ముథోల్ : బాసరలోని ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ప్రవేశం కోసం బుధవారం కౌన్సెలింగ్ ప్రక్రియ షురూ అయింది. తొలిరోజు కౌన్సెలింగ్ ప్రక్రియ సజావుగా ముగిసింది. 500 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 30 మంది గైర్హాజరయ్యారు. హాజరైన విద్యార్థుల పదో తరగతి, ఇతర ధ్రువీకరణ పత్రాలను అధికారులు పరిశీలించారు. డెరైక్టర్ రాజేందర్ సాహూ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్ల ద్వారా విద్యార్థులు, వారి తల్లిదండ్రుల సందేహాలు నివృత్తి చేశారు. గురువారం మరో 500 మంది విద్యార్థులకు కౌన్సెలింగ్ ఉంటుందని ఆయన తెలిపారు. వెయిటింగ్ లిస్టులో పేరున్న విద్యార్థులకు ఈనెల 28న కౌన్సెలింగ్ ఉంటుం దని చెప్పారు.
తొలిరోజు విద్యార్థితోపాటు అతడి వెంట వచ్చిన ఒకరికి ఉచితంగా భోజన సౌకర్యం కల్పించారు. బాసర ఎస్సై నాగరాజు ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు నిర్వహించారు. కౌన్సెలింగ్ ప్రక్రియలో అసిస్టెంట్ రిజిస్ట్రార్ రహమాన్, ఎస్‌డబ్ల్యూవో బాలకిషన్‌రెడ్డి, పర్యవేక్షణ అధికారి కరీముల్లాఖాన్, బాసర జేఏసీ చైర్మన్ డాక్టర్ విజయ్‌కుమార్, డాక్టర్ మధుసూదన్, ట్రిపుల్ ఐటీ సిబ్బంది హరికృష్ణగౌడ్, రవివర్మగౌడ్, కొత్తపల్లి, ఈ.రాములు, గణేశ్, శ్రీశైలం పాల్గొన్నారు.
28 నుంచి తరగతులు..
ఈ నెల 28 నుంచి ట్రిపుల్ ఐటీకి ఎంపికైన వి ద్యార్థులకు తరగతులు ప్రారంభిస్తామని ట్రిపు ల్ ఐటీ కళాశాల డెరైక్టర్ రాజేందర్ సాహూ తెలి పారు. కౌన్సెలింగ్‌కు హాజరైన విద్యార్థులు 28 లోగా కళాశాలకు చేరుకోవాలని సూచించారు.
ప్రశాంతంగా ‘ట్రిపుల్ ఐటీ’ కౌన్సెలింగ్
Published Thu, Jul 24 2014 12:49 AM | Last Updated on Sat, Sep 2 2017 10:45 AM
Advertisement