Rajinder
-
హుందాసాగర్‌లో బాలుడి గల్లంతు
మైలార్‌దేవ్‌పల్లిలోని హుందాసాగర్‌లో గురువారం ఓ బాలుడు గల్లంతయ్యాడు. కాటేదాన్ పరిధిలోని శాంతినగర్‌కు చెందిన రాజేందర్(12) అనే బాలుడు తన ఇద్దరి స్నేహితులతో కలిసి హుందాసాగర్కు ఈతకొట్టడానికి వెళ్లారు. చెరువులోకి దిగిన రాజేందర్ ప్రమాదవశాత్తూ మునిగిపోవడంతో ఇద్దరు స్నేహితులు భయపడి స్థానికుల దగ్గరికి వెళ్లి ప్రమాదవిషయం గురించి తెలిపారు. బాలుడి కోసం గాలింపు జరుగుతోంది. -
కార్మికులపై చిన్నచూపు తగదు
కోల్‌బెల్ట్ : సంస్థ లక్ష్యాలను అధిగమించుటకు కృషిచేసిన కార్మికులపై యాజమాన్యం చిన్నచూపు చూడటం సరికాదని సింగరేణి కాలరీస్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ (ఐఎన్టియూసి)కేంద్రకమిటీ ఉపాధ్యక్షుడు పసునూటి రాజేందర్ అన్నారు. పట్టణంలోని బ్రాంచి కార్యాలయం లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మా ట్లాడుతూ అధికలాభాలు వచ్చేందుకు శ్రమించిన కార్మికులకు 20 గ్రాముల బంగారు నాణాలు అందించాలని రాజేందర్ డిమాండ్ చేశారు. సమావేశంలో బ్రాంచి ఉపాధ్యక్షులు సమ్మిరెడ్డి, నాయకులు నర్సింగరావు, ధరియాసింగ్, అశోక్, రాజ్యలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం భూపాలపల్లి బ్రాంచి కమిటీ నాయకులు బాతాల రాజు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అధికలాభాలను ఆర్జించుటకు కృషిచేసిన కార్మికులకు యాజమాన్యం 10 గ్రాముల గోల్డ్ బిల్లలు అందజేయాలని, లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలను చేపడతామన్నారు. సమావేశంలో నాయకులు నామాల శ్రీనివాస్, రాళ్లబండి బాపు, జయశంకర్, కే.లింగయ్య, వైకుంఠం, ఠాగూర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సింగరేణి సంస్థ గత ఆర్థిక సంవత్సరంలో 60.3 మిలియన్ టన్నులను సాధించినందుకు కార్మికులకు 15 గ్రాముల బంగారు బిల్లలను అందజేయాలని బిఎంఎస్ భూపాలపల్లి బ్రాంచి ఉపాధ్యక్షుడు కొండపాక సాంబయ్యగౌడ్ డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు కొమురయ్య, రమేష్, మదునయ్య, బ్రహ్మచారి, స్వామి, సదానందం, చక్రపాణి తదితరులు పాల్గొన్నారు. -
కరీంనగర్ నుంచే కేజీ టు పీజీ
హుస్నాబాద్ రూరల్: ఎన్నికల హామీల్లో భాగంగా కేజీ టు పీజీ విద్యా పథకాన్ని కరీంనగర్ జిల్లా నుంచే ప్రారంభిస్తానని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. హుస్నాబాద్‌లోని వెంకటేశ్వర గార్డెన్లో పార్లమెంటరీ కార్యదర్శి వొడితెల సతీష్‌కుమార్ ఆత్మీయ సన్మాన సభ శుక్రవారం రాత్రి జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన ఈటెల మాట్లాడుతూ.. పద్నాలుగేళ్ల తెలంగాణ ఉద్యమంలో జైళ్లకు వెళ్లి బాధలు భరించిన తెలంగాణ బిడ్డల అభివృద్ధి కోసం, బంగారు రాష్ట్రం నిర్మాణం కోసం కృషి చేస్తామన్నారు. తమకు మంత్రి పదవులు వస్తే తెలంగాణ ప్రజలందరికీ మంత్రి పదవులు వచ్చాయనే సంతోషంతో ఉన్నామన్నారు. ఇది బీద తెలంగాణ కాదని, బీదగా మార్చబడ్డ తెలంగాణ అని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో రూ.17వేల కోట్ల బడ్జెట్‌ను రూపొందించామని నాటి పాలకులు ప్రగల్భాలు పలికారని, తెలంగాణ వస్తే రూ.లక్ష కోట్ల బడ్జెట్‌ను పెట్టిన ఘనత టీఆర్ఎస్ సర్కారుకే దక్కిందన్నారు. ఉమ్మడి సర్కారు హయాంలో రూ.1,030కోట్ల నిధులను పింఛన్ల కోసం వెచ్చిసే..్త తెలంగాణ సర్కారు ఇప్పటికే రూ.4వేల కోట్లు పింఛన్ డబ్బులను పంపిణీ చేయడమే కాకుండా అదనంగా మరో రూ.370కోట్లను విడుదల చేసిందన్నారు. ఏడున్నర ఎకరాల భూమి, నాలుగు గదుల ఇల్లు, ట్రాక్టరు, కారు ఉన్నప్పటికీ వారి ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఆహార భద్రత కార్డును అందించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లు, అంగన్వాడీ కేంద్రాలకు సన్న బియ్యం సరఫరా చేసేందుకు ప్రస్తుతం రెండు లక్షల టన్నుల సన్నబియ్యం నిల్వ ఉంచామన్నారు. సచివాలయాన్ని ఎన్నడూ చూడని తెలంగాణ బిడ్డలు ఈ రోజు ధైర్యంగా వచ్చి చూస్తున్నారన్నారు. సచివాలయానికి వచ్చే వారి వద్దనుంచి చెమట వాసన వస్తున్నదని ఐఏఎస్ అధికారులు వ్యాఖ్యానిస్తే చెమట వాసన వచ్చే ప్రతి ఒక్కరూ తెలంగాణ బిడ్డలేనని గర్వంగా సమాధానమిచ్చామని చెప్పారు. ఫీజు రీయింబర్స్‌మెంటు కోసం రూ.500 కోట్లు తెలంగాణ విద్యార్థుల కోసం రూ.5వేల కోట్ల ని ధులను త్వరలోనే విడుదల చేయనున్నట్లు మంత్రి ఈటెల తెలిపారు. ఫీజు రీయింబర్స్‌మెంటు గురించి కొందరు విద్యార్థులు సమావేశంలో మంత్రిని అడుగగా స్పందించిన ఆయన రేపే నిధుల విడుదల ఫైలుపై సంతకం చేయనున్నట్లు ప్రకటించడంతో విద్యార్థులు హ ర్షధ్వానాలు చేశారు. ఈ సమావేశంలో పార్లమెంటరీ కార్యదర్శి వొడితెల సతీష్‌కుమార్, మాజీ ఎమ్మె ల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, జడ్పీ వైస్‌చైర్మన్ రా యిరెడ్డి రాజిరెడ్డి, న గర పంచాయతీ చైర్మన్ సు ద్దాల చంద్రయ్య, మాజీ జెడ్పీటీసీ కర్ర శ్రీహరి, ఎంపీపీ భూక్య మంగ తదితరులు పాల్గొన్నారు. కమలాపూర్స్కూల్లో అదనంగా 5వ తరగతి విభాగం సాక్షి,హైదరాబాద్: కరీంనగర్ జిల్లా కమలాపూర్‌లోని మహత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ పాఠశాలలో 5వ తరగతికి సంబంధించి అదనంగా 40 సీట్లతో మరో సెక్షన్‌ను ఏర్పాటుచేసేందుకు రూ.82 లక్షలకు పరిపాలనాపరమైన మంజూరు ఇచ్చారు. ఈమేరకు శనివారం రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి టి.రాధ ఆదేశాలు జారీచేశారు. -
ఇద్దరు రైతుల ఆత్మహత్య
వర్షాభావ పరిస్థితులు.. దిగుబడినివ్వని పంటలు.. తీర్చలేని అప్పులు.. వెరసి రైతు సాగులో ‘చితి’కి పోతున్నాడు. దిగుబడి లేక.. పంటకు పెట్టిన పెట్టుబడి కూడా వస్తుందో రాదోనని మనోవేదనకు గురై లక్సెట్టిపేటలోని గోపవాడకు చెందిన మంచికట్ల సంతోష్‌కుమార్(22), సాగుకు చేసిన అప్పులు తీర్చలేక జన్నారం మండలం లోని మురిమడుగు గ్రామానికి చెందిన జాడి రాజలింగు(52) ఆత్మహత్య చేసుకున్నారు. లక్సెట్టిపేట : వర్షాభావ పరిస్థితులతో పంట దిగుబడి రాలేదు. కనీసం పెట్టుబడి డబ్బులు కూడా వస్తాయో లేదోననే బెంగ వారిని మనోవేదనకు గురిచేసింది. మనస్తాపం చెందిన ఇద్ద రు రైతులు వేర్వేరుగా ఆత్మహత్య చేసుకున్నా రు. మండల కేంద్రమైన లక్సెట్టిపేటలోని గోపవాడకు చెందిన మంచికట్ల సంతోష్‌కుమార్(22) ఎకరం భూమిలో పత్తి సాగు చేశాడు. ది గుబడి సరిగా రాలేదు. పెట్టుబడి డబ్బులు కూ డా వస్తాయో రావోనని మనస్తాపం చెందాడు. బుధవారం రాత్రి ఇంటి పెరట్లో పురుగుల మందు తాగాడు. గురువారం ఉదయం కుటుంబ సభ్యులు చూసేసరికి చనిపోయాడు. మృతుడి తండ్రి సత్యనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్సై హామీద్ తెలిపారు. మురిమడుగులో.. జన్నారం : మండలంలోని మురిమడుగు గ్రామానికి చెందిన జాడి రాజలింగు(52) ఇదే గ్రామానికి చెందిన రైతు రామారావు భూమి 5.20ఎకరాలు కౌలుకు తీసుకుని వరి సాగు చేశాడు. పంట కోసం రూ.2.80లక్షలు అప్పు లు చేశాడు. ఇద్దరు కుమారులను ఉపాధి కో సం ముంబయికి పంపించాడు. నెలన్నర రోజు ల క్రితం పెద్ద కుమారుడు రాజేందర్ డెంగీ జ్వరం బారినపడ్డాడు. అతడిని ముంబయి నుంచి తీసుకొచ్చి హైదరాబాద్‌లో చికిత్స చేయించాడు. రూ.80వేలు ఖర్చయింది. రెం డో కుమారుడు రాజేశ్ కూడా డెంగీ జ్వరం బారిన పడగా హైదరాబాద్‌లోనే వైద్యం చేయించాడు. రూ.లక్ష వరకు ఖర్చయింది. పంట సాగు కోసం, పిల్లల వైద్యం కోసం చేసి న అప్పులు ఎలా తీర్చేదని, వర్షాలు ఆలస్యం గా పడడంతో పంట ఆశించిన దిగుబడి రాదని మదనపడుతున్నాడు. అప్పుల భారంతో బుధవారం రాత్రి 10గంటల ప్రాంతంలో రాజలింగు పురుగుల మందు తాగాడు. జన్నారంలో ప్రథమ చికిత్స అనంతరం లక్సెట్టిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం వేకువజామున చనిపోయాడు. మృతుడికి భార్య లక్ష్మి, ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. -
‘ఈటెల'పైనే ఆశలు
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో బుధవారం తొలిసారి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. జిల్లాకు చెందిన రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ఈ తొలి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న నేపథ్యంలో ఆయనపై జిల్లా ప్రజలు గంపెడాశలు పెట్టుకున్నారు. విత్త మంత్రి మనోడే కావడంతో కరీంనగర్ జిల్లాను అభివృద్ధి చేసేందుకు ఏ మేరకు కేటాయింపులు చేస్తారనే అంశంపై చర్చించుకుంటున్నారు. గతంలో పనిచేసిన కేంద్ర, రాష్ట్ర ఆర్థిక మంత్రులు బడ్జెట్లో తమ సొంత జిల్లాలకు ప్రాధాన్యత ఇచ్చేవారు. ఈటెల రాజేందర్ సైతం సొంత జిల్లాపై మమకారం చూపుతారా? లేదా? అనేది మరికొద్ది గంటల్లో తేలనుంది. - కరీంనగర్ సిటీ జిల్లాలో పెండింగ్‌లో ఉన్న మధ్యమానేరు, ఎస్సారెస్పీ వరద కాలువ, ఎల్లంపల్లి సాగునీటి ప్రాజెక్టులకు ఈ బడ్జెట్లో పెద్దపీట వేయనున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టులకు పూర్తిస్థాయిలో నిధులు కేటాయిస్తే సాగు, తాగునీటి కష్టాలు తీరుతాయి. ఏడాదిలోపు మధ్యమానేరు ప్రాజెక్టును పూర్తి చేస్తామని ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో అందుకోసం అవసరమైన రూ.425 కోట్లతో పాటు పరిహారం, పునరావాసం కోసం నిర్వాసితులకు చెల్లించాల్సిన రూ.360 కోట్లను ఈ బడ్జెట్లోనే కేటాయించాలని జిల్లావాసులు కోరుతున్నారు. వరదకాలువ పనులు పూర్తి చేయడంతో పాటు ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్వాసితులకు పూర్తిస్థాయిలో పరిహారం, పునరావాసం కల్పనకు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. హుస్నాబాద్ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు గండిపల్లి, గౌరవెల్లి, తోటపల్లి రిజర్వాయర్లను అప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్ జలయజ్ఞంలో భాగంగా మంజూరు చేశారు. ఆయన మరణానంతరం ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో ఈ మూడు జలాశయాల పనులు అడుగు కూడా ముందుకు కదల్లేదు. టీఆర్ఎస్ సర్కారు ఈ ప్రాజెక్టులకు నిధులు కేటాయించి, పనులు పూర్తి చేయాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. మన ఊరు-మన ప్రణాళికలో భాగంగా జిల్లాలోని చెరువుల పునరుద్ధరణకు పూర్తిస్థాయిలో నిధులు కేటాయించాలని స్థానిక ప్రజాప్రతినిధులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జిల్లాలోని రైల్వే ప్రాజెక్టుల నిర్మాణానికి అయ్యే వ్యయంలో రాష్ట్ర వాటాను ఈ బడ్జెట్లో ఏ మేరకు కేటాయిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యమంత్రి కేసీఆర్ సహా పలువురు మంత్రులు జిల్లాలో పర్యటించిన సందర్భంగా ఇప్పటికే పలు వరాలు ప్రకటించారు. బడ్జెట్లో హామీల అమలుకు తగిన కేటాయింపులు చేస్తామని వాగ్దానం చేసిన నేపథ్యంలో ఆర్థిక మంత్రి తన బడ్జెట్లో సొంత జిల్లాకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తారనే ఆశాభావం ప్రజల్లో నెలకొంది. జిల్లాలో ఏకైక ప్రతిపక్ష ఎమ్మెల్యేగా కొనసాగుతున్న జగిత్యాల శాసనసభ్యుడు టి.జీవన్‌రెడ్డి సైతం జిల్లా సమగ్రాభివృద్ధికి పూర్తిస్థాయిలో నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. అందులో భాగంగా జగిత్యాల నియోజకవర్గంలోని సారంగపూర్ మండలంలో బీపూర్ శివారులో రోళ్లవాగు ప్రాజెక్టు ఆధునికీకరణ పనుల పూర్తికి అవసరమైన రూ.60 కోట్లు కేటాయించాలని, జగిత్యాల, రాయికల్ ప్రాంతాల్లో రక్షిత మంచినీటి పథకానికి అవసరమైన నిధులు సమకూర్చాలని విజ్ఞప్తి చేశారు. ఈ హామీలకు మోక్షం లభించేనా? ఆగస్టు 8న సీఎం కేసీఆర్ జిల్లాకు వచ్చిన సందర్భంగా అనేక వరాలు ప్రకటించారు. కరీంనగర్ జిల్లాను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం ఇచ్చిన ప్రధాన హామీలివే.. కరీంనగర్ నగర పునర్నిర్మాణ పథకం పూర్తి నగరం చుట్టూ రింగురోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు ఎన్టీపీసీలో 4 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు కాకతీయ కెనాల్ కెపాసిటీని 12 వేల క్యూసెక్కుల నుంచి 14 వేల క్యూసెక్కులకు పెంచడం ఎస్సారెస్పీ నీటిని రీజనరేట్ చేసుకోవడానికి చర్యలు వరదకాలువ స్థాయి పెంచడం ఎస్సారెస్పీ పరిధిలో ఎత్తై ప్రాంతాలకు తాగునీరు అందించేందుకు చిన్నపాటి లిఫ్ట్‌లు ఏర్పాటు రాయికల్ వద్ద గోదావరిపై బ్రిడ్జి, చెక్‌డ్యాం నిర్మాణం వేగురుపల్లి-నీరుకుల్ల నడుమ బ్రిడ్జినిర్మాణం మానేరు నదిపై కమాన్‌పల్లి, భూపాలపల్లిని కలుపుతూ వంతెన నిర్మాణం జగిత్యాలను జిల్లాగా ఏర్పాటు చేయడం కొత్తగా ఏడు వ్యవసాయ మార్కెట్లు ఏర్పాటు చేయడం మానకొండూరు చెరువును అభివృద్ధి చేయడం కరీంనగర్లో ఇండోర్ సబ్‌స్టేషన్ ఏర్పాటు రామగుండం నగరానికి తాగునీటి కోసం ఎల్లంపల్లి ప్రాజెక్ట్నుంచి ఒక టీఎంసీ నీటిని తీసుకురావడం రామగుండంలో సింగరేణి ఆధ్వర్యంలో ఆధునాతన హాస్పిటల్ ఏర్పాటు, మైనింగ్ పాలిటెక్నిక్ ఏర్పాటు జిల్లా ఆసుపత్రిని నిమ్స్ తరహాలో అభివృద్ధి చేయడం పెద్దపల్లిలో వందపడకల ఆసుపత్రి నిర్మాణం హుస్నాబాద్ ఆసుపత్రి స్థాయి 50 పడకలకు పెంపు మంథనిలో వంద పడకల ఆసుపత్రి నిర్మాణానికి స్థల సేకరణ కొండగట్టుపైన 300 ఎకరాల స్థలంలో తిరుపతి స్థాయిలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చేయడం ఎమ్మెల్యేల ప్రతిపాదనలకు నిధులు సమకూరే నా? ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఇటీవల అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లో సమావేశమై నియోజకవర్గాల అభివృద్ధికి పలు ప్రతిపాదనలు సమర్పించారు. ఆయా ప్రతిపాదనలన్నింటికీ ఈ బడ్జెట్లోనే నిధులు కేటాయించాలని కోరారు. నియోజకవర్గాల వారీగా పలువురు ఎమ్మెల్యేలు సమర్పించిన బడ్జెట్ ప్రతిపాదనలివే... రామగుండం బీ-థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని జెన్కో ద్వారా విస్తరింపచేయాలి. రామగుండంకు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి తాగునీరు అందించేందుకు నిధులు గోదావరి పుష్కరాల దృష్ట్యా స్నానఘట్టాల నిర్మాణం, నిధులు కేటాయింపు రామగుండంలో మెడికల్ కళాశాల ఏర్పాటు అంతర్గాంలో ఇండస్ట్రియల్ ఎస్టేట్ నిర్మించాలి ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌ను పర్యాటక కేంద్రంగా ఏర్పాటు ఎయిర్‌పోర్టు, ఐటీ పార్క్ ఏర్పాటు హుజూరాబాద్ హుజూరాబాద్, జమ్మికుంట నగరపంచాతీయలకు రూ.120 కోట్లతో తాగునీరు రూ.60 కోట్లతో హుజూరాబాద్ మోడల్ చెరువును రిజర్వాయర్‌గా మార్చడం, ఫిల్టర్‌బెడ్, పైప్లైన్ల నిర్మాణం రూ.60 కోట్లతో జమ్మికుంట నాయిని చెరువు రిజర్వాయర్ రూ.40 కోట్లతో కేసీ క్యాంప్‌లో ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మాణం రూ.18 కోట్లతో హుజూరాబాద్ ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా మార్చడం రూ.30 కోట్లతో ఇల్లందకుంటలో సీపీడడబ్ల్యూఎస్-2 నిర్మాణం మానేరు వాగుపై 11 చెక్‌డ్యాంల నిర్మాణం కోరుట్ల రూ.4.75 కోట్లతో మల్లాపూర్ మండలం సోమన్నగుట్ట అభివృద్ధి, ఘాటురోడ్డు నిర్మాణం రూ.1.50 కోట్లతో ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవన నిర్మాణం కోరుట్ల, మెట్‌పల్లిల్లో రూ.13.75 కోట్లతో తాగునీటి పనులు కోరుట్ల వెటర్నరీ కళాశాలను వెటర్నరీ యూనివర్సిటిగా మార్చాడం కరీంనగర్ కరీంనగర్ రెనోవేషన్‌కు అదనంగా రూ.25 కోట్లు యూజీడీ పనుల పూర్తికి నిధులు కమాన్ నుంచి హౌసింగ్‌బోర్డుకాలనీ మీదుగా సదాశివపల్లికి కొత్త బైపాస్‌రోడ్డు పెద్దపల్లి పెద్దపల్లి-కూనారం నడుమ రైల్వే బ్రిడ్జి ఏర్పాటు పెద్దపల్లి ఆసుపత్రిని వంద పడుకల ఆసుపత్రిగా మార్చడం సుల్తానాబాద్‌లో ఆసుపత్రి భవన నిర్మాణం, వైద్యులకు క్వార్టర్ల నిర్మాణం పది నూతన సబ్స్టేషన్ల నిర్మాణం ఎల్లంపల్లి ప్రాజె క్ట్ నుంచి డీ-83, డీ-86 కాలువకు అనుసంధానం చేయడం సుల్తానాబాద్-మానకొండూరు మండలాలను కలిపే నీరుకుల్ల వాగుపై బ్రిడ్జి నిర్మాణం చొప్పదండి కొంపల్లి రిజర్వాయర్ నుంచి కొండగట్టు పైకి వచ్చే పైప్‌లైన్‌కు అదనంగా రూ.కోటి నిధులు కొండగట్టుపై పీహెచ్సీ ఏర్పాటు గట్టు కింద ఆలయ భూముల్లో వాణిజ్య సముదాయం రుక్మాపూర్‌లో లెదర్పార్క్కు నిధులు కేటాయించాలి మోతె, నారాయణపూర్, పోతారం రిజర్వాయర్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలి కొండగట్టులో మాస్టర్‌ప్లాన్ ఏర్పాటు మంథని మంథని మండలం వీలోచవరం వద్ద గోదావరి నదిపై రూ.630 కోట్లతో డ్యాం, బ్రిడ్జి నిర్మాణం జేఎన్టీయూహెచ్ పూర్తిస్థాయి భవన సముదాయాలు, నిర్వహణ కోసం రూ.200 కోట్లు రూ.25 కోట్లతో సీసీ రోడ్లు, కల్వర్టుల నిర్మాణం పుష్కరాల సందర్భంగా రూ.7.10 కోట్లతో 18 రహదారుల నిర్మాణం, మరమ్మతులు రూ.5 కోట్లతో ఆరెవాగుపై బ్రిడ్జి నిర్మాణం వేములవాడ రుద్రంగి చెరువును రిజర్వాయర్‌గా మార్చడం వేములవాడలో వందపడకల ఆసుపత్రి ఏర్పాటు రూ.11 కోట్లతో వేములవాడ మూలవాగుపై రెండవ బ్రిడ్జి నిర్మాణం రూ.7 కోట్ల వ్యయంతో రెండు బైపాస్‌రోడ్ల విస్తరణ రూ.15 కోట్లతో రోడ్ల నిర్మాణం మానకొండూరు బెజ్జంకిలో 50 పడకల ఆసుపత్రి వేగురుపల్లి నుంచి నీరుకుల్ల వరకు వంతెన నిర్మాణం చెరువులు, రోడ్ల అభివృద్ధి ధర్మపురి ధర్మపురిలో బస్‌డిపో ఏర్పాటు మేడారం ఆసుపత్రి స్థాయి 30 పడుకలకు పెంపు గోదావరి పుష్కరాలకు రూ.500 కోట్ల నిధులు హుస్నాబాద్ నాలుగు సబ్స్టేషన్ల నిర్మాణం వరదనీటిని ఎల్లమ్మ చెరువులోకి పైప్‌లైన్ ద్వారా మళ్లించడం వరదకాలవు నిర్వాసితులకు పరిహారం, ఆర్అండ్ఆర్ ప్యాకేజ -
‘మూగ' గొంతులకు ప్రాణం
జమ్మికుంట : తోటి పిల్లల్లా గలగల మాట్లాడాలని కళలుగన్న ఆ చిన్నారుల ఆశ నెరవేరబోతోంది. పిల్లల గొంతు ఎలా ఉంటుందో విందామన్నా ఆ తల్లిదండ్రుల కోరిక సమీపిస్తోంది. ‘సాక్షి' అందించిన కథనానికి స్పందించిన ప్రభుత్వం ఇన్నాళ్లు మూగబోయిన ఆ గొంతులకు ప్రాణం పోసేం దుకు ముందుకొచ్చింది. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.నాలుగు లక్షలు విడుదల చేస్తూ.. పిల్లలకు మెరుగైన వైద్యం అందించాలంటూ హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రికి లేఖ పంపించింది. మిగిలిన ఖర్చులన్నీ తాను భరిస్తానంటూ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ హామీ ఇవ్వడంతో ఆ కుటుంబంలో సంతోషాలు వెల్లివిరుస్తున్నాయి. జమ్మికుంట మండలం బూజునూర్కు చెందిన కోమాకుల కుమారస్వామి, రజిత దంపతులకు కుమారుడు హేమవంత్, కూతు రు కృష్ణవేణి సంతానం. పిల్లలిద్దరికీ చిన్నప్పుడే గొంతు మూగబోయింది. కళ్లముందే కొడుకు, కూతురు ఇద్దరు తిరుగుతున్నా.. వారి మాట వినే భాగ్యం కలగలేదా దంపతులకు. వారి గొంతుకు ప్రాణం పోసేందుకు ఏడాది కాదు.. రెండేళ్లు కాదు.. పదహారేళ్లు ఉన్నదంతా ఊడ్చిపెట్టి వైద్యం చేయించారు. అయినా లాభం లేకపోయింది. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చూపించగా.. ఖర్చు లక్షల్లో ఉంటుందని అక్కడి వైద్యులు తెలి పారు. అంతమొత్తం ఆ దంపతులకు శక్తికి మిం చిన భారమైంది. అప్పటి నుంచి పిల్లల పరిస్థితిని చూస్తూ కన్నీరుతోనే కాలం వెల్లదీశారు. ఒకే కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతూ.. మాటలు రాకుండా.. చెవులు వినిపించకుండా ఇబ్బందులు పడుతున్న విషయాన్ని ‘సాక్షి’ సెప్టెంబర్ 11న ‘మాట్లాడాలని ఉంది..’ శీర్షికన కథనం ప్రచురించింది. దీనికి స్పందించిన మంత్రి ఈటెల రాజేందర్ చిన్నారుల పరిస్థితిని సీఏం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఈనెల 16న సీఏం రిలీఫ్ నుంచి రూ.4లక్షలు మంజూరు చేయించారు. ఒకరికి ఆపరేషన్ చేస్తే రూ.7.50లక్షల వరకు ఖర్చవుతుందని అపోలో ఆసుపత్రి వైద్యులు తెలిపారు. మొదటి విడత ఒకరికి ఆపరేషన్ చేయాలని, మిగిలిన మొత్తాన్ని తాను సమకూర్చుతానని మంత్రి ఈటెల రాజేందర్ ఆసుపత్రికి హామీ ఇచ్చారు. త్వరలోనే పిల్లల్లో ఒకరికి మాట వస్తుందన్న విషయం తెలుసుకున్న ఆ తల్లిదండ్రుల్లో ఆనందం అంతాఇంతాకాదు. త్వరలోనే ఒకరిని అపోలో ఆసుపత్రికి తీసుకెళ్లి ఆపరేషన్ చేయిస్తామని కుమారస్వామి, రజిత దంపతులు ఆనందంతో చెప్పారు. -
ప్రశాంతంగా ‘ట్రిపుల్ ఐటీ’ కౌన్సెలింగ్
ముథోల్ : బాసరలోని ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ప్రవేశం కోసం బుధవారం కౌన్సెలింగ్ ప్రక్రియ షురూ అయింది. తొలిరోజు కౌన్సెలింగ్ ప్రక్రియ సజావుగా ముగిసింది. 500 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 30 మంది గైర్హాజరయ్యారు. హాజరైన విద్యార్థుల పదో తరగతి, ఇతర ధ్రువీకరణ పత్రాలను అధికారులు పరిశీలించారు. డెరైక్టర్ రాజేందర్ సాహూ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్ల ద్వారా విద్యార్థులు, వారి తల్లిదండ్రుల సందేహాలు నివృత్తి చేశారు. గురువారం మరో 500 మంది విద్యార్థులకు కౌన్సెలింగ్ ఉంటుందని ఆయన తెలిపారు. వెయిటింగ్ లిస్టులో పేరున్న విద్యార్థులకు ఈనెల 28న కౌన్సెలింగ్ ఉంటుం దని చెప్పారు. తొలిరోజు విద్యార్థితోపాటు అతడి వెంట వచ్చిన ఒకరికి ఉచితంగా భోజన సౌకర్యం కల్పించారు. బాసర ఎస్సై నాగరాజు ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు నిర్వహించారు. కౌన్సెలింగ్ ప్రక్రియలో అసిస్టెంట్ రిజిస్ట్రార్ రహమాన్, ఎస్‌డబ్ల్యూవో బాలకిషన్‌రెడ్డి, పర్యవేక్షణ అధికారి కరీముల్లాఖాన్, బాసర జేఏసీ చైర్మన్ డాక్టర్ విజయ్‌కుమార్, డాక్టర్ మధుసూదన్, ట్రిపుల్ ఐటీ సిబ్బంది హరికృష్ణగౌడ్, రవివర్మగౌడ్, కొత్తపల్లి, ఈ.రాములు, గణేశ్, శ్రీశైలం పాల్గొన్నారు. 28 నుంచి తరగతులు.. ఈ నెల 28 నుంచి ట్రిపుల్ ఐటీకి ఎంపికైన వి ద్యార్థులకు తరగతులు ప్రారంభిస్తామని ట్రిపు ల్ ఐటీ కళాశాల డెరైక్టర్ రాజేందర్ సాహూ తెలి పారు. కౌన్సెలింగ్‌కు హాజరైన విద్యార్థులు 28 లోగా కళాశాలకు చేరుకోవాలని సూచించారు. -
యువకుడి దారుణహత్య
మొలతాడుతో ఉరివేసి హత్య విద్యుత్ స్తంభానికి తలను బాదినట్లు ఆనవాళ్లు నమూనాలు సేకరించిన క్లూస్‌టీం మండలంలోని మొలంగూర్ శివారులో ముత్తారం గ్రామానికి చెందిన రాసబత్తుల రాజేందర్(24) దారుణహత్యకు గురయ్యాడు. మొలతాడుతో ఉరివేసి తలను విద్యుత్ స్తంభానికి బాది చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సంఘటన స్థలంలో క్లూస్‌టీం వివరాలు సేకరించింది. మద్యం ఖాళీసీసాతోపాటు ఒక చెప్పు లభించింది. మొలంగూర్కు చెందిన రాసబత్తుల నారాయణ-రాజమ్మ దంపతుల కుమారుడు రాజేందర్ కరీంనగర్లో కారు డ్రైవర్‌గా పనిచేసి ప్రస్తుతం ఇంటి వద్దే ఉంటున్నాడు. రాజేందర్‌కు నెల రోజుల క్రితమే వివాహం కాగా వారం రోజులకు భార్య పుట్టింటికి పోయినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఆదివారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిన రాజేందర్ సోమవారం తెల్లవారుజామున మొలంగూర్ శివారులోని ఎస్సారెస్పీ ఉపకాలువపై శవమై కనిపించాడు. ముత్తారం గ్రామానికి చెందిన ఎర్రబెల్లి రాజయ్య సోమవారం తెల్లవారుజామున వ్యవసాయ బావివద్దకు వెళ్లి కాలువ గట్టుపై ఉన్న నిమ్మ చెట్టుకు నీరు పోస్తుండగా శవం కనిపించింది. వెంటనే సర్పంచ్ రాజయ్యకు సమాచారమివ్వగా ఆయన పోలీసులకు ఈ విషయాన్ని తెలిపారు. హుజూరాబాద్ రూరల్ సీఐ భీమశర్మ, ఎస్సై రవికుమార్ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఎస్సారెస్సీ ఉపకాలువపై రాజేందర్‌కు మద్యం తాగించి హత్యచేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. క్లూస్‌టీం వచ్చి హత్యాస్థలంలో నుంచి నమూనాలు సేకరించారు. రాజేందర్ మొలతాడుతోనే ఉరివేసిన దుండగులు, పక్కన ఉన్న విద్యుత్ స్తంభానికి తలను బాదినట్లు రక్తపు మరకలున్నాయి. మర్మంగాలపై కర్రలతో బాదడంతో తీవ్రరక్తస్రావమైంది. రాజేందర్ తీవ్రంగా ప్రతిఘటించినట్లు సంఘటన స్థలాన్ని బట్టి తెలుస్తోంది. ఆటోడ్రైవర్లను ఎస్సై విచారించారు. ముత్తారం నుంచి ఎవరి ఆటోలో వచ్చాడు. తిరిగి ఎవరెవరూ వెళ్లారనే కోణంలో పోలీసులు విచారణ సాగిస్తున్నారు. రాజేందర్ తల్లిదండ్రులు మాత్రం తమకు ఎవరి మీద అనుమానం లేదని ఫిర్యాదు చేశారు. -
కార్టూనిస్ట్ శేఖర్ పేరిట ఏటా అవార్డులు : ఈటెల
శ్రీనగర్‌కాలనీ, న్యూస్‌లైన్: అనుకున్నది సాధించే వరకు ధైర్యంతో నిరంతరం పోరాడే వ్యక్తిత్వం శేఖర్‌దని మానవతావాదిగా, స్నేహశీలిగా సహోద్యోగులతో ఎంతో అన్యోన్యంగా మెలిగే శేఖర్ మన మధ్య లేకపోవడం విచారకరమని పలువురు ప్రముఖులు అన్నారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఇటీవల అనారోగ్యంతో మరణించిన ప్రముఖ కార్టూనిస్ట్ శేఖర్ సంతాప సభ జరిగింది. కార్యక్రమానికి టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, సీనియర్ కార్టూనిస్ట్ మోహన్, ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె.శ్రీనివాస్, ప్రజాశక్తి అసిస్టెంట్ ఎడిటర్ తులసీదాస్‌తో పాటు వివిధ పత్రికల్లో పనిచేస్తున్న కార్టూనిస్టులు హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈటెల రాజేందర్ మాట్లాడుతూ ఏటా శేఖర్ పేరుపై ప్రముఖ కార్టూనిస్టులకు అవార్డులు అందేలా చూస్తామన్నారు. ఇదే విషయాన్ని ప్రెస్‌కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు ఎన్. రామచందర్ రావు తన సందేశంలో చెప్పారు. ఎంతో ధైర్యంతో, పట్టుదలతో తాను అనుకున్నది సాధించే స్వభావం శేఖర్‌దని కార్టూనిస్టు సుభాని చెప్పారు. కార్టూన్లలో సృజనాత్మకతను, భావాలను వ్యక్త పరచడం, ప్రజల్లో చైతన్యం కలిగించే చిత్రాలను గీయడం శేఖర్ వద్దే నేర్చుకున్నానని మరో కార్టూనిస్టు శంకర్ తెలిపారు. కార్యక్రమంలో పలువురు ప్రముఖలు శేఖర్‌తో తమ అనుభవాలను, అనుభూతులను పంచుకున్నారు. కార్యక్రమంలో సమైక్య భారతి ప్రతినిధి సత్యనారాయణ, సీనియర్ జర్నలిస్టు శంకర్ నారాయణ, దేశపతి శ్రీనివాస్, శేఖర్ సతీమణి చంద్రకళ, కుమార్తె చేతన తదితరులు పాల్గొన్నారు. -
పతంగ్షి‘కారు’
గ్రేటర్లో చిగురిస్తున్న కొత్త మైత్రీబంధం ఎంఐఎం, టీఆర్ఎస్ దోస్తీపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి బల్దియా ఎన్నికల నాటికి బలోపేతం సాక్షి, సిటీబ్యూరో : గ్రేటర్లో పతంగి కారెక్కుతోంది. ఎంఐఎం, టీఆర్ఎస్ పార్టీల మధ్య మైత్రికి తెరలేవడం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. మైనార్టీల సంక్షేమానికి టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలను తు.చ. తప్పకుండా అమలు చేసిన పక్షంలో తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తాజాగా ప్రకటించడంతోపాటు సోమవారం పలువురు టీఆర్ఎస్ నాయకులు ఎంఐఎం నేతలతో సంప్రదింపులు జరపడం పలు ఊహాగానాలకు తెర లేపుతోంది. టీఆర్ఎస్ ముఖ్య నేతలు ఈటెల రాజేందర్, నాయిని నర్సింహారెడ్డి, కేటీఆర్‌లు సోమవారం బంజారాహిల్స్‌లోని ఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుద్దీన్ నివాసానికి వెళ్లి ఆ పార్టీ అధినేత అసదుద్దీన్‌తోపాటు అక్బర్‌తో భేటీ అయ్యారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ఇవ్వాలని, పలు అంశాల్లో కలిసి పని చేసేందుకు తమతో కలిసి రావాలని గులాబీ నేతలు.. ఎంఐఎం అగ్ర నాయకులను కోరినట్లు తెలిసింది. టీఆర్ఎస్తో కలిసి పనిచేసేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే ఎన్నికల ప్రచారంలో చేసిన వాగ్దానాలను అమలు చేయాలని అసద్, అక్బర్లు కోరగా.. అందుకు వారు అంగీకరించినట్లు సమాచారం. నూతన ప్రభుత్వంలో భాగస్వాములుగా చేరాలన్న ప్రతిపాదనలు కూడా వారి ముందుంచినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఒకవేళ ఎంఐఎం టీఆర్ఎస్ ప్రభుత్వంలో చేరితే మంత్రివర్గంలో అక్బరుద్దీన్ ఒవైసీకి కీలక బాధ్యతలు అప్పగించే అంశంపైనా ఉభయ పక్షాల నేతలు చర్చించినట్లు తెలిసింది. అక్బర్‌కు డిప్యూటీ ముఖ్యమంత్రి లేదా మైనార్టీ సంక్షేమ శాఖ వంటి కీలక పోర్ట్‌ఫోలియో అప్పజెబుతామన్న దిశగా కూడా చర్చలు సాగినట్లు తెలిసింది. ఈ భేటీలో ఎంఐఎం ఎమ్మెల్యేలు బలాలా, మిరాజ్ హుస్సేన్, ముంతాజ్ ఖాన్లు పాల్గొన్నారు. అనంతరం అసద్ మీడియాతో సైతం మాట్లాడుతూ సెక్యులరిజాన్ని కాపాడటంతోపాటు అభివృద్ధి కోసం టీఆర్ఎస్తో కలిసి పనిచేసేందుకు సిద్ధమేనని ప్రకటించడం విశేషం. బల్దియా ఎన్నికల్లో కొత్త సమీకరణాలు ఉభయ పార్టీల మధ్య మైత్రి కుదిరిన పక్షంలో ఈ ఏడాది నవంబరులో జరగనున్న బల్దియా ఎన్నికల నాటికి ఇరు పక్షాలు మరింత బలోపేతమయ్యే అవకాశాలున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో ఎంఐఎం ఏడు శాసనసభా స్థానాల్లో గెలుపొందింది, మరో రెండు స్థానాల్లో గణనీయంగా ఓట్లు సాధించింది. ఇక టీఆర్ఎస్ మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందడంతోపాటు మరో ఎనిమిదింట రెండో స్థానంలో నిలిచి సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలోఇరు పార్టీల మైత్రి బలపడితే మహానగరం పరిధిలో బలీయమైన రాజకీయ శక్తిగా ఈ కూటమి అవతరిస్తుందని భావిస్తున్నారు. నగర అభివృద్ధికి ఊతం ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆదివారం దారుస్సలాంలో జరిగిన బహిరంగ సభలో సైతం నగర అభివృద్ధికి ఇదే సరైన సమయమని పేర్కొన్నారు. నగరంలో జరుగుతున్న మతఘర్షణలు నివారించి..అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు తాము టీఆర్ఎస్ ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతిస్తామని ప్రకటించడం విశేషం. టీఆర్ఎస్కు మద్దతిస్తాం టీఆర్ఎస్ ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతిస్తాం. ఉభయ పక్షాల మధ్య చర్చ జరిగిన మాట వాస్తవమే. మైనార్టీల సంక్షేమం, తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం టీఆర్ఎస్తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాం. - అక్బరుద్దీన్ ఒవైసీ, ఎంఐఎం శాసనసభ్యుడు రేపటి నుంచి ఇందోల్‌లో క్రికెట్ టోర్నీ పెద్దేముల్, న్యూస్‌లైన్: మండలంలోని ఇందోల్‌లో యువసేన యూత్ ఆధ్వర్యంలో బుధవారం నుంచి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు ఆర్గనైజర్లు శ్రీకాంత్‌రెడ్డి, జగన్‌రెడ్డి, అంజి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. టోర్నీలో పాల్గొనే జట్లు మంగళవారం వరకు పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. విన్నర్ జట్టుకు రూ.6 వేల నగదు, జ్ఞాపిక, రన్నర్ జట్టుకు రూ.3500 నగదు, జ్ఞాపిక అందజేస్తామన్నారు. వివరాలకు 94918 76694, 90105 61054, 91603 03072 నంబర్లలో సంప్రదించవచ్చు. -
ముస్తాబవుతున్న ‘నుమాయిష్’
=నాంపల్లి ఎగ్జిబిషన్‌గ్రౌండ్‌లో చకచకా ఏర్పాట్లు =46 రోజుల పాటు విజ్ఞానం, వినోదం =కొలువుదీరనున్న 2500 స్టాళ్లు = మెట్రోరైల్ కోచ్ ప్రత్యేకాకర్షణ అబిడ్స్/అఫ్జల్‌గంజ్, న్యూస్‌లైన్: జంటనగరవాసులు, శివారు ప్రాంతాల ప్రజలను 46 రోజుల పాటు వినోద, విజ్ఞానాంశాలతో అలరించేందుకు నుమాయిష్ ముస్తాబవుతోంది. 74వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్)కు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రదర్శన నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జనవరి 1న ప్రారంభమై ఫిబ్రవరి 15 వరకు కొనసాగుతుంది. సొసైటీ ఉపాధ్యక్షులు డాక్టర్ రాజేందర్, గౌరవ కార్యదర్శి అశ్వినీ మార్గం ఆధ్వర్యంలో ప్రభుత్వ, ప్రైవేటు స్టాళ్ల ఏర్పాటుకు సన్నాహాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే 80 శాతం పనులు పూర్తయ్యాయి. నుమాయిష్ ద్వారా వచ్చే ఆదాయాన్ని ఎగ్జిబిషన్ సొసైటీ తెలంగాణ ప్రాంతంలోని విద్యాసంస్థల అభివృద్ధికి కేటాయిస్తుంది. కాగా, ఈసారి తొలిసారిగా ఆర్బీఐ, కార్మిక శాఖలు స్టాళ్లను ఏర్పాటు చేయనున్నాయి. హైదరాబాద్ మెట్రోరైల్ కోచ్ ప్రత్యేక ఆకర్షణ కానుంది. 2500 స్టాళ్లు నుమాయిష్‌లో దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన ఉత్పత్తిదారులు, వ్యాపారస్తులు దాదాపు 2,500 స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు. మన రాష్ట్ర ఉత్పత్తులతో పాటు గుజరాత్, మహారాష్ట్ర, ఒరిస్సా, ఢిల్లీ, అస్సాం, పశ్చిమబెంగాల్, బీహార్, జమ్మూకాశ్మీర్, ఉత్తరాంచల్, తమిళనాడు, కర్నాటక, ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాలకు చెందిన ఉత్పత్తులను ప్రదర్శిస్తారు. చేనేత వస్త్రాలు, డ్రెస్ మెటీరియల్స్, బెడ్షీట్లు, పిల్లో కవర్లతో పాటు గృహోపకరణాలు, గృహాలంకరణ, మహిళల అలంకరణ సామాగ్రి, పిల్లల ఆట వస్తువులు కొలువుదీరనున్నాయి. పటిష్ట భద్రత ఏటా నుమాయిష్‌ను 22 లక్షల మంది సందర్శిస్తుంటారని సొసైటీ ఉపాధ్యక్షులు డాక్టర్ రాజేందర్, గౌరవ కార్యదర్శి అశ్వనీమార్గం తెలిపారు. ఈసారీ అదేరీతిలో సందర్శకులు వచ్చే అవకాశం ఉందన్నారు. పోలీసులతో పాటుగా 300 మంది సొసైటీ వాలంటీర్లు, సెక్యూరిటీ సిబ్బంది భద్రత విధుల్లో పాల్గొంటారన్నారు. ప్రతి సందర్శకుడిని మెటల్, హ్యాండ్ డిటెక్టర్ల ద్వారా తనిఖీ చేశాకే లోనికి అనుమతిస్తామన్నారు. 25 సీసీ కెమెరాలు, 2 డాగ్‌స్క్వాడ్‌లు, 4 ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. పిల్లలకు పండగే..పండగ ఎగ్జిబిషన్ సొసైటీ ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్న ఎమ్యూజ్మెంట్ విభాగం విద్యార్థులు, చిన్నారులను అలరించనుంది. ఇందులో ఏర్పాటు చేసే రంగులరాట్నం, చుక్‌చుక్‌రైలు, సర్కస్, జెయింట్‌వీల్ వంటివి ఆహ్లాదాన్ని పంచనున్నాయి.