‘ఈటెల'పైనే ఆశలు | 'Hopes itelapaine | Sakshi
Sakshi News home page

‘ఈటెల'పైనే ఆశలు

Published Wed, Nov 5 2014 3:52 AM | Last Updated on Sat, Sep 2 2017 3:51 PM

‘ఈటెల'పైనే ఆశలు

‘ఈటెల'పైనే ఆశలు

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో బుధవారం తొలిసారి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. జిల్లాకు చెందిన రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ఈ తొలి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న నేపథ్యంలో ఆయనపై జిల్లా ప్రజలు గంపెడాశలు పెట్టుకున్నారు. విత్త మంత్రి మనోడే కావడంతో కరీంనగర్ జిల్లాను అభివృద్ధి చేసేందుకు ఏ మేరకు కేటాయింపులు చేస్తారనే అంశంపై చర్చించుకుంటున్నారు. గతంలో పనిచేసిన కేంద్ర, రాష్ట్ర ఆర్థిక మంత్రులు బడ్జెట్‌లో తమ సొంత జిల్లాలకు ప్రాధాన్యత ఇచ్చేవారు. ఈటెల రాజేందర్ సైతం సొంత జిల్లాపై మమకారం చూపుతారా? లేదా? అనేది మరికొద్ది గంటల్లో తేలనుంది.
 - కరీంనగర్ సిటీ
 
     జిల్లాలో పెండింగ్‌లో ఉన్న మధ్యమానేరు, ఎస్సారెస్పీ వరద కాలువ, ఎల్లంపల్లి సాగునీటి ప్రాజెక్టులకు ఈ బడ్జెట్‌లో పెద్దపీట వేయనున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టులకు పూర్తిస్థాయిలో నిధులు కేటాయిస్తే సాగు, తాగునీటి కష్టాలు తీరుతాయి. ఏడాదిలోపు మధ్యమానేరు ప్రాజెక్టును పూర్తి చేస్తామని ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో అందుకోసం అవసరమైన రూ.425 కోట్లతో పాటు పరిహారం, పునరావాసం కోసం నిర్వాసితులకు చెల్లించాల్సిన రూ.360 కోట్లను ఈ బడ్జెట్‌లోనే కేటాయించాలని జిల్లావాసులు కోరుతున్నారు.

వరదకాలువ పనులు పూర్తి చేయడంతో పాటు ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్వాసితులకు పూర్తిస్థాయిలో పరిహారం, పునరావాసం కల్పనకు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. హుస్నాబాద్ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు గండిపల్లి, గౌరవెల్లి, తోటపల్లి రిజర్వాయర్లను అప్పటి ముఖ్యమంత్రి వైఎస్సార్ జలయజ్ఞంలో భాగంగా మంజూరు చేశారు. ఆయన మరణానంతరం ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో ఈ మూడు జలాశయాల పనులు అడుగు కూడా ముందుకు కదల్లేదు. టీఆర్‌ఎస్ సర్కారు ఈ ప్రాజెక్టులకు నిధులు కేటాయించి, పనులు పూర్తి చేయాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
 
     మన ఊరు-మన ప్రణాళికలో భాగంగా జిల్లాలోని చెరువుల పునరుద్ధరణకు పూర్తిస్థాయిలో నిధులు కేటాయించాలని స్థానిక ప్రజాప్రతినిధులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జిల్లాలోని రైల్వే ప్రాజెక్టుల నిర్మాణానికి అయ్యే వ్యయంలో రాష్ట్ర వాటాను ఈ బడ్జెట్‌లో ఏ మేరకు కేటాయిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

     ముఖ్యమంత్రి కేసీఆర్ సహా పలువురు మంత్రులు జిల్లాలో పర్యటించిన సందర్భంగా ఇప్పటికే పలు వరాలు ప్రకటించారు. బడ్జెట్‌లో హామీల అమలుకు తగిన కేటాయింపులు చేస్తామని వాగ్దానం చేసిన నేపథ్యంలో ఆర్థిక మంత్రి తన బడ్జెట్‌లో సొంత జిల్లాకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తారనే ఆశాభావం ప్రజల్లో నెలకొంది.

     జిల్లాలో ఏకైక ప్రతిపక్ష ఎమ్మెల్యేగా కొనసాగుతున్న జగిత్యాల శాసనసభ్యుడు టి.జీవన్‌రెడ్డి సైతం జిల్లా సమగ్రాభివృద్ధికి పూర్తిస్థాయిలో నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. అందులో భాగంగా జగిత్యాల నియోజకవర్గంలోని సారంగపూర్ మండలంలో బీపూర్ శివారులో రోళ్లవాగు ప్రాజెక్టు ఆధునికీకరణ పనుల పూర్తికి అవసరమైన రూ.60 కోట్లు కేటాయించాలని, జగిత్యాల, రాయికల్ ప్రాంతాల్లో రక్షిత మంచినీటి పథకానికి అవసరమైన నిధులు సమకూర్చాలని విజ్ఞప్తి చేశారు.
 
