‘‘రజాకార్’ ముస్లింలకు వ్యతిరేకమైన సినిమా కాదు. మన చరిత్ర గురించి తెలియజేసే చిత్రం. నాటి కాలంలో జరిగిన దుర్మార్గాలను ప్రజలకు తెలియజేసేలా తెరకెక్కించిన మూవీ. ఇలాంటి సినిమా తీయాలంటే ధైర్యం కావాలి. దర్శకుడు సత్యనారాయణ, నిర్మాత నారాయణరెడ్డిలకు ధన్యవాదాలు’’ అని నటుడు, దర్శక–నిర్మాత ఆర్. నారాయణమూర్తి అన్నారు. బాబీ సింహా, వేదిక, అనుష్యా త్రిపాఠి, ప్రేమ, ఇంద్రజ, మకరంద్ దేశ్‌పాండే నటీనటులుగా యాటా సత్యనారాయణ దర్శకత్వం వహించిన చిత్రం ‘రజాకార్’.
గూడూరు నారాయణ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం నేడు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, మరాఠీ, హిందీ భాషల్లో విడుదలవుతోంది. గురువారం జరిగిన ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో యాటా సత్యనారాయణ మాట్లాడుతూ– ‘‘తెలంగాణ చరిత్రపై ‘రజాకార్’ చేసే చాన్స్ ఇచ్చిన నారాయణరెడ్డిగారికి ధన్యవాదాలు’’ అన్నారు. ‘‘మన పోరాట యోధుల గురించి రాబోయే తరాలకు చెప్పాలనే ‘రజాకార్’ నిర్మించాను’’ అన్నారు గూడూరు నారాయణ రెడ్డి.
Comments
Please login to add a commentAdd a comment