సాక్షి, భీమవరం: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో బుధవారం విషాదం చోటు చేసుకుంది. కన్న బిడ్డలు చూసుకోవడంలేదని మనస్థాపంతో ఓ వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. భీమవరం శివారు గునుపూడిలో తటవర్తి సత్యనారాయణ(70) నివాసం ఉంటున్నాడు. అతని భార్య పదేళ్ల క్రితం అతని భార్య మృతిచెందడంతో అతను ఒంటరిగా ఉంటున్నాడు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు.
కొడుకు, ఓ కుమార్తె హైదరాబాద్‌లో ఉంటుండగా, మరో కుమార్తె అత్లిలిలో ఉంటోంది. అయితే ముగ్గురు పిల్లలున్నా తన బాగోగులు పట్టించుకోవడం లేదని సత్యనారాయణ కొంతకాలంగా భాదపడుతున్నాడు. ఈ క్రమంలోనే తీవ్ర మనస్థాపానికి గురైన ఆయన ఇంటిలోనే కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన స్ధానికలు పోలీసులకు సమాచారం అందించారు. అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment