
సాక్షి, పశ్చిమగోదావరి: అమరావతి పేరుతో చంద్రబాబు బినామీల రాజధాని కట్టాలని చూశారని పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరారవు మండిపడ్డారు. శనివారం వికేంద్రీకరణకు మద్దతుగా తణుకు నియోజకవర్గంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికి మనల్ని తాకట్టు పెట్టిన వ్యక్తి చంద్రబాబు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం విడిపోవడానికి కారణం చంద్రబాబు అన్నారు. తన స్వార్థం కోసం అసైన్డ్ భూముల చట్టాన్ని కూడా మార్చారని మండిపడ్డారు.
'నూజవీడులో రాజధాని వస్తుందని నమ్మి భూములు కొన్న చాలా మంది రైతులు చనిపోయారు. అమరావతి చుట్టూ తన అనుయాయులతో భూములు కొనిపించారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. అందులో అమరావతి ఉండాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యం. 29 గ్రామాల అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి కాదు. భూములు ఇవ్వమన్న రైతులకు సీపీఎం, సీపీఐ, జనసేన నాడు మద్దతుగా నిలిచి ఇప్పుడు మాట మార్చాయి. 29 గ్రామాల ప్రజలు కోసం మూడు ప్రాంతాల ప్రజలు మోసపోవాలా?. మహా పాదయాత్రతో టీడీపీ ముసుగు తొలిగి పోయింది' అని మంత్రి కారుమూరి నాగేశ్వరారవు వ్యాఖ్యానించారు.
చదవండి: (స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా లేఖను అందించిన కరణం ధర్మశ్రీ)
Comments
Please login to add a commentAdd a comment