యువకుడి దారుణహత్య | Young man's brutal murder | Sakshi
Sakshi News home page

యువకుడి దారుణహత్య

Published Tue, Jun 24 2014 3:10 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

యువకుడి దారుణహత్య - Sakshi

యువకుడి దారుణహత్య

మొలతాడుతో ఉరివేసి హత్య
విద్యుత్ స్తంభానికి తలను బాదినట్లు ఆనవాళ్లు
నమూనాలు సేకరించిన క్లూస్‌టీం

 

మండలంలోని మొలంగూర్ శివారులో ముత్తారం గ్రామానికి చెందిన రాసబత్తుల రాజేందర్(24) దారుణహత్యకు గురయ్యాడు. మొలతాడుతో ఉరివేసి తలను విద్యుత్ స్తంభానికి బాది చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సంఘటన  స్థలంలో క్లూస్‌టీం వివరాలు సేకరించింది. మద్యం ఖాళీసీసాతోపాటు ఒక చెప్పు లభించింది. మొలంగూర్‌కు చెందిన రాసబత్తుల నారాయణ-రాజమ్మ దంపతుల కుమారుడు రాజేందర్ కరీంనగర్‌లో కారు డ్రైవర్‌గా పనిచేసి ప్రస్తుతం ఇంటి వద్దే ఉంటున్నాడు. రాజేందర్‌కు నెల రోజుల క్రితమే వివాహం కాగా వారం రోజులకు భార్య పుట్టింటికి పోయినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఆదివారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిన రాజేందర్ సోమవారం తెల్లవారుజామున మొలంగూర్ శివారులోని ఎస్సారెస్పీ ఉపకాలువపై శవమై కనిపించాడు. ముత్తారం గ్రామానికి చెందిన ఎర్రబెల్లి రాజయ్య సోమవారం తెల్లవారుజామున వ్యవసాయ బావివద్దకు వెళ్లి కాలువ గట్టుపై ఉన్న నిమ్మ చెట్టుకు నీరు పోస్తుండగా శవం కనిపించింది. వెంటనే సర్పంచ్ రాజయ్యకు సమాచారమివ్వగా ఆయన పోలీసులకు ఈ విషయాన్ని తెలిపారు. హుజూరాబాద్ రూరల్ సీఐ భీమశర్మ, ఎస్సై రవికుమార్ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఎస్సారెస్సీ ఉపకాలువపై రాజేందర్‌కు మద్యం తాగించి హత్యచేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు.

క్లూస్‌టీం వచ్చి హత్యాస్థలంలో నుంచి నమూనాలు సేకరించారు. రాజేందర్ మొలతాడుతోనే ఉరివేసిన దుండగులు, పక్కన ఉన్న విద్యుత్ స్తంభానికి తలను బాదినట్లు రక్తపు మరకలున్నాయి. మర్మంగాలపై కర్రలతో బాదడంతో తీవ్రరక్తస్రావమైంది. రాజేందర్ తీవ్రంగా ప్రతిఘటించినట్లు సంఘటన స్థలాన్ని బట్టి తెలుస్తోంది. ఆటోడ్రైవర్లను ఎస్సై విచారించారు. ముత్తారం నుంచి ఎవరి ఆటోలో వచ్చాడు. తిరిగి ఎవరెవరూ వెళ్లారనే కోణంలో పోలీసులు విచారణ సాగిస్తున్నారు. రాజేందర్ తల్లిదండ్రులు మాత్రం తమకు ఎవరి మీద అనుమానం లేదని ఫిర్యాదు చేశారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement