవ మండళ్ల పదాధికారులు మంత్రాలయలో సమావేశమై చర్చించారు. ఇరు వర్గాల మధ్య దాదాపు గంటన్నరసేపు చర్చలు జరిగాయి. చివరకు ఎటూ తేలకపోవడంతో మంత్రి చాంబర్ నుంచి అందరూ బయటకు వచ్చారు. ఆ తర్వాత కూడా ప్రభుత్వం ఉట్టి ఉత్సవాల్లో పిల్లలకు కచ్చితంగా అనుమతి వ్వాల్సిందేనని మండళ్ల పదాధికారులు డిమాండ్ చేశౠరు. దీనిపై బాలల హక్కుల కమిషన్ స్పందిస్తూ.. పిల్లలు ఉట్టి ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని స్పష్టం చేసింది. అనుమతి ఇవ్వడంమంటే పిల్లల ప్రాణాలతో చెలగాటమాడడమేనని తెలిపింది. నిషేధాజ్ఞలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలంటూ పునరుద్ఘాటించింది. మండళ్ల పదాధికారులు స్పందిస్తూ... ఇలాగైతే ఈసారి ఉట్టి ఉత్సవాలను నిర్వహించలేమని చెప్పారు. దీంతో ఉట్టి ఉత్సవాల వివాదం ఎటువంటి పరిష్కారానికి నోచుకోకుండానే సమావేశం ముగిసింది. ఆగస్టు 17న శ్రీకృష్ణ జన్మాష్టమి జరుపుకోనున్నారు. అప్పటి వరకు సమస్య పరిష్కారమైతే ఉట్టి ఉత్సవాలు ప్రశాంతంగా జరుగుతాయి. లేదంటే గందరగోళం తప్పదని మండళ్ల పదాధికారులు అంటున్నారు.