మేడ్చల్: రంగారెడ్డి జిల్లా మేడ్చల్ నియోజకవర్గంలోని ఏకైక నామినేటెడ్ పదవి అయిన మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్‌ను ప్రభుత్వం దాదాపు ఖరారు చేసింది. ఈసారి కుర్చీని ఎస్సీలకు కేటాయించనుంది. దీనికోసం టీఆర్‌ఎస్ నగర పంచాయుతీ అధ్యక్షుడు సత్యనారాయణ పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు స్థానిక ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ఒక ఖచ్చితమైన నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. మేడ్చల్ వూజీ ఎంపీపీ శ్యాంరావు, గత సంస్థాగత ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరుఫున జెడ్పీటీసీ సభ్యుడిగా పోటీ చేసి ఓడిపోయిన సుదర్శన్ చైర్మన్‌గిరీ కోసం పోటీ పడ్డారు.
అయితే సత్యనారాయణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించడం, పేరున్న నాయుకుడు కావడంతో టీఆర్‌ఎస్ శ్రేణులు ఆయనవైపు మొగ్గు చూపుతున్నారు. సుదర్శన్ ఉద్యవు నాయుకుడైనప్పటికీ ఆయునకు గతంలో పార్టీ తరఫున జెడ్పీటీసీ టికెట్ ఇచ్చిన కారణంగా ఇతని పేరును పరిగణనలోకి తీసుకోవడం లేదని సమాచారం. శ్యాంరావు గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లోకి రావడం.. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అనుచరుడిగా కాకుండా.. నియోజకవర్గ నాయకుడు నక్క ప్రభాకర్‌గౌడ్ మనిషిగా ముద్ర పడటంతో ఎమ్మెల్యే ఇతన్ని పక్కనబెట్టినట్లు తెలుస్తోంది.