వాహన రుణం తిరిగి చెల్లించేందుకు వచ్చిన ఓ రైతును బ్యాంకు ఉద్యోగినంటూ ఓ యువకుడు బురిడీ కొట్టించి.. రూ. 1.24 లక్షలతో ఉడాయించాడు.
వాహన రుణం తిరిగి చెల్లించేందుకు వచ్చిన ఓ రైతును బ్యాంకు ఉద్యోగినంటూ ఓ యువకుడు బురిడీ కొట్టించి.. రూ. 1.24 లక్షలతో ఉడాయించాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా ములుగు ఎస్‌బీఐలో గురువారం వెలుగుచూసింది. మండలంలోని బావనందాపూర్ గ్రామానికి చెందిన సత్యనారాయణ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
ఈక్రమంలో ఎస్‌బీఐ ద్వారా వాహన రుణం తీసుకొని ట్రాక్టర్ కొనుగోలు చేశాడు. కిస్తీ డబ్బులు చెల్లించడానికి రూ. 1.24 లక్షలతో ఈ రోజు బ్యాంకుకు వచ్చాడు. ఎస్‌బీఐ ఉద్యోగిగా గుర్తింపు కార్డు మెడలో వేసుకున్న ఓ యువకుడు డబ్బులు తాను జమ చేస్తానని అతని నుంచి తీసుకొని లోపలికి వెళ్లాడు. యవకుడు ఎంతకీ తిరిగి రాకపోవడంతో బ్యాంకు అధికారులను సంప్రదించి మోసపోయానని గుర్తించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. నిందితుడి కోసం సీసీ టీవీ ఫుటేజీలను చెక్ చేస్తున్నారు.