కన్నీరే మిగిలింది !
కరువు బృందం ఎదుట రైతుల ఆవేదన
తుమకూరు జిల్లాలో పర్యటించిన కరువు బృందం
తుమకూరు : అప్పులు చేసి పంటలు సాగు చేసినా కన్నీరే మిగిలింది... వ్యయప్రయాసల కోర్చి సాగు చేసిన పంటల పరిస్థితి అరణ్య రోదనగా మారింది అంటూ అన్నదాతలు కేంద్ర బృందం ఎదుట వాపోయారు. కరువు పరిస్థితులను అధ్యయనం చేయడానికి వచ్చిన కేంద్ర బృందం గురువారం ఉదయం కొరటిగెరె, మధుగిరి, గుబ్బి తదితర తాలూకాలో పర్యటించింది. కమల్ చౌహాన్ నేతృత్వంలో వచ్చిన బృందం మూడు బృందాలుగా విడిపోరుు జిల్లాలో పర్యటించారు. మొత్తం 130 తాలూకాలలో ఈ ఏడాది కరువు ఛాయలు నెలకొన్నాయని బృందానికి స్థానిక అధికారులు వివరించారు. కరువు బృందం తొలుత బెళదెరె గ్రామంలో ఉన్న రైతు లక్ష్మమ్మకు చెందిన పొలంలో ఎండిపోరుున రాగి పంటను పరిశీలించారు. మహిళా రైతు తిమ్మక్క వద్దకు వచ్చారు. రూ. 80 వేలు అప్పు చేసి పంట పెట్టానని, ఒక్క రూపారుు కూడా వచ్చే పరిస్థితి లేదని ఆమె కరువు బృందం ఎదుట కన్నీరు పెట్టుకుంది.
అక్కడి నుంచి చంపెనహళ్లి గ్రామానికి వెళ్లి మొక్కజొన్న పంటను పరిశీలించారు. కొన్ని రైతు కుటుంబాలు కరువు బృందం వద్ద తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పంటల కోసం రూ. లక్షలు ఖర్చు చేశామని, నీరు లేకపోవడంతో పూర్తిగా ఎండిపోరుుందని, కనీసం పశుగ్రాసం కూడా లేకుండా పోరుుందని ఆవేదన వ్యక్తం చేశారు. కరువు బృందంతో కలెక్టర్ మోహన్‌రాజు, జెడ్పీ సీఈఓ శాంతరాము, ఎమ్మెల్యే సుధాకర్, తహసీల్దార్ రాజన్న, తాలూకా సీఈఓ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
రూ. నాలుగు వేల కోట్లు అవసరం
కరువు పరిహారంగా రూ. 4 వేల కోట్లు ఇవ్వాలని ఇన్‌చార్జ్ మంత్రి జయచంద్ర కరువు బృందానికి విజ్ఞప్తి చేశారు.