కోల్‌బెల్ట్ : సంస్థ లక్ష్యాలను అధిగమించుటకు కృషిచేసిన కార్మికులపై యాజమాన్యం చిన్నచూపు చూడటం సరికాదని సింగరేణి కాలరీస్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ (ఐఎన్‌టియూసి)కేంద్రకమిటీ ఉపాధ్యక్షుడు పసునూటి రాజేందర్ అన్నారు. పట్టణంలోని బ్రాంచి కార్యాలయం లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మా ట్లాడుతూ అధికలాభాలు వచ్చేందుకు శ్రమించిన కార్మికులకు 20 గ్రాముల బంగారు నాణాలు అందించాలని రాజేందర్ డిమాండ్ చేశారు. సమావేశంలో బ్రాంచి ఉపాధ్యక్షులు సమ్మిరెడ్డి, నాయకులు నర్సింగరావు, ధరియాసింగ్, అశోక్, రాజ్యలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం భూపాలపల్లి బ్రాంచి కమిటీ నాయకులు బాతాల రాజు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అధికలాభాలను ఆర్జించుటకు కృషిచేసిన కార్మికులకు యాజమాన్యం 10 గ్రాముల గోల్డ్ బిల్లలు అందజేయాలని, లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలను చేపడతామన్నారు. సమావేశంలో నాయకులు నామాల శ్రీనివాస్, రాళ్లబండి బాపు, జయశంకర్, కే.లింగయ్య, వైకుంఠం, ఠాగూర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
సింగరేణి సంస్థ గత ఆర్థిక సంవత్సరంలో 60.3 మిలియన్ టన్నులను సాధించినందుకు కార్మికులకు 15 గ్రాముల బంగారు బిల్లలను అందజేయాలని బిఎంఎస్ భూపాలపల్లి బ్రాంచి ఉపాధ్యక్షుడు కొండపాక సాంబయ్యగౌడ్ డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు కొమురయ్య, రమేష్, మదునయ్య, బ్రహ్మచారి, స్వామి, సదానందం, చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.