సాక్షి, కోనసీమ జిల్లా: అంబాజీపేట మండలంలో క్రీడోత్సవాల ఏర్పాట్లపై ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. క్రీడోత్సవాల కోసం అంబాజీపేట జడ్పీ హైస్కూల్లో అధికారులు అరకొర ఏర్పాట్లు చేశారు. స్కూల్ మేనేజజ్‌మెంట్ కమిటీకి కనీసం హెచ్ఎంకు కూడా భాగస్వాము లేకుండా క్రీడోత్సవాలు ఏర్పాటు చేయటంపై ఆయన మండిపడ్డారు.
కనీసం స్వాగత ఫ్లెక్సీ ఏర్పాటు చేయకపోవడంతో పాటు, రిబ్బన్ కటింగ్‌కి కత్తెర కూడా సకాలంలో అందచేయలేకపోవడంతో ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తమకు చెబితే క్రీడోత్సవాల ఏర్పాట్లు తామే చేసుకుంటామంటూ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, క్రీడోత్సవాల ఏర్పాట్లపై ఎంఈవోలను కూటమి నేతలు నిలదీశారు. దీంతో తూతూ మంత్రంగా ప్రారంభించిన ఎమ్మెల్యే గిడ్డి అలిగి వెళ్లిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment