సాక్షి, కోనసీమ: న్యూ ఇయర్ వేడుకల్లో జనసేన నేతలు రెచ్చిపోయారు. వేడుకల కోసం జనసేన పార్టీకి చెందిన నాయకుడు ఏకంగా రేవ్ పార్టీ ఏర్పాటు చేశాడు. ఈ పార్టీలో యువతులతో అసభ్యకర నృత్యాలు చేస్తూ అర్థరాత్రి హంగామా చేశారు. కోనసీమ జిల్లాలో డిసెంబర్ 31వ తేదీ రాత్రి జరిగిన రేవ్ పార్టీ వీడియోలు ఆలస్యంగా బయటకు వచ్చాయి. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
వివరాల ప్రకారం.. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జనసేన పార్టీ నాయకుడు వేలుపూరి ముత్యాలరావు అలియాస్ ముత్తు ఆధ్వర్యంలో డిసెంబర్ 31వ తేదీన అర్థరాత్రా రేవ్ పార్టీ ఏర్పాటు చేశారు. గొల్లపుంత రోడ్‌లో ఉన్న బుద్ధా స్టాచ్యూ ఓం సిటీ లేఅవుట్‌లో రేవ్ పార్టీ జరిపారు. సమాజం తలదించుకునేలా అసభ్యకర నృత్య ప్రదర్శనలతో నూతన సంవత్సర వేడుకలను నిర్వహించారు. రేవ్ పార్టీలో యువతులతో అసభ్యకరంగా డ్యాన్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ రేవ్ పార్టీకి జనసేన నాయకులు సహా మరికొందరు హాజరైనట్టు తెలుస్తోంది. ఇక, రేవ్ పార్టీలో జనసేన నాయకుడు సహా అక్కడున్న వారంతా హంగామా క్రియేట్ చేశారు. ఈ నేపథ్యంలో రేవ్ పార్టీపై ఆరాతీసిన పోలీసులు.. జనసేన నాయకుడితో సహా నలుగురిపై మండపేట పీఎస్‌లో కేసు నమోదు చేశారు. అయితే, జనసేన నేతలపై కేసు నమోదు చేయవద్దంటూ పోలీసులపై కొందరు నేతలు ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. ఈ కేసుపై పోలీసులకు హెచ్చరికలు సైతం వెళ్లినట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment