ఏఎన్‌యూ: ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ దుబాయ్‌లో ఈ నెల 19 నుంచి 24వ తేదీ వరకు నిర్వహించనున్న అంతర్జాతీయ సదస్సుకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సీడీసీ డీన్, ఎకనామిక్స్ విభాగాధిపతి, బాబూ జగ్జీవన్‌రామ్ అధ్యయన కేంద్రం సమన్వయకర్త ఆచార్య కె.మధుబాబు, యూనివర్సిటీ ఐక్యూఏసీ కో–ఆర్డినేటర్, సోషల్ వర్క్ అధ్యాపకురాలు ఆచార్య సరస్వతి రాజు అయ్యర్ హాజరుకానున్నారు.
ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన ‘బెస్ట్ డిప్లమాట్స్’ నిర్వహిస్తున్న ఈ సదస్సులో 175 దేశాల ప్రతినిధులు పాల్గొంటారు. ప్రపంచవ్యాప్తంగా పలు యూనివర్సిటీలు, పరిశోధనా సంస్థల నుంచి చాలా మంది ఆశావహులు తమ అధ్యయన పత్రాలను పంపగా, వారిలో పలు ప్రమాణాల ఆధారంగా నిర్వాహకులు ఎంపిక చేసిన వారినే సదస్సుకు ఆహ్వా నించారు. వీరిలో ఏఎన్‌యూ నుంచి ఇద్దరు ఉన్నారు.
ఆచార్య కె.మధుబాబు ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ ఆన్ ఇండ్రస్టియల్ సెక్టార్ ఇన్ అండర్ డెవలపింగ్ కంట్రీస్’ అనే అంశంపై, ఆచార్య సరస్వతి రాజు అయ్యర్ ‘ఇంపాక్ట్ ఆఫ్ ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆన్ ఇండస్ట్రీస్ విత్ స్పెషల్ రెఫరెన్స్ టు వియత్నాం’ అనే అంశంపై అధ్యయన పత్రాలు సమర్పించనున్నారు. అంతర్జాతీయ సదస్సులో పాల్గొంటున్న ఏఎన్‌యూ అధ్యాపకులకు వీసీ ఆచార్య పి.రాజశేఖర్, రెక్టార్ ఆచార్య పి.వరప్రసాదమూర్తి, రిజిస్టార్ ఆచార్య బి.కరుణ, యూనివర్సిటీ అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment