కరీంనగర్ నుంచే కేజీ టు పీజీ
హుస్నాబాద్ రూరల్: ఎన్నికల హామీల్లో భాగంగా కేజీ టు పీజీ విద్యా పథకాన్ని కరీంనగర్ జిల్లా నుంచే ప్రారంభిస్తానని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. హుస్నాబాద్‌లోని వెంకటేశ్వర గార్డెన్‌లో పార్లమెంటరీ కార్యదర్శి వొడితెల సతీష్‌కుమార్ ఆత్మీయ సన్మాన సభ శుక్రవారం రాత్రి జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన ఈటెల మాట్లాడుతూ.. పద్నాలుగేళ్ల తెలంగాణ ఉద్యమంలో జైళ్లకు వెళ్లి బాధలు భరించిన తెలంగాణ బిడ్డల అభివృద్ధి కోసం, బంగారు రాష్ట్రం నిర్మాణం కోసం కృషి చేస్తామన్నారు.
తమకు మంత్రి పదవులు వస్తే తెలంగాణ ప్రజలందరికీ మంత్రి పదవులు వచ్చాయనే సంతోషంతో ఉన్నామన్నారు. ఇది బీద తెలంగాణ కాదని, బీదగా మార్చబడ్డ తెలంగాణ అని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో రూ.17వేల కోట్ల బడ్జెట్‌ను రూపొందించామని నాటి పాలకులు ప్రగల్భాలు పలికారని, తెలంగాణ వస్తే రూ.లక్ష కోట్ల బడ్జెట్‌ను పెట్టిన ఘనత టీఆర్‌ఎస్ సర్కారుకే దక్కిందన్నారు.
ఉమ్మడి సర్కారు హయాంలో రూ.1,030కోట్ల నిధులను పింఛన్ల కోసం వెచ్చిసే..్త తెలంగాణ సర్కారు ఇప్పటికే రూ.4వేల కోట్లు పింఛన్ డబ్బులను పంపిణీ చేయడమే కాకుండా అదనంగా మరో రూ.370కోట్లను విడుదల చేసిందన్నారు. ఏడున్నర ఎకరాల భూమి, నాలుగు గదుల ఇల్లు, ట్రాక్టరు, కారు ఉన్నప్పటికీ వారి ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఆహార భద్రత కార్డును అందించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు.
రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లు, అంగన్‌వాడీ కేంద్రాలకు సన్న బియ్యం సరఫరా చేసేందుకు ప్రస్తుతం రెండు లక్షల టన్నుల సన్నబియ్యం నిల్వ ఉంచామన్నారు. సచివాలయాన్ని ఎన్నడూ చూడని తెలంగాణ బిడ్డలు ఈ రోజు ధైర్యంగా వచ్చి చూస్తున్నారన్నారు. సచివాలయానికి వచ్చే వారి వద్దనుంచి చెమట వాసన వస్తున్నదని ఐఏఎస్ అధికారులు వ్యాఖ్యానిస్తే చెమట వాసన వచ్చే ప్రతి ఒక్కరూ తెలంగాణ బిడ్డలేనని గర్వంగా సమాధానమిచ్చామని చెప్పారు.
ఫీజు రీయింబర్స్‌మెంటు కోసం రూ.500 కోట్లు
తెలంగాణ విద్యార్థుల కోసం రూ.5వేల కోట్ల ని ధులను త్వరలోనే విడుదల చేయనున్నట్లు మంత్రి ఈటెల తెలిపారు. ఫీజు రీయింబర్స్‌మెంటు గురించి కొందరు విద్యార్థులు సమావేశంలో మంత్రిని అడుగగా స్పందించిన ఆయన రేపే నిధుల విడుదల ఫైలుపై సంతకం చేయనున్నట్లు ప్రకటించడంతో విద్యార్థులు హ ర్షధ్వానాలు చేశారు. ఈ సమావేశంలో పార్లమెంటరీ కార్యదర్శి వొడితెల సతీష్‌కుమార్, మాజీ ఎమ్మె ల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, జడ్పీ వైస్‌చైర్మన్ రా యిరెడ్డి రాజిరెడ్డి, న గర పంచాయతీ చైర్మన్ సు ద్దాల చంద్రయ్య, మాజీ జెడ్పీటీసీ కర్ర శ్రీహరి, ఎంపీపీ భూక్య మంగ తదితరులు పాల్గొన్నారు.
కమలాపూర్‌స్కూల్‌లో అదనంగా 5వ తరగతి విభాగం
సాక్షి,హైదరాబాద్: కరీంనగర్ జిల్లా కమలాపూర్‌లోని మహత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ పాఠశాలలో 5వ తరగతికి సంబంధించి అదనంగా 40 సీట్లతో మరో సెక్షన్‌ను ఏర్పాటుచేసేందుకు రూ.82 లక్షలకు పరిపాలనాపరమైన మంజూరు ఇచ్చారు. ఈమేరకు శనివారం రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి టి.రాధ ఆదేశాలు జారీచేశారు.