కూలీ పనికి వెళ్లి ఇంటికి వస్తూనే వడదెబ్బతో ఓ వ్యక్తి చనిపోయాడు.
కూలీ పనికి వెళ్లి ఇంటికి వస్తూనే వడదెబ్బతో ఓ వ్యక్తి చనిపోయాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామంలో బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చింతమాను సత్యనారాయణ(60) బుధవారం ఉదయం ఉపాధి కూలీ పనులకు వెళ్లాడు. మధ్యాహ్నం సమయంలో ఆయన తిరిగి వస్తున్న సమయంలోనే ఎండ తీవ్రతతో పడిపోయి అక్కడికక్కడే చనిపోయాడు. ఎండ వేడిమికి ఆయన శరీరం మంతా బొబ్బలు తేలాయని కుటుంబసభ్యులు తెలిపారు.