చైర్మన్ పదవి ఇవ్వలేదని కౌన్సిలర్ రాజీనామా | counsellor saraswati resigns | Sakshi
Sakshi News home page

చైర్మన్ పదవి ఇవ్వలేదని కౌన్సిలర్ రాజీనామా

Published Thu, Jul 3 2014 1:23 PM | Last Updated on Fri, Aug 10 2018 8:08 PM

counsellor saraswati resigns

అనంతపురం:జిల్లాలోని తాడిపత్రి టీడీపీలో ముసలం రాజుకుంది. చైర్ పర్సన్ అభ్యర్థి పదవి ఆశించి భంగపడిన టీడీపీ కౌన్సిలర్ అభ్యర్థి సరస్వతి తన పదవికి రాజీనామా చేశారు. చైర్ పర్సన్ గా ఆమె ఎన్నిక  దాదాపు పూర్తయినా.. చివర్లో పార్టీ నేతలే ఆమెకు షాక్ ఇచ్చారు. అకస్మాత్తుగా వేరే వ్యక్తిని చైర్ పర్సన్ గా తెరపైకి తీసుకురావడంతో మనస్తాపానికి గురై ఆమె తన పదవికి రాజీనామా చేశారు. చివరి నిమిషంలో టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చక్రం తిప్పడంతోనే సరస్వతికి చుక్కెదురైనట్లు తెలుస్తోంది.


మున్సిపల్ చైర్మన్ పదవి తన దక్కుతుందని సరస్వతికి పార్టీ పెద్దల నుంచి భరోసా లభించినా.. జేసీ రంగప్రవేశంతో అది ఆమెకు దక్కకుండా పోయిందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఈరోజు సాయంత్రానికి సరస్వతి టీడీపీని వీడే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement