
సాక్షి, అమరావతి: పౌర సరఫరాల శాఖ మంత్రిగా కారుమూరి వెంకట నాగేశ్వరరావు బాధ్యతలు చేపట్టారు. గురువారం సచివాలయంలో తన ఛాంబర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. బీసీలకు ఇచ్చిన ప్రాధాన్యత చరిత్రలో ఎవ్వరు ఇవ్వలేదన్నారు. పౌర సరఫరాల శాఖలో పారదర్శకంగా బాధ్యతలు నిర్వర్తిస్తానన్నారు. సీఎం తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చెయ్యకుండా పనిచేస్తానని కారుమూరి తెలిపారు.
చదవండి: స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఉషా శ్రీ చరణ్
రాజకీయ నేపథ్యం:
2006 నుంచి 2009 వరకు పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్‌గా పనిచేశారు. 2009లో కాంగ్రెస్ తరఫున తణుకు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014లో వైఎస్సార్‌సీపీ తరఫున దెందులూరు నుంచి పోటీచేసి ఓడిపోయారు. 2019లో వైఎస్సార్‌సీపీ తరఫున తణుకు ఎమ్మెల్యేగా గెలిచారు.