Molangur
-
యువకుడి దారుణహత్య
మొలతాడుతో ఉరివేసి హత్య విద్యుత్ స్తంభానికి తలను బాదినట్లు ఆనవాళ్లు నమూనాలు సేకరించిన క్లూస్‌టీం మండలంలోని మొలంగూర్ శివారులో ముత్తారం గ్రామానికి చెందిన రాసబత్తుల రాజేందర్(24) దారుణహత్యకు గురయ్యాడు. మొలతాడుతో ఉరివేసి తలను విద్యుత్ స్తంభానికి బాది చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సంఘటన స్థలంలో క్లూస్‌టీం వివరాలు సేకరించింది. మద్యం ఖాళీసీసాతోపాటు ఒక చెప్పు లభించింది. మొలంగూర్కు చెందిన రాసబత్తుల నారాయణ-రాజమ్మ దంపతుల కుమారుడు రాజేందర్ కరీంనగర్లో కారు డ్రైవర్‌గా పనిచేసి ప్రస్తుతం ఇంటి వద్దే ఉంటున్నాడు. రాజేందర్‌కు నెల రోజుల క్రితమే వివాహం కాగా వారం రోజులకు భార్య పుట్టింటికి పోయినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఆదివారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిన రాజేందర్ సోమవారం తెల్లవారుజామున మొలంగూర్ శివారులోని ఎస్సారెస్పీ ఉపకాలువపై శవమై కనిపించాడు. ముత్తారం గ్రామానికి చెందిన ఎర్రబెల్లి రాజయ్య సోమవారం తెల్లవారుజామున వ్యవసాయ బావివద్దకు వెళ్లి కాలువ గట్టుపై ఉన్న నిమ్మ చెట్టుకు నీరు పోస్తుండగా శవం కనిపించింది. వెంటనే సర్పంచ్ రాజయ్యకు సమాచారమివ్వగా ఆయన పోలీసులకు ఈ విషయాన్ని తెలిపారు. హుజూరాబాద్ రూరల్ సీఐ భీమశర్మ, ఎస్సై రవికుమార్ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఎస్సారెస్సీ ఉపకాలువపై రాజేందర్‌కు మద్యం తాగించి హత్యచేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. క్లూస్‌టీం వచ్చి హత్యాస్థలంలో నుంచి నమూనాలు సేకరించారు. రాజేందర్ మొలతాడుతోనే ఉరివేసిన దుండగులు, పక్కన ఉన్న విద్యుత్ స్తంభానికి తలను బాదినట్లు రక్తపు మరకలున్నాయి. మర్మంగాలపై కర్రలతో బాదడంతో తీవ్రరక్తస్రావమైంది. రాజేందర్ తీవ్రంగా ప్రతిఘటించినట్లు సంఘటన స్థలాన్ని బట్టి తెలుస్తోంది. ఆటోడ్రైవర్లను ఎస్సై విచారించారు. ముత్తారం నుంచి ఎవరి ఆటోలో వచ్చాడు. తిరిగి ఎవరెవరూ వెళ్లారనే కోణంలో పోలీసులు విచారణ సాగిస్తున్నారు. రాజేందర్ తల్లిదండ్రులు మాత్రం తమకు ఎవరి మీద అనుమానం లేదని ఫిర్యాదు చేశారు. -
కాంగ్రెస్, టీఆర్ఎస్ బాహాబాహీ
శంకరపట్నం, న్యూస్‌లైన్ : మండలంలోని మొలంగూర్‌లో శనివారం కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది. కాంగ్రెస్ జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులకు మద్దతుగా ఎంపీ పొన్నం ప్రభాకర్ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతుండగా టీఆర్ఎస్ కార్యకర్తలు అనుచిత వ్యాఖ్యలు చేయడంతో కాంగ్రెస్ కార్యకర్తలు తిరగబడ్డారు. జెడ్పీటీసీ అభ్యిర్థి బత్తిని శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ టీఆర్ఎస్ ఉద్యమం చేసింది తప్పితే , తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే అన్నారు. అభివృద్ధి చేశాం కాబట్టి తమకే ఓటు అడిగే హక్కు ఉంది అని ప్రసంగిస్తుండగా నలుగురు టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుతగిలారు. గొడవ చేయొ ద్దంటూ పొన్నం సైగలు చేయగా వారు ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. పొన్నం కల్పించుకుని తాము ఒక్క నిమిషం తల్చుకుంటే ఇక్కడ ఉండలేరని గాంధేయవాదంతో ప్రచారం చేస్తున్నామన్నారు. గొడవలకు దారి తీసే పార్టీలకు ప్రజలు ఎన్నికల్లో గుణపాఠం చెబుతారంటూ విమర్శించారు.