రుణ భారంతో కౌలు రైతు ఆత్మహత్య | The Lease farmer committed suicide | Sakshi
Sakshi News home page

రుణ భారంతో కౌలు రైతు ఆత్మహత్య

Published Thu, Feb 25 2016 8:23 PM | Last Updated on Sun, Sep 3 2017 6:25 PM

The  Lease farmer committed suicide

తూర్పుగోదావరి జిల్లా అల్లవరం మండలం డి.రావులపాలెంకు చెందిన కౌలు రైతు కొల్లా సత్యనారాయణ (50) అప్పులు తీర్చలేక, తాను సాగు చేసిన పొలంలోనే గుళికలు తిని బుధవారం అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకున్నారు. సత్యనారాయణ ఆరెకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారు. కొన్నేళ్లుగా ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంటలు దెబ్బతిని వరుసగా నష్టాలు రావటంతో రూ.ఆరు లక్షల వరకూ అప్పుల పాలయ్యూరు.

అప్పులకు వడ్డీలు కూడా చెల్లించలేని స్థితిలో తనకున్న 40 సెంట్ల సొంత భూమిని అమ్మినా అప్పులు తీరలేదు. దీంతో దిక్కుతోచక బుధవారం అర్ధరాత్రి ఇంటి నుంచి పొలానికి వెళ్లి 10 జి గుళికలు తిని ఆత్మహత్యకు పాల్పడ్డారు. గురువారం ఉదయం సత్యనారాయణ ఇంట్లో కనిపించకపోవడంతో ఆయన భార్య ఆందోళనతో కుటుంబ సభ్యులకు చెప్పింది.

పొలం వెళ్లి చూడగా కొడుకు విగతజీవిగా కనిపించాడని సత్యనారాయణ తండ్రి పుల్లయ్య నాయుడు తెలిపారు. సత్యనారాయణకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. గ్రామానికి చెందిన డీసీసీబీ మాజీ డెరైక్టర్, వైఎస్సార్ సీపీ నాయకుడు జున్నూరి బాబి సత్యనారాయణ ఆత్మహత్య చేసుకున్న విషయూన్ని జాయింట్ కలెక్టర్ సత్యనారాయణకు ఫోన్‌లో తెలిపారు. అల్లవరం తహశీల్దారు పాము సుబ్బారావు గ్రామానికి వెళ్లి ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితులపై ఆరా తీశారు.

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement