Madhubabu
-
అంతర్జాతీయ సదస్సుకు ఏఎన్‌యూ అధ్యాపకులు
ఏఎన్‌యూ: ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ దుబాయ్‌లో ఈ నెల 19 నుంచి 24వ తేదీ వరకు నిర్వహించనున్న అంతర్జాతీయ సదస్సుకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సీడీసీ డీన్, ఎకనామిక్స్ విభాగాధిపతి, బాబూ జగ్జీవన్‌రామ్ అధ్యయన కేంద్రం సమన్వయకర్త ఆచార్య కె.మధుబాబు, యూనివర్సిటీ ఐక్యూఏసీ కో–ఆర్డినేటర్, సోషల్ వర్క్ అధ్యాపకురాలు ఆచార్య సరస్వతి రాజు అయ్యర్ హాజరుకానున్నారు. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన ‘బెస్ట్ డిప్లమాట్స్’ నిర్వహిస్తున్న ఈ సదస్సులో 175 దేశాల ప్రతినిధులు పాల్గొంటారు. ప్రపంచవ్యాప్తంగా పలు యూనివర్సిటీలు, పరిశోధనా సంస్థల నుంచి చాలా మంది ఆశావహులు తమ అధ్యయన పత్రాలను పంపగా, వారిలో పలు ప్రమాణాల ఆధారంగా నిర్వాహకులు ఎంపిక చేసిన వారినే సదస్సుకు ఆహ్వా నించారు. వీరిలో ఏఎన్‌యూ నుంచి ఇద్దరు ఉన్నారు. ఆచార్య కె.మధుబాబు ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్ ఆన్ ఇండ్రస్టియల్ సెక్టార్ ఇన్ అండర్ డెవలపింగ్ కంట్రీస్’ అనే అంశంపై, ఆచార్య సరస్వతి రాజు అయ్యర్ ‘ఇంపాక్ట్ ఆఫ్ ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆన్ ఇండస్ట్రీస్ విత్ స్పెషల్ రెఫరెన్స్ టు వియత్నాం’ అనే అంశంపై అధ్యయన పత్రాలు సమర్పించనున్నారు. అంతర్జాతీయ సదస్సులో పాల్గొంటున్న ఏఎన్‌యూ అధ్యాపకులకు వీసీ ఆచార్య పి.రాజశేఖర్, రెక్టార్ ఆచార్య పి.వరప్రసాదమూర్తి, రిజిస్టార్ ఆచార్య బి.కరుణ, యూనివర్సిటీ అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. -
గ్యాంగ్ వార్
‘మంగళ’, ‘క్రిమినల్స్’ వంటి వైవిధ్యమైన చిత్రాలను నిర్మించిన మంత్ర ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రూపొందుతోన్న మరో డిఫరెంట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘వెపన్’. అవినాష్, ప్రదీప్ రావత్, రాజారాయ్, రాజు, మధుబాబు ప్రధాన పాత్రల్లో ఆర్.ఎస్.సురేష్ దర్శకత్వంలో శర్మ చుక్కా నిర్మిస్తున్న ఈ సినిమా చివరి షెడ్యూల్ మార్చి 20న మొదలవుతుంది. శర్మ చుక్కా మాట్లాడుతూ– ‘‘రెండు గ్యాంగ్‌ల మధ్య జరిగే వార్ నేపథ్యంలో రూపొందుతోన్న చిత్రమిది. టైటిల్‌కి పూర్తి జస్టిఫికేషన్ ఇచ్చే కథాంశంతో మా సినిమా ఉంటుంది. మా బ్యానర్లో వచ్చిన ‘మంగళ, క్రిమినల్స్’ చిత్రాల కంటే ‘వెపన్’ మంచి విజయం సాధిస్తుందని నమ్మకంగా చెప్పగలను. 90 శాతం చిత్రీకరణ పూర్తయింది. వేసవిలో రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సబ్బారపు ప్రకాష్. -
‘గీతోపదేశం’ ఎవరికోసం?
యజత్, ఉషా జంటగా రూపొందుతోన్న చిత్రం ‘గీతోపదేశం’. జిన్నా దర్శకత్వంలో జె.మధుబాబు నిర్మిస్తున్న ఈ చిత్రం గురువారం హైదరాబాద్‌లో మొదలైంది. ముహూర్తపు దృశ్యానికి నిర్మాత తండ్రి నాగేంద్రం కెమెరా స్విచాన్ చేయగా, టి.ప్రసన్నకుమార్ క్లాప్ ఇచ్చారు. వీఎన్ ఆదిత్య గౌరవ దర్శకత్వం వహించారు. పురాణాలను గుర్తు చేసే కథాంశమిదని, నాలుగున్నరేళ్లు కష్టపడి ఈ కథ తయారు చేశామని దర్శకుడు చెప్పారు. 40 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసి, జనవరి 3న పాటలను, అదే నెలాఖరులో సినిమాను విడుదల చేస్తామని, ఇందులో విలన్‌గా నటిస్తున్నానని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: రాహుల్-వెంగీ, కెమెరా: రాహుల్ మాచినేని, ఎడిటింగ్: డి.రాజా.