Civil Supplies Minister
-
కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌ను కలిసిన ఏపీ మంత్రి కారుమూరి
-
‘ఏపీలో ధాన్యం సేకరణ బ్రహ్మాండంగా జరుగుతోంది’
ఢిల్లీ: కేంద్ర ప్రజా పంపిణీ శాఖ నుంచి ఏపీకి రావాల్సిన రూ. 1702 కోట్ల బకాయిలు వచ్చే వారంలో విడుదల చేస్తామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ హామీ ఇచ్చారని ఏపీ పౌరసరఫరాల శాఖామంతత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు. ఏపీలో ధాన్యం సేకరణ బ్రహ్మండంగా జరుగుతుందని, ఇప్పటికే 13 లక్షల 14 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించిన విషయాన్ని మంత్రి కారుమూరి తెలిపారు. అదే సమయంలో ధాన్యం సేకరణలో భాగంగా రూ. 750 కోట్లు రైతుల ఖాతాలో జమ చేశామన్నారు. ఏపీ ప్రజా పంపిణీ శాఖలో డిజిటలైజేషన్‌పై కేంద్రం అభినందించిందన్నారు. -
ఏపీకి ఇవ్వాల్సిన రూ.1702 కోట్లు చెల్లించండి
ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ వ్యవస్థ చెల్లించాల్సిన 1702 కోట్ల రూపాయలను ఇవ్వాల్సిందిగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు కేంద్రాన్ని కోరారు. 2012-13 ఆర్ధిక సంవత్సరం నుంచి 2017-18 వరకు కేంద్ర ఆహార ప్రజాపంపిణీ శాఖ 1702.90 కోట్లు రూపాయలు బకాయి ఉందని మంత్రి వివరించారు. ఢిల్లీలో గురువారం నాడు కేంద్ర ఆహార ప్రజాపంపిణీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశం లో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన అంశాలపై ఏ కరువు పెట్టారు. ఈ సందర్భంగా కేంద్ర ఆహార ప్రజాపంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయల్ కు ఆయన వినతిపత్రం సమర్పించారు. ఆరేళ్లుగా పెండింగ్ ఉన్న బకాయిలు విడుదల చేయకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పారు. అలాగే 2014-15 ఆర్ధిక సంవత్సరానికి గాను తెలంగాణ బకాయి పడిన 963.07 కోట్లను కూడా ఇప్పించాలని మంత్రి కారు మూరి కోరారు. వీటికి సంబంధించి అవసరమైన డాక్యుమెంట్లను పలుమార్లు కేంద్రానికి సమర్పించామన్నారు. గోనె సంచుల విషయంలో కూడా వరి ధాన్యానికి వినియోగించే గన్నీ బ్యాగులకు నగదును కేంద్రం చెల్లించాలని కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ డిప్యూటీ సెక్రటరీని అయన కోరారు. హమాలీలకు చెల్లించాల్సిన మండి లేబర్ ఛార్జీలు కూడా కేంద్రమే ఇవ్వాల్సి ఉందన్నారు. క్వింటాలుకు 22 రూపాయల వంతున కేంద్ర, రాష్ట్రాల మధ్య ఉన్న ఒప్పందం ప్రకారం 2024-25 ఆర్ధిక సంవత్సరం వరకూ మండి లేబర్ ఛార్జీలు చెల్లించాల్సి ఉందన్నారు. ధాన్య సేకరణ, ప్రజాపంపిణీ వ్యవస్థను మరింత కట్టుదిట్టంగా అమలు చేసేందుకు అవసరమైన సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాల్సిన అవసరం ఉందని మంత్రి కారుమూరి వివరించారు. దీనికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ సమావేశంలో మంత్రి కారుమూరితో పాటు పౌరసరఫరాల శాఖ కమిషనర్ అరుణ్ కుమార్, సంస్థ ఎండీ వీరపాండ్యన్ తదితరులు పాల్గొన్నారు. -
మంత్రిగా కారుమూరి వెంకట నాగేశ్వరరావు బాధ్యతలు
సాక్షి, అమరావతి: పౌర సరఫరాల శాఖ మంత్రిగా కారుమూరి వెంకట నాగేశ్వరరావు బాధ్యతలు చేపట్టారు. గురువారం సచివాలయంలో తన ఛాంబర్లో ప్రత్యేక పూజలు నిర్వహించి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. బీసీలకు ఇచ్చిన ప్రాధాన్యత చరిత్రలో ఎవ్వరు ఇవ్వలేదన్నారు. పౌర సరఫరాల శాఖలో పారదర్శకంగా బాధ్యతలు నిర్వర్తిస్తానన్నారు. సీఎం తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చెయ్యకుండా పనిచేస్తానని కారుమూరి తెలిపారు. చదవండి: స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఉషా శ్రీ చరణ్ రాజకీయ నేపథ్యం: 2006 నుంచి 2009 వరకు పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్‌గా పనిచేశారు. 2009లో కాంగ్రెస్ తరఫున తణుకు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014లో వైఎస్సార్సీపీ తరఫున దెందులూరు నుంచి పోటీచేసి ఓడిపోయారు. 2019లో వైఎస్సార్సీపీ తరఫున తణుకు ఎమ్మెల్యేగా గెలిచారు. -
వాళ్లు రావణుడి భక్తులు.. మంత్రి సంచలన వ్యాఖ్యలు
జైపూర్: ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో 2021 నవంబరు రెండో వారం నుంచి 2022 మార్చి మూడో వారం వరకు పెట్రోలు, డీజిల్ ధరలను ప్రభుత్వం పెంచలేదు. అప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగినా ప్రభుత్వం ఆ భారాన్ని ప్రజలపై మోపలేదు. ఇక, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతీరోజు పెరుగుతూ సామాన్య ప్రజలకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇంధన ధరలు పెంచిన కేంద్ర ప్రభుత్వంపై రాజస్థాన్ ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రతాప్ సింగ్ కచరియావాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతలు రాముడు భక్తులు కాదు.. రావణుడి భక్తులు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ నేతల రాముడి విధానాన్ని పాటించడం లేదని, వాళ్లు రావణుడి పాలసీని పాటిస్తున్నారని విమర్శలు చేశారు. మరో అడుగు ముందుకేసి.. రాముడు అందరినీ సమానంగా చూశాడని.. అదే రావణుడు ఓ మోసగాడు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదే క్రమంలో బీజేపీ ఎలాగైతే.. కశ్మీర్ ఫైల్స్ సినిమా కోసం టికెట్లను పంచిపెడుతున్నారో అలాగే పెట్రోల్, డీజిల్ కోసం కూడా కూపన్లు పంచి పెట్టాలని డిమాండ్ చేశారు. కాగా, ఎనిమిది రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఏడుసార్లు పెరిగాయి. తాజాగా పెరిగిన ధరలతో హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు ధర రూ. 113.61కి చేరుకోగా డీజిల్ ధర రూ.99.83ని టచ్ చేసింది. రేపోమాపో డీజిల్ ధర హైదరాబాద్‌లో వంద రూపాయలను క్రాస్ చేయడం ఖాయమనే పరిస్థితి నెలకొంది. -
లాక్డౌన్ ఉంది ఎలా బతకాలి?.. 'ఆకలితో చస్తే.. చావు'
సాక్షి, బెంగళూరు : ఒకవైపు కోవిడ్ మహమ్మారి, మరోవైపు లాక్డౌన్, ఇటువంటి సమయంలో రేషన్ బియ్యాన్ని తగ్గిస్తే మేమెలా బతకాలి, ఆకలితో చావాలా? అని ప్రశ్నించిన వ్యక్తికి కర్ణాటక పౌర సరఫరా మంత్రి ఉమేశ్ కత్తి వివాదాస్పద సమాధానమిచ్చారు. ఆకలితో చస్తే.. చావు అని మంత్రి చెప్పడంతో అందరూ కంగుతిన్నారు. గదగ జిల్లా కుర్తకోటి గ్రామ రైతు సంఘం కార్యకర్త ఈశ్వర్.. మంత్రికి ఫోన్ చేసి రేషన్ బియ్యం తగ్గించడాన్ని ప్రశ్నించారు. మంత్రి మాట్లాడుతూ ఉత్తర కర్ణాటకలో బియ్యంతో పాటు జొన్నలు ఇస్తున్నాం, వచ్చే నెల నుంచి బియ్యం పెంచుతాం అన్నారు. బియ్యం పంపిణీలో అక్రమాలు జరుగుతున్నాయి, లాక్డౌన్ ఉంది, అప్పటి వరకు ఉపవాసంతో చచ్చేదా? అంటూ ఈశ్వర్ ప్రశ్నించారు. అందుకు కర్ణాటక పౌర సరఫరా మంత్రి ఉమేశ్ కత్తి చావడమే మంచిదని వ్యాఖ్యానిస్తూ తనకు తిరిగి ఫోన్ చేయవద్దంటూ హెచ్చరించారు. ఈ ఆడియో బుధవారం వైరల్ కావడంతో మంత్రి వివరణ ఇచ్చారు. ఫోన్ చేసిన వ్యక్తి మరణించాలా అని అడిగితే సరే అని చెప్పాను. వద్దు అని చెప్పేటంత పెద్ద మనస్సు నాకు లేదు అన్నారు. మంత్రి మాటలపై పలు వర్గాల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తం కావడంతో చివరకు క్షమాణ కోరారు. ఎవరూ మరణించాలని తాను కోరుకోబోనని, అందరికీ మంచి జరగాలనే కోరుకుంటానని చెప్పారు. ఆయన వ్యాఖ్యలపై ప్రతిపక్ష పార్టీలు మండిపడ్డాయి. చదవండి: (ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం.. 150 జిల్లాల్లో లాక్డౌన్?) -
కరీంనగర్ నుంచే కేజీ టు పీజీ
హుస్నాబాద్ రూరల్: ఎన్నికల హామీల్లో భాగంగా కేజీ టు పీజీ విద్యా పథకాన్ని కరీంనగర్ జిల్లా నుంచే ప్రారంభిస్తానని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. హుస్నాబాద్‌లోని వెంకటేశ్వర గార్డెన్లో పార్లమెంటరీ కార్యదర్శి వొడితెల సతీష్‌కుమార్ ఆత్మీయ సన్మాన సభ శుక్రవారం రాత్రి జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన ఈటెల మాట్లాడుతూ.. పద్నాలుగేళ్ల తెలంగాణ ఉద్యమంలో జైళ్లకు వెళ్లి బాధలు భరించిన తెలంగాణ బిడ్డల అభివృద్ధి కోసం, బంగారు రాష్ట్రం నిర్మాణం కోసం కృషి చేస్తామన్నారు. తమకు మంత్రి పదవులు వస్తే తెలంగాణ ప్రజలందరికీ మంత్రి పదవులు వచ్చాయనే సంతోషంతో ఉన్నామన్నారు. ఇది బీద తెలంగాణ కాదని, బీదగా మార్చబడ్డ తెలంగాణ అని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో రూ.17వేల కోట్ల బడ్జెట్‌ను రూపొందించామని నాటి పాలకులు ప్రగల్భాలు పలికారని, తెలంగాణ వస్తే రూ.లక్ష కోట్ల బడ్జెట్‌ను పెట్టిన ఘనత టీఆర్ఎస్ సర్కారుకే దక్కిందన్నారు. ఉమ్మడి సర్కారు హయాంలో రూ.1,030కోట్ల నిధులను పింఛన్ల కోసం వెచ్చిసే..్త తెలంగాణ సర్కారు ఇప్పటికే రూ.4వేల కోట్లు పింఛన్ డబ్బులను పంపిణీ చేయడమే కాకుండా అదనంగా మరో రూ.370కోట్లను విడుదల చేసిందన్నారు. ఏడున్నర ఎకరాల భూమి, నాలుగు గదుల ఇల్లు, ట్రాక్టరు, కారు ఉన్నప్పటికీ వారి ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఆహార భద్రత కార్డును అందించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లు, అంగన్వాడీ కేంద్రాలకు సన్న బియ్యం సరఫరా చేసేందుకు ప్రస్తుతం రెండు లక్షల టన్నుల సన్నబియ్యం నిల్వ ఉంచామన్నారు. సచివాలయాన్ని ఎన్నడూ చూడని తెలంగాణ బిడ్డలు ఈ రోజు ధైర్యంగా వచ్చి చూస్తున్నారన్నారు. సచివాలయానికి వచ్చే వారి వద్దనుంచి చెమట వాసన వస్తున్నదని ఐఏఎస్ అధికారులు వ్యాఖ్యానిస్తే చెమట వాసన వచ్చే ప్రతి ఒక్కరూ తెలంగాణ బిడ్డలేనని గర్వంగా సమాధానమిచ్చామని చెప్పారు. ఫీజు రీయింబర్స్‌మెంటు కోసం రూ.500 కోట్లు తెలంగాణ విద్యార్థుల కోసం రూ.5వేల కోట్ల ని ధులను త్వరలోనే విడుదల చేయనున్నట్లు మంత్రి ఈటెల తెలిపారు. ఫీజు రీయింబర్స్‌మెంటు గురించి కొందరు విద్యార్థులు సమావేశంలో మంత్రిని అడుగగా స్పందించిన ఆయన రేపే నిధుల విడుదల ఫైలుపై సంతకం చేయనున్నట్లు ప్రకటించడంతో విద్యార్థులు హ ర్షధ్వానాలు చేశారు. ఈ సమావేశంలో పార్లమెంటరీ కార్యదర్శి వొడితెల సతీష్‌కుమార్, మాజీ ఎమ్మె ల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, జడ్పీ వైస్‌చైర్మన్ రా యిరెడ్డి రాజిరెడ్డి, న గర పంచాయతీ చైర్మన్ సు ద్దాల చంద్రయ్య, మాజీ జెడ్పీటీసీ కర్ర శ్రీహరి, ఎంపీపీ భూక్య మంగ తదితరులు పాల్గొన్నారు. కమలాపూర్స్కూల్లో అదనంగా 5వ తరగతి విభాగం సాక్షి,హైదరాబాద్: కరీంనగర్ జిల్లా కమలాపూర్‌లోని మహత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ పాఠశాలలో 5వ తరగతికి సంబంధించి అదనంగా 40 సీట్లతో మరో సెక్షన్‌ను ఏర్పాటుచేసేందుకు రూ.82 లక్షలకు పరిపాలనాపరమైన మంజూరు ఇచ్చారు. ఈమేరకు శనివారం రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి టి.రాధ ఆదేశాలు జారీచేశారు. -
‘ఎన్టీఆర్ భరోసా’తో పేదల బతుకుల్లో వెలుగు
గోరంట్ల,న్యూస్‌లైన్ : ఎన్టీఆర్ భరోసా పథకం పేదల జీవితాల్లో వెలుగులు నింపుతుందని పౌరసరఫరాల మంత్రి పరిటాల సునీత అన్నారు. స్థానిక మండల పరిషత్ ఆవరణలో సర్పంచి మంజుల అధ్యక్షతన శనివారం జన్మభూమి గ్రామసభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా మంత్రి మాట్లాడుతూ రూ. 2 కోట్లతో రాప్తాడు, పెనుకొండ, హిందూపురం నియోజవర్గాల్లోని అన్ని గ్రామాలకు పైప్‌లైన్ ద్వారా తాగునీరు అందిస్తామని తెలిపారు. హంద్రీ-నీవా సుజల స్రవంతి ద్వారా జిల్లాలో చెరువులకు నీరందించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు చెప్పారు. ఇప్పటికే 49చెరువులకు నీరందించే కార్యక్రమానికి నిధులు విడుదలయ్యాయని తెలిపారు. పెనుకొండ ఎమ్మెల్యే బి.కె. పార్థసార థి మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు తాగునీరు అందిస్తానని, లేనిపక్షంలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయబోనని స్పష్టం చేశారు. గోరంట్ల మండలంలోని 100గ్రామాల్లో తాగునీటి ఎద్దడి ఉందని, పీఎబీఆర్తో నీటి సమస్య పరిష్కరిస్తామని చెప్పారు. జిల్లా పరిషత్ చైర్మన్ చమన్‌సాబ్ మాట్లాడుతూ 149 చెరువులకు హంద్రీ నీవా ద్వారా నీరు అందిస్తామని చెప్పారు. అంతకు ముందు రూ.50లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన పౌరసరఫరాల గోదామును మంత్రి సునీతప్రారంభించారు. అనంతరం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీమంతాలకు హాజరయ్యారు. కార్యక్రమంలో జేసీ సత్యనారాయణ, ఆర్టీవో రామ్మూర్తి, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ వెంకటేశులు, తహశీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీవో ప్రదీప్‌కుమార్, జెడ్పీటీసీ సభ్యురాలు ఇందిరమ్మ, ఎంపీపీ విద్యాధరణి పాల్గొన్నారు. దళారుల నియంత్రణకే కొనుగోలు కే ంద్రాల ఏర్పాటు హిందూపురం : దళారుల నియంత్రణకే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పరిటాల సునీత తెలిపారు. చిలమత్తూరు మార్కెట్ యార్డు సమీపంలో మార్కెఫెడ్ ఆధ్వర్యంలో వెలుగు మహిళా సంఘాల ద్వారా ఏర్పాటు చేసిన మొక్కజొన్న కోనుగోలు కేంద్రాన్ని మంత్రి శనివారం ప్రారంభించారు. ఎమ్మెల్యే బాలకృష్ణ సూచన మేరకు రైతులకు మేలు జరగాలన్న ఉద్దేశంతో జిల్లాలో క్వింటా రూ.1310 మద్దతు ధరతో ఆరు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో పెనుకొండ ఎమ్మెల్యే బి.కె.పార్థసారథి, మాజీ ఎమ్మెల్యేలు అబ్దుల్ ఘనీ, రంగనాయకులు, జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ, వెలుగు శాఖ ఏడీ సుధాకర్ పాల్గొన్నారు. -
రసాభాస
కరీంనగర్ : జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం వాడీవేడిగా సాగింది. శుక్రవారం జిల్లా పరిషత్ చైర్పర్సన్ తుల ఉమ అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యూరు. కలెక్టర్ వీరబ్రహ్మయ్య, ఎమ్మెల్యేలు టి.జీవన్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, పుట్ట మధు, బొడిగె శోభ, దాసరి మనోహర్‌రెడ్డి, ఒడితెల సతీష్‌బాబు, సోమారపు సత్యనారాయణ, రసమయి బాలకిషన్, ఎమ్మెల్సీలు సంతోష్‌కుమార్, పాతూరి సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సభ ప్రారంభం కాగానే బోయినపల్లి, ఇబ్రహీంపట్నం, రామడుగు, సైదాపూర్, మహాముత్తారం, ఎల్లారెడ్డిపేట, ఓదెల జెడ్పీటీసీ సభ్యులు లచ్చిరెడ్డి, సునీత, వీర్ల కవిత, సంజీవరెడ్డి, సదయ్య, ఆగయ్య, గంట అక్షితలు మాట్లాడుతూ జిల్లాలో విద్యా, వైద్య రంగం అస్తవ్యస్తంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలల్లో వసతులు లేవని, మోడల్ స్కూళ్లకు రహదారులు, తాగునీటి వసతులు, చాలా పాఠశాలల్లో వంట గదులు లేవని ఆందోళన వ్యక్తంచేశారు.అనుమతిస్తే నాలుగు రోజుల్లో వంటగదులు నిర్మించి చూపిస్తామని ఎల్లారెడ్డిపేట జెడ్పీటీసీ సభ్యుడు తోట ఆగయ్య తెలిపారు. వచ్చే సర్వసభ్య సమావేశాలకల్లా మౌలిక వసతులు కల్పించేలా అధికారులను ఆదేశించాలని మంత్రిని కోరారు. వైద్య రంగం అస్తవ్యస్తం జిల్లా వ్యాప్తంగా డాక్టర్లు, నర్సుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ల్యాబ్‌లు లేవని, భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయని.. తక్షణమే ప్రక్షాళన చేయాలని జెడ్పీటీసీలు పూర్ణిమ, శరత్‌రావు, పొన్నాల లక్ష్మయ్య, సిద్దం వేణు, చల్లా నారాయణరెడ్డి, గోపగాని సారయ్యగౌడ్, శ్రీకాంత్, కోఆప్షన్ సభ్యుడు జమీలొద్దీన్ డిమాండ్ చేశారు. కోహెడ్ డాక్టర్ అందుబాటులో ఉండడం లేదని జెడ్పీటీసీ లక్ష్మణ్ తెలిపారు. జిల్లా ప్రధాన ఆస్పత్రిలో ప్లేట్లేట్స్ మిషన్ పనిచేసేలా చూ డాలని జమిలొద్దీన్ కోరారు. మహాముత్తారంలో వై ద్యులు ఉండడం లేదని ఎంపీపీ అ న్నారు. వ్యవసాయంపై అట్టుడికిన సభ వ్యవసాయశాఖ పనితీరు అధ్వానంగా ఉందని పంట నష్టపరిహారం చెల్లింపులో ఆదర్శ రైతుల అవినీతికి అంతులేకుండా పోయిందంటూ సభ్యులు ధ్వజమెత్తారు. పరిహారం జాబితా అడిగితే వ్యవసాయ అధికారులు ఇవ్వడం లేదని, జెడ్పీటీసీలంటే అంత చులకనా? అంటూ బెజ్జంకి, శంకరపట్నం, ఎల్లారెడ్డిపేట జెడ్పీటీసీలు తన్నీరు శరత్‌రావు, సంజీవరెడ్డి, తోట ఆగయ్య తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదర్శరైతులకు అనుకూలమైన వారిపేర్లే జాబితాలో చేర్చి డబ్బులు దండుకున్నారని ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. బెజ్జంకి ఏవో ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని మంత్రితో వాపోయారు. అభివృద్ధికి బాటలు వేయండి: మంత్రి ‘ఈటెల’ జిల్లా సమగ్రాభివృద్ధికి పార్టీలకతీతంగా సభ్యులు కలిసి రావాలని రాష్ట్ర ఆర్థిక పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ కోరారు. జెడ్పీ సమావేశంలో ఆయన శుక్రవారం మాట్లాడారు. బంగారు తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా ముందుకుసాగుదామన్నారు. ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలే అయిందని, ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా బడ్జెట్ రూపకల్పన చేస్తామని తెలిపారు. రుణమాఫీ విషయంలో వెనుకంజ వేయబోమన్నారు. పంట పరిహారం జాబితాలను జెడ్పీటీసీ, ఎంపీపీలకు అందించాలని వ్యవసాయ శాఖ అధికారిని ఆదేశించారు. అధికార పార్టీకి చుక్కెదురు జెడ్పీలో మంత్రి, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రతిపాదించిన పనులు తిరస్కరణకు గురయ్యాయి. మంత్రి ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే బొడిగె శోభ, ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి కమలాపూర్, గంగాధర, కథలాపూర్, చొప్పదండి, కొడిమ్యాల మండలాల్లో బోర్‌వెల్స్, కమ్యూనిటీ హాళ్లు, రోడ్లు తదితర పనుల నిమిత్తం రూ.36 లక్షల 50 వేలతో ప్రతిపాదనలు పంపించారు. శుక్రవారం ఉదయం జరిగిన వర్క్స్, ఆర్థికస్థాయీ సంఘాల్లో పలువురు సభ్యులు మాట్లాడుతూ జిల్లాలో 13 నియోజకవర్గాలుంటే మూడు నియోజకవర్గాలకు మాత్రమే 24 ప్రతిపాదనలతో నిధులు కేటాయించడమేంటని ప్రశ్నించారు. అన్ని నియోజకవర్గాలకు సమానంగా పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపాదనలను ఏకగ్రీవంగా తిరస్కరించారు. దీంతో అధికార టీఆర్ఎస్ పార్టీకి చుక్కెదురైనట్లయింది. -
ధరలు తగ్గించేందుకు చర్యలు తీసుకున్నాం
శాసనమండలిలో మంత్రి సునీత సాక్షి, హైదరాబాద్: నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి, ప్ర జలు ఇబ్బందులు పడుతున్నారని శాసనమండలి సభ్యులు సోమవారం సభ దృష్టికి తెచ్చారు. ధరలు పెరగడానికి కారణాలేమిటి? వాటి నివారణకు తీసుకుంటున్న చర్యలేమిటి? ధరల స్థిరీకరణ నిధిని ఎప్పుడు ఏర్పాటు చేస్తారని సభ్యులు రత్నాబాయి, రుద్రరాజు పద్మరాజు(కాంగ్రెస్) ఆదిరెడ్డి అప్పారావు(వైఎస్సార్సీపీ) తదితరులు ప్రశ్నించారు. పౌర సరఫరాల మంత్రి పరిటాల సునీత సమాధానమిస్తూ.. రెండు నెలలుగా ఉల్లి, టమటా ధరలు పెరిగాయని, ప్రభుత్వ చర్యలతో ప్రస్తుతం ధరలు తగ్గుముఖం పట్టాయని చెప్పారు. ధరలను అదుపు చేసేందుకు జాయింట్ కలెక్టర్ల వద్ద రూ.15 లక్షల వరకు నిధిని ఏర్పాటు చేశామని చెప్పారు. రైతు బజార్లలో ప్రస్తుతం కూరగాయలు విక్రయిస్తున్న వారిని తొలగించి, కొత్త వారికి అవకాశం కల్పిస్తున్నారని, ఈ విధానానికి స్వస్తి పలకాలని ఆదిరెడ్డి అప్పారావు కోరారు. అలా తొలగిస్తున్నట్లు ఎవరైనా ఫిర్యాదు చేస్తే విచారించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి సునీత చెప్పారు.