వర్షాభావ పరిస్థితులు.. దిగుబడినివ్వని పంటలు.. తీర్చలేని అప్పులు.. వెరసి రైతు సాగులో ‘చితి’కి పోతున్నాడు. దిగుబడి లేక.. పంటకు పెట్టిన పెట్టుబడి కూడా వస్తుందో రాదోనని మనోవేదనకు గురై లక్సెట్టిపేటలోని గోపవాడకు చెందిన మంచికట్ల సంతోష్‌కుమార్(22), సాగుకు చేసిన అప్పులు తీర్చలేక జన్నారం మండలం లోని మురిమడుగు గ్రామానికి చెందిన జాడి రాజలింగు(52) ఆత్మహత్య చేసుకున్నారు.
లక్సెట్టిపేట : వర్షాభావ పరిస్థితులతో పంట దిగుబడి రాలేదు. కనీసం పెట్టుబడి డబ్బులు కూడా వస్తాయో లేదోననే బెంగ వారిని మనోవేదనకు గురిచేసింది. మనస్తాపం చెందిన ఇద్ద రు రైతులు వేర్వేరుగా ఆత్మహత్య చేసుకున్నా రు. మండల కేంద్రమైన లక్సెట్టిపేటలోని గోపవాడకు చెందిన మంచికట్ల సంతోష్‌కుమార్(22) ఎకరం భూమిలో పత్తి సాగు చేశాడు. ది గుబడి సరిగా రాలేదు. పెట్టుబడి డబ్బులు కూ డా వస్తాయో రావోనని మనస్తాపం చెందాడు. బుధవారం రాత్రి ఇంటి పెరట్లో పురుగుల మందు తాగాడు. గురువారం ఉదయం కుటుంబ సభ్యులు చూసేసరికి చనిపోయాడు. మృతుడి తండ్రి సత్యనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్సై హామీద్ తెలిపారు.
మురిమడుగులో..
జన్నారం : మండలంలోని మురిమడుగు గ్రామానికి చెందిన జాడి రాజలింగు(52) ఇదే గ్రామానికి చెందిన రైతు రామారావు భూమి 5.20ఎకరాలు కౌలుకు తీసుకుని వరి సాగు చేశాడు. పంట కోసం రూ.2.80లక్షలు అప్పు లు చేశాడు. ఇద్దరు కుమారులను ఉపాధి కో సం ముంబయికి పంపించాడు. నెలన్నర రోజు ల క్రితం పెద్ద కుమారుడు రాజేందర్ డెంగీ జ్వరం బారినపడ్డాడు. అతడిని ముంబయి నుంచి తీసుకొచ్చి హైదరాబాద్‌లో చికిత్స చేయించాడు. రూ.80వేలు ఖర్చయింది. రెం డో కుమారుడు రాజేశ్ కూడా డెంగీ జ్వరం బారిన పడగా హైదరాబాద్‌లోనే వైద్యం చేయించాడు. రూ.లక్ష వరకు ఖర్చయింది.
పంట సాగు కోసం, పిల్లల వైద్యం కోసం చేసి న అప్పులు ఎలా తీర్చేదని, వర్షాలు ఆలస్యం గా పడడంతో పంట ఆశించిన దిగుబడి రాదని మదనపడుతున్నాడు. అప్పుల భారంతో బుధవారం రాత్రి 10గంటల ప్రాంతంలో రాజలింగు పురుగుల మందు తాగాడు. జన్నారంలో ప్రథమ చికిత్స అనంతరం లక్సెట్టిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం వేకువజామున చనిపోయాడు. మృతుడికి భార్య లక్ష్మి, ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
ఇద్దరు రైతుల ఆత్మహత్య
Published Fri, Dec 26 2014 2:15 AM | Last Updated on Sat, Sep 2 2017 6:44 PM
Advertisement
Advertisement