 ఈ హామీలకు మోక్షం లభించేనా?
 ఆగస్టు 8న సీఎం కేసీఆర్ జిల్లాకు వచ్చిన సందర్భంగా అనేక వరాలు ప్రకటించారు. కరీంనగర్ జిల్లాను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం ఇచ్చిన ప్రధాన హామీలివే..

     కరీంనగర్ నగర పునర్నిర్మాణ పథకం పూర్తి
     నగరం చుట్టూ రింగురోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు
     ఎన్‌టీపీసీలో 4 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు
     కాకతీయ కెనాల్  కెపాసిటీని 12 వేల క్యూసెక్కుల నుంచి 14 వేల క్యూసెక్కులకు పెంచడం
     ఎస్సారెస్పీ నీటిని రీజనరేట్ చేసుకోవడానికి చర్యలు
     వరదకాలువ స్థాయి పెంచడం
     ఎస్సారెస్పీ పరిధిలో ఎత్తై ప్రాంతాలకు తాగునీరు అందించేందుకు చిన్నపాటి లిఫ్ట్‌లు ఏర్పాటు
     రాయికల్ వద్ద గోదావరిపై బ్రిడ్జి, చెక్‌డ్యాం నిర్మాణం
     వేగురుపల్లి-నీరుకుల్ల నడుమ బ్రిడ్జినిర్మాణం
     మానేరు నదిపై కమాన్‌పల్లి, భూపాలపల్లిని కలుపుతూ వంతెన నిర్మాణం
     జగిత్యాలను జిల్లాగా ఏర్పాటు చేయడం
     కొత్తగా ఏడు వ్యవసాయ మార్కెట్లు ఏర్పాటు చేయడం
     మానకొండూరు చెరువును అభివృద్ధి చేయడం
     కరీంనగర్‌లో ఇండోర్ సబ్‌స్టేషన్ ఏర్పాటు
     రామగుండం నగరానికి తాగునీటి కోసం ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌నుంచి ఒక టీఎంసీ నీటిని తీసుకురావడం
     రామగుండంలో సింగరేణి ఆధ్వర్యంలో ఆధునాతన హాస్పిటల్ ఏర్పాటు, మైనింగ్ పాలిటెక్నిక్ ఏర్పాటు
     జిల్లా ఆసుపత్రిని నిమ్స్ తరహాలో అభివృద్ధి చేయడం
     పెద్దపల్లిలో వందపడకల ఆసుపత్రి నిర్మాణం
     హుస్నాబాద్ ఆసుపత్రి స్థాయి 50 పడకలకు పెంపు
     మంథనిలో వంద పడకల ఆసుపత్రి నిర్మాణానికి స్థల సేకరణ
     కొండగట్టుపైన 300 ఎకరాల స్థలంలో తిరుపతి స్థాయిలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చేయడం
 
 ఎమ్మెల్యేల ప్రతిపాదనలకు నిధులు సమకూరే నా?

 ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఇటీవల అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లో సమావేశమై నియోజకవర్గాల అభివృద్ధికి పలు ప్రతిపాదనలు సమర్పించారు. ఆయా ప్రతిపాదనలన్నింటికీ ఈ బడ్జెట్‌లోనే నిధులు కేటాయించాలని కోరారు. నియోజకవర్గాల వారీగా పలువురు ఎమ్మెల్యేలు సమర్పించిన బడ్జెట్ ప్రతిపాదనలివే...
 
 రామగుండం
     బీ-థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని జెన్‌కో ద్వారా విస్తరింపచేయాలి.
     రామగుండంకు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి తాగునీరు అందించేందుకు నిధులు
     గోదావరి పుష్కరాల దృష్ట్యా స్నానఘట్టాల నిర్మాణం, నిధులు కేటాయింపు
     రామగుండంలో మెడికల్ కళాశాల ఏర్పాటు
     అంతర్గాంలో ఇండస్ట్రియల్ ఎస్టేట్ నిర్మించాలి
     ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌ను పర్యాటక కేంద్రంగా ఏర్పాటు
     ఎయిర్‌పోర్టు, ఐటీ పార్క్ ఏర్పాటు
 
 హుజూరాబాద్
     హుజూరాబాద్, జమ్మికుంట నగరపంచాతీయలకు రూ.120 కోట్లతో తాగునీరు
     రూ.60 కోట్లతో హుజూరాబాద్ మోడల్ చెరువును రిజర్వాయర్‌గా మార్చడం, ఫిల్టర్‌బెడ్, పైప్‌లైన్‌ల నిర్మాణం
     రూ.60 కోట్లతో జమ్మికుంట నాయిని చెరువు రిజర్వాయర్
     రూ.40 కోట్లతో కేసీ క్యాంప్‌లో ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మాణం
     రూ.18 కోట్లతో హుజూరాబాద్ ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా మార్చడం
     రూ.30 కోట్లతో ఇల్లందకుంటలో సీపీడడబ్ల్యూఎస్-2 నిర్మాణం
     మానేరు వాగుపై 11 చెక్‌డ్యాంల నిర్మాణం
 
 కోరుట్ల
     రూ.4.75 కోట్లతో మల్లాపూర్ మండలం సోమన్నగుట్ట అభివృద్ధి, ఘాటురోడ్డు నిర్మాణం
     రూ.1.50 కోట్లతో ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవన నిర్మాణం
     కోరుట్ల, మెట్‌పల్లిల్లో రూ.13.75 కోట్లతో తాగునీటి పనులు
     కోరుట్ల వెటర్నరీ కళాశాలను వెటర్నరీ యూనివర్సిటిగా మార్చాడం
 
 కరీంనగర్
     కరీంనగర్ రెనోవేషన్‌కు అదనంగా     రూ.25 కోట్లు
     యూజీడీ పనుల పూర్తికి నిధులు
     కమాన్  నుంచి హౌసింగ్‌బోర్డుకాలనీ మీదుగా సదాశివపల్లికి కొత్త బైపాస్‌రోడ్డు
 
 పెద్దపల్లి

     పెద్దపల్లి-కూనారం నడుమ రైల్వే బ్రిడ్జి ఏర్పాటు
     పెద్దపల్లి ఆసుపత్రిని వంద పడుకల ఆసుపత్రిగా మార్చడం
     సుల్తానాబాద్‌లో ఆసుపత్రి భవన నిర్మాణం, వైద్యులకు క్వార్టర్ల నిర్మాణం
     పది నూతన సబ్‌స్టేషన్ల నిర్మాణం
     ఎల్లంపల్లి ప్రాజె క్ట్ నుంచి డీ-83, డీ-86 కాలువకు అనుసంధానం చేయడం
     సుల్తానాబాద్-మానకొండూరు మండలాలను కలిపే నీరుకుల్ల వాగుపై బ్రిడ్జి నిర్మాణం
 
 చొప్పదండి
     కొంపల్లి రిజర్వాయర్ నుంచి కొండగట్టు పైకి వచ్చే పైప్‌లైన్‌కు అదనంగా         రూ.కోటి నిధులు
     కొండగట్టుపై పీహెచ్‌సీ ఏర్పాటు
     గట్టు కింద ఆలయ భూముల్లో వాణిజ్య సముదాయం
     రుక్మాపూర్‌లో లెదర్‌పార్క్‌కు నిధులు కేటాయించాలి
     మోతె, నారాయణపూర్, పోతారం రిజర్వాయర్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలి
     కొండగట్టులో మాస్టర్‌ప్లాన్ ఏర్పాటు
 
 మంథని
     మంథని మండలం వీలోచవరం వద్ద గోదావరి నదిపై రూ.630 కోట్లతో డ్యాం, బ్రిడ్జి నిర్మాణం
     జేఎన్‌టీయూహెచ్ పూర్తిస్థాయి భవన సముదాయాలు, నిర్వహణ కోసం రూ.200 కోట్లు
     రూ.25 కోట్లతో సీసీ రోడ్లు, కల్వర్టుల నిర్మాణం
     పుష్కరాల సందర్భంగా రూ.7.10 కోట్లతో 18 రహదారుల నిర్మాణం, మరమ్మతులు
     రూ.5 కోట్లతో ఆరెవాగుపై బ్రిడ్జి నిర్మాణం
 
 వేములవాడ
     రుద్రంగి చెరువును రిజర్వాయర్‌గా మార్చడం
     వేములవాడలో వందపడకల ఆసుపత్రి ఏర్పాటు
     రూ.11 కోట్లతో వేములవాడ మూలవాగుపై రెండవ బ్రిడ్జి నిర్మాణం
     రూ.7 కోట్ల వ్యయంతో రెండు బైపాస్‌రోడ్ల విస్తరణ
     రూ.15 కోట్లతో రోడ్ల నిర్మాణం
 
 మానకొండూరు
     బెజ్జంకిలో 50 పడకల ఆసుపత్రి
     వేగురుపల్లి నుంచి నీరుకుల్ల వరకు వంతెన నిర్మాణం
     చెరువులు, రోడ్ల అభివృద్ధి
 
 ధర్మపురి
     ధర్మపురిలో బస్‌డిపో ఏర్పాటు
     మేడారం ఆసుపత్రి స్థాయి 30         పడుకలకు పెంపు
     గోదావరి పుష్కరాలకు రూ.500 కోట్ల నిధులు
 
 హుస్నాబాద్
     నాలుగు సబ్‌స్టేషన్ల నిర్మాణం
     వరదనీటిని ఎల్లమ్మ చెరువులోకి పైప్‌లైన్ ద్వారా మళ్లించడం
     వరదకాలవు నిర్వాసితులకు పరిహారం,     ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement