lease farmer
-
రైతు దారుణ హత్య
విడవలూరు (బుచ్చిరెడ్డిపాళెం): పొలాన్ని కౌలుకు ఇచ్చిన రైతు మోడెం చంద్రశేఖర్‌రెడ్డి (56)ని దారుణంగా హత్య చేసిన ఘటన ఆలస్యంగా శనివారం వెలుగుచూసింది. సీఐ కోటేశ్వరరావు కథనం మేరకు.. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం మండలం దామరమడుగు గ్రామానికి చెందిన చంద్రశేఖర్‌రెడ్డికి చెందిన 13 ఎకరాల పొలాన్ని కోవూరు మండలం పాటూరు గ్రామానికి చెందిన సురేష్ అనే వ్యక్తి కౌలుకు తీసుకున్నాడు. ప్రస్తుతం పంట చేతికి రావడంతో పంటను కోయాలని సురేష్ అనుకున్నాడు. ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఎకరానికి 13 వేల రూపాయలను కౌలుగా చెల్లించాల్సి ఉంది. కానీ చంద్రశేఖర్‌రెడ్డి తనకు ఎకరాకు రూ.15 వేలు ఇవ్వాలని గత పది రోజుల కిత్రం డిమాండ్ చేశాడు. దీనికి కౌలు రైతు సురేష్ ఒప్పుకోలేదు. అయితే, పంట తాను కోసుకుని ధాన్యాన్ని విక్రయించి మిగిలిన డబ్బులు ఇస్తానని చంద్రశేఖర్‌రెడ్డి తెలిపాడు. దీనికి సురేష్ ఒప్పుకోలేదు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈనెల 14న ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన చంద్రశేఖర్‌రెడ్డి కనిపించకపోవడంతో అతని భార్య వసుధ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు చంద్రశేఖర్‌రెడ్డి మొబైల్ ఆధారంగా సురేష్‌తో ఫోన్లో మాట్లాడారు. దీంతో తాము దొరికిపోయామని గ్రహించి సురేష్ పోలీసులకు లొంగిపోయి జరిగిన విషయాన్ని తెలిపాడు. నిందితుడు ఈనెల 14న చంద్రశేఖర్‌ను రేబాలలోని నిర్మానుష్యమైన ప్రాంతానికి రమ్మని చెప్పి అక్కడ అతని చేత పూటుగా మద్యం తాగించాడు. తర్వాత చంద్రశేఖర్‌రెడ్డిని కొట్టి తాడుతో మెడకు ఉరివేసి చంపేశాడు. అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా వెంకటేశ్వరపురం వద్ద ఉన్న పెన్నానదిలో పూడ్చి వేశాడు. ఈ మేరకు నిందితుడిని తీసుకెళ్లి పూడ్చిన స్థలానికి చేరుకుని చంద్రశేఖర్‌రెడ్డి మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టంకు తరలించారు. ఈ హత్యలో మొత్తం 6 మంది పాల్గొన్నారని, మిగిలిన 5 మందిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు. -
వ్యాపారికి కౌలు కార్డు!
యలమంచిలి: చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి పేరు కలవల వెంకట సురేష్‌కుమార్. ఇతనిది మేడపాడు గ్రామం. సురేష్ గ్రామంలోనే ఫర్నిచర్ వ్యాపారం చేస్తుంటారు. ఇతనికి సెంటు భూమి కూడా లేదు. పైగా కౌలు వ్యవసాయం కూడా చేయడం లేదు. అయితే ఇతని పేరిట రెవెన్యూ అధికారులు మేడపాడు గ్రామంలోని సర్వే నంబరు 57–1లో 3.76 ఎకరాలు కౌలు వ్యవసాయం చేస్తున్నట్లు భూమి లైసెన్స్ పొందిన వ్యవసాయదారుల రుణ అర్హత కార్డు మంజూరు చేశారు. ఈ తతంగమంతా సురేష్ ప్రమేయం లేకుండానే జరిగిపోయింది. ఏతావాత ఈ విషయం బయటపడి ఆ కార్డు సురేష్ చేతికి రావడంతో ఆశ్చర్యపోయాడు. తన ప్రమేయం కానీ, తన సంతకం కానీ లేకుండా రెవెన్యూ అధికారులు ఈ కార్డు ఎలా మంజూరు చేశారని సురేష్ ప్రశ్నిస్తున్నారు. ఇటీవల నరసాపురం విజయా బ్యాంకులో కౌలు కార్డులపై కుంభకోణం జరిగిన నేపథ్యంలో తన పేరిట కూడా ఎక్కడైనా బ్యాంకులో అప్పు వచ్చిందేమోనని సురేష్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సంబంధిత అధికారులు విచారణ చేసి బాధ్యులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాడు. -
ఏపీలో ఆగని అన్నదాతల ఆత్మహత్యలు
-
పున్నారావు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోదా?
30 ఏళ్లుగా కౌలు వ్యవసాయం చేస్తున్న రైతు ప్రైవేటు అప్పులు తెచ్చి పత్తి, మిర్చి సాగు చేసి అప్పుల్లో కూరుకొనిæ ఆత్మహత్య పాలైన ఏడాదిన్నర కావస్తున్నా ప్రభుత్వం బాధిత కుటుంబానికి ఎటువంటి సహాయమూ అందించలేదు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం నందిగామ గ్రామానికి చెందిన కౌలు రైతు కోపూరి పున్నారావు(50) ఇంట్లోనే పురుగులమందు తాగి సత్తెనపల్లిలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2017 మే 17న చనిపోయారు. సెంటు భూమి లేకపోయినప్పటికీ పున్నారావు కుటుంబం 30 ఏళ్లుగా భూమి కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసి జీవనం సాగిస్తున్నది. ఎకరానికి రూ. 25 వేల కౌలు చొప్పున ఆరెకరాల పొలాన్ని కౌలుకు తీసుకొని.. రెండెకరాల్లో పత్తి, నాలుగెకరాల్లో మిరప పంటను సాగు చేశారు. పత్తికి తెగుళ్లు ఎక్కువగా సోకడంతో కనీసం పంట పెట్టుబడి కూడా తిరిగి రాలేదు. అప్పట్లో మిర్చి ధర క్వింటాలు రూ. 2,500కు పడిపోవటంతో అప్పు రూ. 5 లక్షలకు పెరిగింది. తీర్చేదారి లేక దిగులుతో ఆత్మహత్య చేసుకున్నారు. పున్నారావుకు భార్య పద్మావతి, కుమార్తెలు శిరీష, రాధ ఉన్నారు. ‘మాకు సెంటు భూమి గకూడా లేకపోవడంతో బ్యాంకులు రుణం ఇవ్వలేదు. 17 సవర్ల బంగారం వేరే వారి పేరు మీద బ్యాంకులో కుదువ పెట్టాం. దానికి కూడా రుణమాఫీ వర్తించలేదు. ఇప్పుడు రెక్కల కష్టంపైనే ఆధారపడి జీవిస్తున్నాం. ప్రభు త్వం నుంచి ఎటువంటి సహాయం అందలేదు..’ అని పద్మావతి ఆవేదన చెందుతున్నారు. – ఓ. వెంకట్రామిరెడ్డి, అమరావతి బ్యూరో, గుంటూరు -
కౌలు రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోదా?
30 ఏళ్లుగా కౌలు వ్యవసాయం చేస్తున్న రైతు ప్రైవేటు అప్పులు తెచ్చి పత్తి, మిర్చి సాగు చేసి అప్పుల్లో కూరుకొని ఆత్మహత్య పాలైన ఏడాదిన్నరకు కూడా ప్రభుత్వం బాధిత కుటుంబానికి ఎటువంటి సహాయమూ అందించలేదు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం నందిగామ గ్రామానికి చెందిన కౌలు రైతు కొపూరి పున్నారావు (50) 2017 మే 13న ఇంట్లోనే పురుగులమందు తాగారు. కుటుంబ సభ్యులు హుటాహుటిన సత్తెనపల్లిలోని ఆస్పత్రికి తరలించగా.. 17న చనిపోయారు. సెంటు భూమి లేకపోయినప్పటికీ పున్నారావు కుటుంబం 30 ఏళ్లుగా భూమి కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసి జీవనం సాగిస్తున్నారు. 2017లో ఎకరానికి రూ. 25 వేల కౌలు చొప్పున ఆరెకరాల పొలాన్ని కౌలుకు తీసుకున్నారు. రెండెకరాల్లో పత్తి, నాలుగెకరాల్లో మిరప పంటను సాగు చేశారు. పత్తికి తెగుళ్లు ఎక్కువగా సోకడంతో కనీసం పంట పెట్టుబడి కూడా తిరిగి రాలేదు. మిర్చి ధర క్వింటాలు రూ. 2,500కు పడిపోవటంతో రూ. 5 లక్షల అప్పు తీర్చేదారి లేక దిగులుతో ఆత్మహత్య చేసుకున్నారు. పున్నారావుకు భార్య పద్మావతి, కుమార్తెలు శిరీష, రాధ ఉన్నారు. ‘మాకు సెంటు కూడా భూమి లేకపోవడంతో బ్యాంకులు రుణం ఇవ్వలేదు. 17 సవర్ల బంగారం వేరే వారి పేరు మీద బ్యాంకులో కుదువ పెట్టాం. దానికి కూడా రుణమాఫీ వర్తించలేదు. ఇప్పుడు రెక్కల కష్టంపైనే ఆధార పడి జీవిస్తున్నాం. ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందలేదు..’ అని పద్మావతి ఆవేదన చెందుతున్నారు. – ఓ.వెంకట్రామిరెడ్డి, అమరావతి బ్యూరో, గుంటూరు -
పరపతి లేక.. పట్టించుకోక!
∙ కౌలురైతును కనికరించని బ్యాంకర్లు ∙ ఎక్కడా పంట పెట్టుబడులు దొరకని పరిస్థితి ∙ గుర్తింపుకార్డులివ్వరు.. రుణాలు దొరకవు కౌలు రైతుకు అన్యాయం జరుగుతున్నా నోరుమెదిపే వారే కరువయ్యారు. ప్రభుత్వ నిర్లిప్తతకు తోడు అధికారులు కూడా పెద్దగా పట్టించుకోకపోవడంతో కౌలురైతు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. బయట అప్పులు దొరకక.. బ్యాంకర్లు ఇవ్వక అల్లాడుతున్నారు. దిక్కుతోచని స్థితిలో తల తాకట్టుపెట్టి అధిక వడ్డీలకు డబ్బులు తెచ్చి పెట్టుబడులు పెడుతున్నారు. చివరకు అప్పులపాలై తనువు చాలిస్తున్నారు. ప్రభుత్వ పథకాల్లోని సంక్షేమ çఫలాలు కూడా అందకపోవడంతో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోలేకపోతున్నారు. అంతేకాకుండా వారికి గుర్తింపు కార్డుల విషయంలోను సర్కార్ మీనమేషాలు లెక్కిస్తోంది. సాక్షి, కడప :కౌలురైతు సంక్షేమం గాల్లో దీపంలా మారింది. వారికి పరపతి దక్కడం లేదు. కనీసం ప్రభుత్వం కూడా పట్టించుకోకపోవడంతో వారికి దిక్కుతోచని పరిస్థితి నెలకొంటోంది. దీంతో ఏం చేయాలో తెలియక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ప్రత్యేక కృషితోపాటు రైతుల రణాలన్నీ కూడా బేషరతుగా మాఫీ చేస్తామన్న బాబు సర్కార్ అధికారం అందగానే అన్నింటిని మర్చిపోయింది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఏవేవో హామీలిచ్చి ఏమీ చేయలేక చేతులెత్తేసింది.. అధికారంలోకి రాక మునుపు ఒకమాట..వచ్చిన తరువాత మరొకమాట చెబుతూ చంద్రబాబు ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. కేవలం ఆర్భాటాలే చేస్తున్నారు. రుణాలు అంతంతమాత్రమే కౌలురైతుల విషయంలో ఎవరూ కనికరం చూపడం లేదు. ఎందుకంటే వారు పంట పెట్టుకునేందుకు అవసరమైన పెట్టుబడి కూడా దొరకని పరిస్థితుల్లో బ్యాంకులకు వెళ్లినా పట్టించుకోకపోవడం ఆందోళన కలిగించే పరిణామం. ఏదొక సాకు చూపి తిప్పుకుంటున్నారే తప్ప రుణాలు మం జూరుచేయడం లేదన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అయితే కొన్నేళ్లుగా పొలాల్లో హలం పట్టి వ్యవసాయం చేస్తున్నా.. ఆశించిన మేర దిగుబడులు రావడం లేదు. పైపెచ్చు ప్రభుత్వ ప్రయోజనాలు లేకపోవడం కూడా వారిని కృంగదీస్తోంది. ఇలా అయితే పంటల సాగు కష్టమన్న తరహాలోకి కౌలురైతు వచ్చా డు. జిల్లాలో కౌలుదారులకు 10శాతం రుణాలు కూడా అందించలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. గుర్తింపుకార్డులు ఇవ్వరు.. ప్రభుత్వం కౌలుదారులకు గుర్తింపుకార్డులు ఇవ్వడంలోనూ నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. జిల్లాలో 13,550మంది కౌలుదారులు ఉండగా, ఇప్పటివరకు 4,821మందికి మాత్రమే గుర్తిం పుకార్డులు ఇచ్చారు. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం ఫలితంగా కౌలురైతులు నరకం అనుభవిస్తున్నారు. కార్డుల క్రమబద్ధీకరణ జరిగితేనే కౌలు రైతుకు ఏదైనా చేసేందుకు అవకాశం ఉంటుంది. అయితే పాతవాళ్లకే చాలామందికి ఇంతవరకు అందివ్వలేదు. దీంతో ఎక్కడికి వెళ్లినా వారికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. క్షేత్రస్థాయిలో కౌలు రైతులకు భరోసా కల్పించడంలో సర్కారు పూర్తిగా విఫలమైంది. ప్రభుత్వం ఇచ్చే గుర్తింపుపత్రంతో బతుకు చిత్రం మారుతుందనే ఆశతో పొలంలోకి అడుగుపెడుతున్నా వారి జీవన ప్రమాణాలు మాత్రం మెరుగుపడడం లేదు. దశాబ్దాలుగా బడుగు జీవుల వ్యథలకు పరిష్కారం మాత్రం లభించడం లేదు. పరపతి బాసట లేదు....కనీసం అధికారిక గుర్తింపు ఎంతమాత్రం లేదు..భూమి హక్కు మాట పక్కన పెడితేనే మంచిది. ఇలాంటి పరిస్థితుల్లో కనీస గుర్తింపు లేకుండా కౌలు రైతును ఆదుకునేది ఎలాగో అధికారులే సెలవివ్వాలి! తనువు చాలిస్తున్న కౌలురైతులు వ్యవసాయంపై ఆధారపడి నిత్యం కష్టం చేస్తున్నా ఆశించిన మేర ఉత్పత్తులు రాక అన్నదాత దిగాలు చెందుతున్నాడు. పెట్టుబడులు భారీగా పెడుతున్నా దిగుబడులు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. దీంతో జిల్లాలో పంటలకు చేసిన అప్పులు తీరక అనేకమంది రైతులు తనువు చాలిస్తున్నారు. అయినా ప్రభుత్వం మాత్రం చేష్టలుడిగి చూస్తుందే తప్ప ఆదుకోవడం లేదు. సవాలక్ష ఆంక్షలతో అరకొరగా అందించే ఆర్థికసాయాన్ని కూడా నిబంధనల పేరుతో కొంతమందికే పరిమితం చేస్తున్నారు. ఏళ్ల తరబడి పంట సాగు చేస్తున్నా కౌలుదారులు గుర్తింపుకార్డులతోపాటు రుణాలు అందక బలవన్మరణాలకు పాల్పడుతుండడం ఆవేదన కలిగిస్తోంది. -
కౌలు రైతుకు కన్నీరేనా!
► పెరుగుతున్న పెట్టుబడులు ► అందని ప్రభుత్వ సాయం జిల్లాలో కౌలు రైతు మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. ప్రకృతి విపత్తులు, చీడపీడల వల్ల పంట నష్టాలు జరిగినప్పడు వారికి పరిహారం రావట్లేదు. బ్యాంకర్లు పంట రుణాలు ఇవ్వడం లేదు. ప్రభుత్వం అందించే సబ్సిడీ విత్తనాలు, ఎరువులు, బీమా వంటి సదుపాయాలు వారిని చేరడం లేదు. దీంతో నూటికి 70 శాతం భూమిని సాగు చేస్తున్న జిల్లాలోని 2.5 లక్షల మంది కౌలు రైతులకు చివరకు కన్నీరే మిగిలే పరిస్థితులు నెలకొన్నాయి. అమరావతి (పెదకూరపాడు) : ప్రస్తుతం గ్రామాలలో భూ యజమానులు వ్యవసాయం చేయటం లేదు. వారు భూమిని కౌలు ఇచ్చేస్తున్నారు. ఇలా జిల్లాలో సుమారు 70 శాతం భూమిని కౌలు రైతులే సాగు చేస్తున్నారు. అయితే, వారికి ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలు ఏవీ అందడం లేదు. దీంతో అప్పుల పాలై పలువురు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. సాగు చట్టం వల్ల ఒరిగిందేమీ లేదు కౌలు రైతులకు ప్రోత్సాహకాలు అందించాలనే ఉద్దేశంతో 2011లో ప్రభుత్వం భూ అ«ధీకృత సాగు చట్టం అమల్లోకి తెచ్చింది. భూ అధీకృత రైతులను గుర్తించేందుకు ఉద్దేశించిన ఈ చట్టం కూడా కౌలు రైతులను ఆదుకోవట్లేదు. ఆదుకోని రుణార్హత కార్డు కౌలు రైతులకు బ్యాంకు రుణాలు ఇవ్వటానికి, ప్రభుత్వ పోత్సాహకాలు అందచేయటానికి రాష్ట్ర ప్రభుత్వం రుణ అర్హత కార్డులను పంపిణీ చేసింది. జిల్లాలో 2.5 లక్షల మంది కౌలు రైతులు ఉంటే గత మూడేళ్లుగా వరుసగా సుమారు 40 వేలు, 27 వేలు, 23 వేల కార్డులు మాత్రమే అందించింది. ఈ కార్డుల వల్ల కూడా ఎలాంటి ప్రయోజనం కలగకపోవటంతో కౌలు రైతులు ఈ ఏడాది వీటిని తీసుకోవడానికి ఆసక్తి చూపటం లేదు. అయితే, దేవాదాయ, అసైన్డ్ భూములకు రుణఅర్హత కార్డులు కూడా ఇవ్వటం లేదు. పెరుగుతున్న పెట్టుబడులు.. ఏయేటికాయేడు సాగుకు పెట్టుబడులు పెరిగిపోతున్నాయి. గతంలో కం టే విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, కూలి రేట్లు విపరీతంగా పెరిగాయి. వీటికితోడు కౌలు రేట్లు కూడా భారీగా పెరగటంతో కౌలు రైతులకు నానాటికి ఖర్చులు పెరిగిపోతున్నాయి. గతంలో ఎకరా సాగు చేయటానికి సుమారు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు ఖర్చయ్యే ది. అది ఇప్పుడు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు ఖర్చవుతోంది. అదేమిర్చి పంట వేస్తే లక్షకుపైగా ఖర్చు చేయాల్సిందే.గతం కంటే ప్రస్తుతం ఎకరాకు రూ.25 వేలు వర కు పెట్టుబడులు పెరిగిపోయాయి. మూడేళ్ళుగా ఇచ్చింది రూ.43 కోట్లు.. గత మూడేళ్లుగా జిల్లాలో వ్యవసాయం కోసం వివిధ బ్యాంకుల ద్వారా వందల కోట్ల రూపాయలు రుణాలు ఇస్తే అందులో కౌలు రైతులకు గ్రూపు రుణాలు, వ్యక్తిగత రుణాల కింద ఇచ్చింది కేవలం రూ.43 కోట్లు మాత్రమే. వందల కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాలను భూమికి దూరంగా ఉన్న వ్యవసాయం చేయని భూ యజమానులు పొందటంతో సాగు చేసే కౌలు రైతులు ప్రైవేటుగా అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోందిప కౌలు రైతుల్లో నేటికీ అయోమయం ఒకపక్క ఖరీఫ్ సీజన్ మొదలై రెండు నెలలు దాటినా కౌలు రైతులు బ్యాంకుల నుంచి రుణాలు అందించటంలో జాప్యం జరుగుతూనే ఉంది. దీంతో రుణాలు అందుతాయో లేదోనని అయోమయ స్థితిలో ఉన్న కౌలు రైతులు అధిక వడ్డీలకు అప్పులు, ఇంట్లో ఉన్న బంగారం తాకట్టు పెట్టి సాగు చేయాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. ఇప్పటికైనా బ్యాంకుల ద్వారా నేరుగా రుణాలు, పంటల బీమా సదుపాయం. ప్రకృతి విపత్తుల నుంచి నష్ట పరిహారం, ప్రభుత్వ సబ్సిడీలు అందించే విధంగా చర్యలు తీసుకుని కౌలు రైతులను కాపాడకపోతే వ్యవసాయం కుంటుపడుతుంది. కౌలు చెల్లించలేకపోతున్నాం.. గతేడాది గిట్టుబాటు ధర లేక నష్టాలు చవి చూడటంతో భూములకు కౌలు కట్టలేకపోతున్నాం. వ్యవసాయ ఖర్చు పెరిగినా, ఆదాయం తగ్గినా కౌలు మాత్రం తగ్గటం లేదు. నీటి వసతి ఉన్న పొలాలకు రూ.15 వేల నుంచి రూ.20 వేలు ఉండగా మిగిలిన భూములు రూ.10 వేలు కౌలు కట్టాల్సి వస్తోంది. భవిష్యత్‌లో ఇలా అయితే సాగు చేయలేం. – కళ్లం భాస్కరరావు, కౌలు రైతు, నెమలికల్లు ప్రయోజనాలు అందేలా చూడాలి.. ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని ప్రయోజనాలు కౌలు రైతులకు అందేటట్లు చూడాలి. నష్ట పరిహారం, బ్యాంకు రుణాలు, ప్రభుత్వ సబ్సిడీలు కౌలు రైతులకు అందించేలా ప్రభుత్వం విధి విధానాలు రూపొందించాలి. కౌలు రైతులకు కూడా పంటల బీమా సౌకర్యం కల్పించాలి. లేదంటే కౌలు రైతుల మనుగడ కష్టంగా మారుతుంది. – ఆర్.రామకృష్ణనాయక్, రైతు, పెదమద్దూరు పాలకులు పట్టించుకోవట్లేదు.. ఏళ్ల తరబడి నష్టాలు చవి చూస్తున్నా పాలకులు పట్టించుకోవటం లేదు. వ్యవసాయం చేసేవారిలో సుమారు 70 శాతం మంది కౌలు రైతులే. వీరిని నిర్లక్ష్యం చేస్తే వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేసినట్లే. ఇప్పటికైనా కౌలు రైతులకు పెట్టుబడికి రుణాలు, సాగుకు సబ్సిడీలు అందించి ఆదుకోవాలి. – చింతల భాస్కరరావు, అధ్యక్షుడు, అమరావతి ఏరియా రైతు సంఘం -
వరిపై వట్టి ప్రచారమే..!
►పట్టిసీమ ద్వారా నీళ్లిచ్చినా పశ్చిమ డెల్టాలో పూర్తి కాని నాట్లు ► గతేడాది కంటే భారీగా తగ్గిన మిర్చి సాగు ► పెరిగిన పత్తి విస్తీర్ణం ► కౌలు రైతులకు అందని రుణాలు సాక్షి, అమరావతి బ్యూరో: ‘ పట్టి సీమ ద్వారా నీరు ఇచ్చాం.. రైతులు రెండు నెలల ముందే వరి సాగు చేసుకొనే అవకావం వచ్చింది..’ అని ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారంతో ఊదరగొట్టింది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం రైతులు పెద్దగా ఆసక్తి చూపలేదు. ఆగస్టులోనే ప్రారంభిస్తున్నారు. కారణం పశ్చిమ డెల్టా రైతులు ప్రభుత్వ ప్రచారాన్ని పట్టించుకొలేదు. రైతులు సంప్రదాయబద్ధంగా ఏటా సాగు చేస్తున్న మాదిరిగా ఈ నెలలోనే వరి సాగు ప్రారంభించారు. దీనికి ప్రధాన కారణం జూన్ నెలలోనే సాగు ప్రారంభిస్తే అక్టోబరు, నవంబరులో పంట కోత వస్తోంది. ఆ సమయంలో తుఫాన్లు వస్తే భారీ నష్టం సంభవిస్తుందనే కోణంలో రైతులు ఆలోచిస్తున్నారు. భారీగా తగ్గిన మిర్చి సాగు.. జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 13,38,035 ఎకరాలు కాగా, ఇప్పటి వరకూ కేవలం 7,83,765 ఎకరాల్లో మాత్రమే పంటలు సాగయ్యాయి. ఇందులో 4,63,527 ఎకరాల్లో పత్తి పంట సాగు కావడం గమనార్హం. గతేడాది మిర్చి పెద్దఎత్తున సాగు చేయగా ఈ ఏడాది పత్తి సాగుపై రైతులు దృష్టి సారించారు. ఈ ఏడాది సాగు విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది. గతేడాది ఇదే సమయానికి 1,02,105 ఎకరాల్లో మిర్చి సాగు చేపట్టగా ఈసారి కేవలం 29,810 ఎకరాల్లో మాత్రమే మిర్చి సాగు చేయడం గమనార్హం. నాగార్జున సాగర్ కుడికాలువ పరిధిలో ఈ ఏడాది వరి సాగు చేసే అవకాశం లేకపోవడంతో రైతులు ప్రత్యామ్నాయంగా పత్తి సాగు చేస్తున్నారు. అపరాల పంటలు వేసేందుకు కూడా ఆసక్తి చూపటం లేదు. కౌలు రైతులకు కష్టాలే.... కౌలు రైతుల పట్ల ప్రభుత్వ సవతి ప్రేమ చూపిస్తోంది. జిల్లాలో ఖరీఫ్ రుణ లక్ష్యం రూ. 5,193 కోట్లు కాగా, ఇప్పటివరకూ రూ.4,000 కోట్లకు పైగా రుణాలు అందాయి. ఇప్పటికే వరి పంటకు తప్ప, అన్ని çరకాల పంటలకు పంట బీమా గడువు ముగిసింది. జిల్లాలో దాదాపు 2 లక్షల మందికి పైగా కౌలు రైతులు పంట సాగు చేస్తున్నారు. అయితే వీరిలో ఎల్ఈసీ కార్డులు, సీఓసీ పత్రాలు కేవలం 70,000 మందికి మాత్రమే అందాయి. ప్రభుత్వం ఈ ఏడాది కచ్చితంగా రైతులకు ఇస్తున్న రుణాల్లో 10శాతం రుణాలను కౌలు రైతులకు ఇవ్వాలని నిబంధన పెట్టింది. అంటే రూ.400 కోట్ల మేర కౌలు రైతులకు రుణాలు ఇవ్వాల్సి ఉంది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం కేవలం 14,000 వేల మంది కౌలు రైతులకు నామమాత్రంగా రూ. 62 కోట్లు ఇవ్వడం గమనార్హం. వరి పంటకు సైతం ఆగస్టు 21తో బీమా గడువు ముగుస్తోంది. ఖరీఫ్‌లో ఇంకా దాదాపు 5 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయాల్సింది. వీరంతా పంటల బీమా చేసుకొనే అవకాశం కోల్పోనున్నారు. -
కౌలు రైతు కుదేలు
►గుర్తింపు కార్డుల జారీలో జాప్యం ►నీరుగారుతున్న కౌలు రైతు చట్టం ►పంట రుణాలు అందక అవస్థలు ►వడ్డీ వ్యాపారుల వద్దే అప్పులు కెరమెరి(ఆసిఫాబాద్): సాగు జీవనాధారంగా చమటోడుస్తున్న కౌలు రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఖరీఫ్ ప్రారంభమై రెండున్నర నెలుల కావస్తున్నా పెట్టుబడులకు అవసరమైన ఆర్థిక సహకారం అందక కౌలు రైతు కుదేలవుతున్నాడు. ఆరేళ్లకిందట భూమిని నమ్ముకున్న కౌలు రైతుల కోసం తీసుకవచ్చిన చట్టాలు క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోవడం లేదు. వారికి రుణ అర్హత కార్డులను జారీ చేయాల్సి ఉంది. కొత్తవి జారీ చేయక పోగా పాత వాటిని సైతం పునరుద్ధరించడం లేదు. దీంతో కౌలు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. చట్టం ఇలా చెబుతోంది.. కౌలు రైతు చట్టం 2011 మేరకు భూ యజమానులు అనుమతులు లేకుండానే కౌలు రైతుకు రుణ అర్హత కార్డులు జారీ చేయాలి. తమ సొంత భూముల ద్వారా కౌలు రైతులు రుణాలు తీసుకోవడానికి ఎక్కువ మంది భూయజమానులు నిరాకరిస్తున్నారు. ఇదే ప్రధాన సమస్యగా వారికి రుణాలు అందడం లేదు. ఈ క్రమంలో 2015లో ఇప్పటి ప్రభుత్వం భూయజమాని అనుమతి లేకుండా రుణ అర్హత కార్డులు ఇవ్వొద్దని ఉత్తర్వులు జారీ చేసింది. అసలే భూ యజమానుల అనుమతి లేక రుణాలు పొందలేని వారికి ప్రభుత్వ జీవో కొత్త కష్టాలు తెచ్చిపెట్టింది. కొన్ని చోట్ల భూ యజమానులు అంగీకారం తెలిపినా బ్యాంకులు మాత్రం రుణాలు జారీ చేయడం లేదు. తమ భూములు తాకట్టు పెటి యజమానులు పంటరుణాలు తెచ్చుకోవడం కారణంగా రెండోసారి రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు నిరాకరిస్తున్నాయి. చట్టం ప్రకారం యజమానికి భూమి అభివృద్ధి కింద మరోసారి రుణం అందించే వెసులుబాటు ఉంది. అయితే బ్యాంకర్లు ఈ విషయాలను పరిగణలోకి తీసుకోవడం లేదు. సమన్వయలోపంతోనే.. అధీకృత సాగుధారులు చట్టం మేరకు రుణ అర్హత కార్డులు జారీ చేసిన రైతుకు ఎలాంటి హామీ లేకుండా రూ.50వేల రుణం ఇవ్వాల్సిన అవకాశం ఉన్నప్పటికీ బ్యాంకులు మాత్రం ముందుకు రావడం లేదు. రెవెన్యూ, వ్యవసాయాధికారులు , బ్యాంకర్ల మధ్య సమన్వయ లోపమే రైతుల పాలిట శాపంగా మారింది. సాగు చేసే అన్నదాతకు ప్రైవేట్ అప్పు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. గుర్తింపు అర్హత కార్డులు ఉన్నవారికి కూడా బ్యాంకర్లు మొండిచెయ్యి చూపుతున్నారనే ఆరోపణలు లేక పోలేదు. బ్యాంకులు రుణాలు ఇవ్వక పోవడంతో వడ్డీ వ్యాపారుల వద్ద అధిక వడ్డీతో అప్పులు చేయాల్సి వస్తోంది. కార్డులు అందని కౌలు రైతులు దయనీయ పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా రెవెన్యూ అధికారులు గ్రామసభలు ఏర్పాటు చేసి రైతుల అర్జీలను పరిశీలించి రుణ కార్డుల మంజూరు చేయాలని కౌలు రైతులు కోరుతున్నారు. జిల్లాలో ఇదీ పరిస్థితి.. చట్టం వచ్చినప్పటినుంచి జిల్లాలో 100మంది వద్ద కూడా కౌలు రైతు కార్డులు లేవు. గతంలో కొందరు దరఖాస్తులు చేసుకోగా ఇప్పటికీ వారికి గుర్తింపు కార్డులు అందలేదు. కొన్ని సంవత్సరాలు కావస్తున్నా కౌలు రైతుల గురించి అధికారులు పట్టించుకోక పోవడంతో ప్రభుత్వం తెచ్చిన చట్టం నీరుగారుతోంది. సీజన్ ప్రారంభంలో గ్రామసభలు ఏర్పాటు చేసి వినతులు స్వీకరించాల్సి ఉన్నప్పటికి వాటి గురించి పట్టించుకోలేదు. అయితే జిల్లాలో చాలా మండలాలు ఏజేన్సీలు కావడంతో 1/70 చట్టం అడ్డు రావడంతో అనేక మండలాల్లో దరఖాస్తులు కూడా అందలేదని తెలిసింది. దీంతో గిరిజన ప్రాంతాల్లోని గిరిజనేతర రైతులు పరిస్థితి దీనావస్థకు చేరింది. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు తమకు ప్రయోజనం కలిగించేలా సహకరించాలని వారు కోరుతున్నారు. -
కౌలు రైతు బలవన్మరణం
- మిరప సాగులో నష్టాలు - శనగ మాత్రలు మింగి ఆత్మహత్య - తమ్మడపల్లెలో విషాదం బనగానపల్లె రూరల్: మిరప సాగులో నష్టాలు రావడంతో బనగానపల్లె మండలం తమ్మడపల్లె గ్రామానికి చెందిన కౌలు రైతు ఆదిమూల బాలన్న(57) బలవన్మరణానికి పాల్పడ్డారు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బాలన్న మూడెకరాలను రూ.60వేలకు కౌలుకు తీసుకుని మిరప పంట సాగుచేశాడు. పంట దిగుబడి 70 క్వింటాళ్లు వచ్చింది. ఈ పంటను అమ్మేందుకు నాలుగు రోజుల క్రితం గుంటూరు మిర్చియార్డుకు తీసుకు వెళ్లారు. అక్కడ ఆశించిన ధర లభించకపోవడంతో గిడ్డంగిలో పెట్టి వచ్చాడు. పెట్టుబడి కోసం రూ.3లక్షల వరకు ప్రైవేట్ వ్యక్తుల వద్ద అప్పు చేశారు. అంతేకాకుండా రూ.20వేలు కేడీసీసీ బ్యాంకులో లోన్ తీసుకున్నాడు. వచ్చిన పంటకు ధర లేక వడ్డీలు అధికం కావడంతో మనస్తాపం చెంది గురువారం రాత్రి శనగ మాత్రలు మింగాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం బనగానపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కోలుకోలేక శుక్రవారం మృతి చెందాడు. మృతునికి భార్య సుంకమ్మ, కుమారుడు బాలకృష్ణ, కుమార్తెలు సువర్ణ, భార్గవిలు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాకేష్ తెలిపారు. -
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
ఓర్వకల్లు: అప్పుల బాధ తాళలేక ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని చింతలపల్లె గ్రామంలో సోమవారం చోటు చేసుకొంది. గ్రామానికి చెందిన వడ్డె వెంకటరమణ (45) తమకున్న రెండెకరాల పొలంతో పాటు మరికొంత భూమిని కౌలుకు తీసుకొని పండుమిర్చి పంటను సాగు చేశాడు. మూడేళ్ల నుంచి సరైన వర్షాలు కురువక తీవ్రంగా నష్టపోయాడు. వ్యవసాయానికి పెట్టుబడుల కోసం, ఇద్దరు కుమార్తెల పెళ్లిళ్ల కోసమని దాదాపు రూ.4 లక్షల దాకా అప్పు చేశాడు. ఈ క్రమంలో అప్పుదారుల నుంచి ఒత్తిళ్లు రావడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆదివారం సాయంత్రం పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో కోలుకోలేక సోమవారం మృతి చెందాడు. ఆ మేరకు మృతుడి భార్య వెంకటలక్ష్మి ఫిర్యాదు ప్రకారం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చంద్రబాబు నాయుడు తెలిపారు. -
కౌలురైతు ఆత్మహత్య
పాణ్యం : గడివేముల మండలం పెసరవాయి గ్రామ సమీపంలో ఓ కౌలు రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్ఐ రామాంజినేయరెడ్డి వివరాల మేరకు.. నంద్యాల మండలం కొత్తపల్లికి చెందిన వడ్డే ఖాదర్(61) పెసరవాయి గ్రామ పరిధిలో 4.50 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని పంటలు సాగు చేశాడు. పైరు సరిగా లేకపోవడంతో తొలగించి కొర్ర వేశాడు. ఇందుకోసం రూ. 6లక్షల వరకు అప్పు చేశాడు. పొలానికి వెళ్తున్నట్లు చెప్పి శుక్రవారం ఉదయం ఇంటి నుంచి బయలుదేరిన ఖాదర్ తర్వాత రాలేదు. శనివారం ఉదయం అటుగా వెళ్లిన స్థానికులు ఖాదర్ మృతదేహాన్ని గమనించి కుటుంబీకులకు సమాచారం అందించారు. కుమారుడు శివశంకర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. -
ఉసురు తీసిన అప్పు
కౌలు రైతు ఆత్మహత్య వల్లూరు: మండలంలోని దిగువపల్లెకు చెందిన బడేమియా బంగారు షావలీ(25 అనే రైతు అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. స్థానికులు తెలిపిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. దిగువపల్లెకు చెందిన షావలీ కుటుంబానికి గ్రామంలో దాదాపు 5 ఎకరాల పొలం వుంది. అయితే వరుస కరువులతో పంటలు సరిగా పండక పోవడంతో కుటుంబం అప్పుల పాలయింది. దాదాపు 5 ఏళ్ల నుంచి మామిడి తోటలను లీజుకు తీసుకుని అప్పుల నుంచి బయట పడడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో గతేడాది సిద్దవటం మండలంలోని జ్యోతి సమీపంలో మామిడి తోటలను మూడేళ్ల కాలానికి లీజుకు తీసుకున్నాడు. గతేడాది తెగుళ్లతో పూత పిందె లేక తీవ్రంగా నష్టం వచ్చింది. ఈ ఏడాదైనా కాపు వుంటే గట్టెక్కవచ్చని అనుకున్నాడు. మామిడి తోటలోనే కొంత కాలంగా తాత్కాలిక గుడారాలు ఏర్పాటు చేసుకుని కుటుంబంతో కలిసి కాపురం ఉంటున్నాడు. అయితే ఈ ఏడాది కూడా గ్రామంలోని పొలంలో సాగు చేసిన కంది పంట వర్షాభావంతో దెబ్బతినడంతో తీవ్రంగా నష్టాపోయాడు. దీనికి తోడు కౌలుకు తీసుకున్న మామిడి తోటలో పూత , పిందె ఆశాజనకంగా కనిపించక పోవడంతో నష్టాలు తప్పవని భావించాడు. రుణమాఫీ వర్తించక... పెట్టుబడి కోసం రూ. 5 లక్షలకు పైగా అప్పు చేశాడు. వడ్డీలతో కలిపి రుణభారం భారీగా పెరిగింది. ప్రభుత్వం అమలు చేసిన రుణమాఫీ పథకం కౌలు రైతులకు వర్తించడం లేదు. ఈ నేపథ్యంలో అప్పు ఎలా తీర్చాలని ఆయన తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. బతికి అవమానాల పాలు కావడం కంటే చావడమే మేలని నిర్ణయించుకున్నాడు. తోటలోనే విషపు గుళికలు మింగాడు. ఈ సంఘటనను గమనించిన ఆయన భార్య మహబూబ్‌బీ 108కు ఫోన్ చేశారు. 108 సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని, బాధితుడిని వాహనం ద్వారా కడప రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్నా పరిస్థితి విషమించడంతో గురువారం సాయంత్రం మృతి చెందాడు. మృతదేహానికి స్వగ్రామమైన దిగువపల్లెలో బంధువులు శుక్రవారం అతని భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించారు. ఇతనికి భార్య మహబూబ్‌బీ, అలీ మహమ్మద్(5), మాబూ హుసేన్(3) అనే ఇద్దరు కుమారులు వున్నారు. వీరితోపాటు వృద్ధులైన తల్లి , పెద్దమ్మ ఉన్నారు. కుటుంబానికి ఆధారమయిన షావలీ మరణంతో వారు వీధిన పడినట్లైందని స్థానికులు విచారం వ్యక్తం చేస్తున్నారు. చిన్నారులను చూసి ప్రతి ఒక్కరూ చలిస్తున్నారు. -
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి
పామిడి: కరువు పరిస్థితుల నేపథ్యంలో బతుకుదెరువు కోసం ఊరుగాని ఊరుకు వలసొచ్చిన ఓ కౌలు రైతు విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. అనంతపురం జిల్లా పామిడి మండలం సొరకాలయపేటలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. కర్నూలు జిల్లా డోన్ మండలం దేవరబండ వాసి కుమ్మర మహేశ్(28) ఏడాది కిందట తన భార్య జయలక్ష్మీ, కుమార్తె రమాదేవి(9), కుమారుడు అరుణ్(6)తో కలిసి సొరకాయలపేటకు వలస వచ్చాడు. గ్రామానికి చెందిన పరమేశ్వర్‌రెడ్డి ఇంటిలో అద్దెకుంటూ ఆయనతో పాటు నాగభూషణం అనే రైతుకు చెందిన పదెకరాలను కౌలుకు తీసుకుని పంటలు సాగు చేసుకుంటున్నాడు. గ్రామానికి చెందిన జంగం నడిపి కోదండ, అతని కుమారులు మహేశ్ ఇంటి కాంపౌడ్‌లోని చెట్టును నరికివేశారు. చెట్టుకొమ్మలు విద్యుత్ తీగలపై పడటంతో అది తెగిపోయింది. గ్రామానికి సరఫరా అయ్యే విద్యుత్ డీపీని ఆఫ్ చేశామని, తెగిన విద్యుత్ సర్వీసును స్తంభానికి ఏర్పాటు చేయాలని కోదండ కోరడంతో మహేశ్ కాదనలేకపోయాడు. స్తంభం ఎక్కి సర్వీసు వైరు తగిలించేందుకు యత్నించగా ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురై కిందపడి మృతి చెందాడు. విషయం తెలిసి భార్య జయలక్ష్మీ సొమ్మసిల్లి పడిపోయింది. ఎస్ఐ రవిశంకర్‌రెడ్డి కేసు నమోదు చేసుకొని, మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. -
కౌలురైతు ఆత్మహత్య
దొర్నిపాడు: మండల కేంద్రమైన దొర్నిపాడులో శుక్రవారం తెల్లవారుజామున బత్తులనాగన్న (45) అనే కౌలురైతు క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దొర్నిపాడు ఏఎస్ఐ బాలచంద్రుడు చెప్పిన వివరాల మేరకు.. బత్తులనాగన్న ఈ ఏడాది తనకున్న 2 ఎకరాల సొంతపొలంతోపాటు 4ఎకరాలు కౌలుకుతీసుకుని పత్తిపంట సాగుచేశాడు. పెట్టుబడుల కోసం రూ.లక్ష రూపాయల వరకు అప్పులు చేశాడు. గతంలో పంట పండించేందుకు చేసిన అప్పులు, ప్రస్తుతం చేసిన అప్పులు ఎక్కువ కావడంతో శుక్రవారం తెల్లవారుజామున పొలం వద్దకు వెళ్లి క్రిమిసంహారక మందు తాగి అపస్మారకస్థితికి చేరుకున్నాడు. చుట్టుపక్కల రైతులు గమనించి చికిత్స కోసం.. నంద్యాలకు తరలిస్తుండగా మృతి చెందాడు. ఇతనికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
కౌలు రైతు ఆత్మహత్య
ఎద్దులదొడ్డి(తుగ్గలి): అప్పుల బాధతో ఓ కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఎద్దులదొడ్డి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బాట రాజు (30) ఐదు ఎకరాల పొలం కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ ఏడాది వర్షాభావంతో సాగు చేసిన కంది, వేరుశనగ పంటలు పండక తీవ్రంగా నష్టపోయాడు. పెట్టుబడికి దాదాపు రూ.3.10 లక్షలు అప్పులు చేయగా.. తీర్చే మార్గం లేక తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. శనివారం పురుగు మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. గమనించిన కుటుంబీకులు చికిత్స నిమిత్తం కర్నూలుకు తరలించారు. అక్కడ కోలుకోలేక ఆదివారం మృతి చెందాడు. మృతుడికి భార్య లలితమ్మ, కూతురు, కుమారుడు ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తుగ్గలి ఎస్ఐ కేశవ తెలిపారు. -
చినుకు రాలదు.. ఆశ చావదు
► ప్రశ్నార్థకంగా పొగాకు సాగు ►మడుల్లో ఏపుగా పెరిగిన నారు.. ►చినుకు జాడలేక సాగని పొగనాట్లు ► అదును దాటిపోతోందని జిల్లా రైతుల ఆందోళన ►ఇప్పటికే వేసిన పంట వాడుముఖం ►వరుణుడి కోసం ఆశగా ఎదురుచూపు ►పంటను కాపాడుకునేందుకు భగీరథ ప్రయత్నం జిల్లాలో పొగాకు రైతులు ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. వర్షా భావం దెబ్బకు అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. అసలే వరుస నష్టాలతో అప్పుల ఊబిలో కూరుకుపోరుున పొగాకు రైతుపై అటు ప్రకృతి.. ఇటు ప్రభుత్వం రెండూ పగబట్టారుు. ఓ వైపు పొగాకు సాగును క్రమంగా తగ్గించాలని ప్రభుత్వం యోచిస్తోంది. సాగుకు సిద్ధంచేసిన చేలల్లో అదునులో మొక్క నాటుకుందామంటే చినుకు జాడలే దు. ఆశ చావని రైతన్న రెండు మూడు రోజులుగా ఊరిస్తున్న మబ్బులను చూసి, సాగుచేసేందుకు వ్యవయప్రయూసలు పడుతున్నాడు. ఏపుగా పెరిగిన పొగనారు మడుల్లోనే రంగు మారుతోంది. ఇప్పటికే సాగయిన పొలాల్లో మొక్కలు ఎండిపోతున్నాయి. క్యూరింగ్‌కు రావాల్సిన సమయంలో పంటను కాపాడుకునేందుకు రైతన్న భగీర థ ప్రయత్నం చేస్తున్నాడు. ఒంగోలు టూటౌన్/కందుకూరు రూరల్/కొనక నమిట్ల/: జిల్లాలో మొత్తం 14 వేలం కేంద్రాలు ఉండగా..17,149 మంది పొగాకు రైతులు ఉన్నారు. తేలిక నేలల పరిధి అయిన పొదిలి, కందుకూరు, కనిగిరి, కలిగిరి, డీసీ పల్లి ప్రాంతంలో ఈ యేడాది 39 మిలియన్ కిలోల ఉత్పత్తికి ఆధరైజ్డ్ ఇచ్చారు. 26 వేల హెక్టార్లలో పంట సాగుకు పొగాకు బోర్డు ఇచ్చింది. ఇందులో ఇప్పటి వరకు కేవలం 1859 హెక్టార్లే సాగయింది. సాగయిన పొగాకు పంట కూడా వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటుంది. కురిచేడు ప్రాంతంలో 30 రోజుల దశలో ఉన్న పంట పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. నీటికొరత వల్ల ఆకులు ఎండిపోతున్నాయి. డీసీపల్లి, కొనకనమిట్ల మండలాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని తెచ్చి పంటను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ట్యాంకర్‌కు రూ.2 వేలకుపైగా ఖర్చు అవుతున్నా.. రైతులు వెనకంజ వేయకుండా పొగమొక్కలకు నీటితడులు అందించేందుకు భగీర థ ప్రయత్నంచేస్తున్నారు. నల్లరేగడి నేలల పరిధిలో సాగు పరిస్థితి దారుణంగా ఉంది. మొత్తం 22వేల హెక్టార్లకు రిజిస్ట్రేషన్ అనుమతిస్తే.. ఇప్పటి వరకు కేవలం సుమారుగా 1000 హెక్టార్లలోనే పొగాకు సాగయింది. వెల్లంపల్లి, ఒంగోలు, టంగుటూరు కొండపి ప్రాంతాలలో ఏడు వేలం కేంద్రాలు ఉండగా.. వీటి పరిధిలో సాగయిన పంట కూడా వర్షాభావం దెబ్బకు విలవిలలాడుతుంది. కౌలు రైతు పరిస్థితి దయనీయం.. కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. అదనపు రుసుం రూ.400లతో బ్యారన్ల రిజిస్ట్రేషన్‌కు ఒక్క రోజే గడువు ఉంది. ఎస్ఎల్స్ పరిధిలో 11, 976 బ్యారన్లు ఉండగా ఇప్పటి వరకు 11, 687 బ్యారన్లకు రిజిస్ట్రేషన్ జరిగింది. ఎస్బీఎస్ పరిధిలో కూడా 10,168 బ్యారన్లు ఉండగా.. ఇంకా కొన్ని రిజిస్ట్రేషన్ కావాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. బ్యారన్ రిజిస్ట్రేషన్లు ఎలా ఉన్నా.. ప్రస్తుతం వేసిన పంటను కాపాడుకోవడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా.. వరుణుడు కరిణించకపోతే .. పొగాకు రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారయ్యే పరిస్థితి ఉంది. ఎకరాకు రూ.2 లక్షలు పెట్టుబడి.. కందుకూరులోని 26, 27వ వేలం కేంద్రాల పరిధిలో ఈ ఏడాది పొగనారు సాగు కూడా తగ్గిపోయింది. మండలంలో ఓగూరు, విక్కిరాలపేట, దూబగుంట, వలేటివారిపాలెం మండలం, పొన్నలూరు మండలాల్లో అధికంగా పొగనారు మళ్లు పెట్టారు. ఓగూరులో సుమారు 50, విక్కిరాలపేట, దూబగుంట ప్రాంతంలో మోరు 30 ఎకరాల్లో పొగనారుమళ్లు సాగు చేశారు. పొగాకు గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని భయపడి నారు మడులు సాగు చేసేందుకు రైతులు వెనుకంజ వేశారు. ఒక ఎకరం పొలంలో నారు సాగు చేయాలంటే కౌలు, కూలీల ఖర్చుతో సహా సుమారు రూ. 2 లక్షల పెట్టుబడి అయింది. వర్షాభావం కారణంగా నాట్లు వేకపోవడంతో ఇప్పటికే మడుల్లో పెరిగిన నారు చివర ఆకులను కోస్తున్నారు. ట్యాంకర్ల ద్వారా గుంటల్లో నీరు నింపుకొని స్ప్రిక్లర్లు ద్వారా నారుమడులకు నీరు పెడుతున్నారు. నీటి కష్టాలు ఉన్నప్పటికి నారు కొనే నాధులు ఇప్పటి వరకు రాలేదు. పెరిగిన నారును పై తలలు కోయడంతోపాటు ముదిరిన నారును నేరుగా పికి బయటపడేస్తున్నారు. వర్షాలు లేకపోతే నారుమడులు వదులుకోవాల్సిందే. పరిస్థితిని చూస్తే కనీసం పెట్టిన పెట్టుబడి కూడా వచ్చేలా కనిపించడం లేదు. ప్రస్తుతం మూట పొగ నారు రూ.500 నుంచి రూ.700 పలుకుతుంది. కందుకూరు 26వ వేలం కేంద్ర పరిధిలో 2225 బ్యారన్లు ఉండగా 4231 హెక్టార్లలో నాట్లు పడాలి. కాని ఇప్పటి వరకు 238 హెక్టార్లలో మాత్రమే నాట్లు వేశారు. 27వ వేలం కేంద్ర పరిధిలో 1997 బ్యారన్లు ఉండగా 4168 హెక్టార్లలో నాట్లు వేయాల్సి ఉండగా కేవలం 86 హెక్టార్లలో మాత్రమే రైతులు నాట్లు వేసినట్లు బోర్లు అధికారులు లెక్కలు చెప్తున్నాయి. ఏటా 50 ఎకరాలలో పొగాకు సాగు చేసే తాను ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల కారణంగా ఐదెకరాల్లో మాత్రమే సాగు చేస్తున్నానని కొనకనమిట్ల మండలం బ్రాహ్మణపల్లికి చెందిన రైతు పొదిలి తిరుపతయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. వర్షాలు పడితే నారుకు డిమాండ్ వర్షాలు పడితేనే నారుకు డిమాండ్ వస్తుంది. నారుని ఎంతో ఆరోగ్యకరంగా పెంచాం. వర్షాలు పడకపోవడంతో రైతులు పొగ నాట్లు వేసేందుకు మొగ్గు చూపడం లేదు. ఇప్పటికే సగం నారు కొనుగోలు చేస్తారు. కాని ఇప్పటి వరకు ఒక రైతుల కూడా నారు వైపు రాలేదు. పెట్టుబడులు మాత్రం ఎకరానికి రెండు లక్షల రూపాయల వరకు పెట్టాం. వర్షాలు లేకపోతే నష్టాలు తప్పవు. - రామిరెడ్డి, పొగాకు నారు రైతు, కందుకూరు నాట్లు పడకపోతే నష్టాలే.. పొగాకు సాగు చేసే రైతులు పొగనాట్లు వేయకపోతే నష్టాలు తప్పవు. ఏడెనిమిదేళ్లుగా నారు సాగు చేస్తున్నాను. ఎప్పుడు లేని విధంగా ఈ ఏడాది వర్షం నారుమళ్ల రైతులపై కన్నేర్ర చేసింది. నారంతా పీకేందుకు వచ్చింది. ఈ సమయంలో వర్షం పడితే నారుకు ఎలాంటి ఇబ్బంది లేదు. వర్షాలు పడకపోతే నష్టాలు సవి చూడాల్సి వస్తుంది. - శ్రీనివాసులరెడ్డి, పొగనారు రైతు -
అప్పులపాలై కౌలు రైతు ఆత్మహత్య
విజయపురి సౌత్: మాచర్ల మండలంలోని అనుపు చెంచుకాలనీకి చెందిన కౌలు రైతు వేసిన పంటపొలం పండకపోవడంతో పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన నూన్సావత్ హనుమానాయక్(47) గత మూడేళ్లుగా 9 ఎకరాల పొలం కౌలుకు తీసుకొని పండిస్తున్నాడు. గత మూడేళ్లుగా వర్షాలు సరిగ్గా కురవకపోవడంతో పంట చేతికి రాక అప్పలపాలయ్యాడు. ఈ ఏడాది తొమ్మిది ఎకరాల కౌలు పొలంలో పత్తి, మిర్చి వేయగా, సొంత పొలం అయిన ఒకటిన్నర ఎకరంలో కంది పంట వేశాడు. వర్షాలు ఆలస్యంగా కురవడంతో పంట ఎండిపోయిందనే బాధతో ఆత్మహత్యకు పాల్పడినట్టు గ్రామస్తులు తెలిపారు. ఉదయం పొలంకు వెళ్లి వస్తానని ఇంటి నుంచి బయలుదేరిన హనుమానాయక్ వెంట తెచ్చుకున్న పురుగుమందును తాగడంతో వాంతులు చేసుకున్నాడు. పక్క పొలంలో పొలం దున్నతున్న మోతీలాల్ అది గమనించి దగ్గరకు వెళ్లి చూడగా నోటి నుంచి నురుగులు వస్తుండడంతో హనుమానాయక్ సెల్‌ఫోన్ నుంచి కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. దీంతో హనుమానాయక్ కుటుంబ సభ్యులు గ్రామానికి నాలుగు కిలో మీటర్ల దూరంలో ఉన్న పొలానికి హుటాహుటిన చేరుకొని హనుమానాయక్‌ను గ్రామంలోకి తీసుకువస్తుండగా మృతిచెందాడు. మృతుడికి భార్య భారతి, ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. -
కౌలు.. కష్టం
కడప అగ్రికల్చర్: భూములను కౌలుకు తీసుకుని సాగు చేసే కౌలు రైతుల సంఖ్య ఏటా పెరుగుతోంది. ఫలితంగా కౌలురేట్లు రెట్టింపవుతున్నాయి. వర్షాధారం, నీటి ఆధారం, ఆయకట్టు, ఆయకట్టేతర ప్రాంతాల్లో కౌలు భూములు విస్తారంగా ఉన్నాయి. భూములు కలిగిన ఆసాములు కొందరు వ్యాపారాల కోసం, మరికొందరు పిల్లల చదువుల కోసం, ఇంకొందరు ఉద్యోగాల రీత్యా ఇలా పల్లెల నుంచి నగరాలకు, పట్టణాలకు వెళ్లిపోవడంతో వారి భూములు ఒక పక్క కంపచెట్లు మొలకెత్తడం, మరోపక్క బీడువారి పోతున్నాయి. అలా భూములు పాడవకుండా పంటలను సాగు చేసుకునే వారికి కౌలుకు (గుత్తకు) ఇచ్చారు. మరి కొందరు బోరుబావులున్న భూములను ఉద్యాన తోటల సాగుకు అప్పగించారు. ఇటీవల కాలంలో అరటి, చీనీ, నిమ్మ, పత్తి, బుడ్డశనగ, కూరగాయల పంటలకు మార్కెట్లో మంచి ధరలు పలుకుతుడడంతో కౌలుకు తీసుకుని సాగు చేసుకునేందుకు భూములు లేని రైతులు ముందుకు వచ్చారు. దీంతో కౌలురేట్లు రెండేళ్లతో పోలిస్తే రెట్టింపయ్యాయి. జిల్లాలో సాగు భూమి.. కౌలు భూములు జిల్లాలో మొత్తం భూమి 5,48,912 హెక్టార్లుకాగా, ఇందులో నల్లరేగడి భూమి 84,085 హెక్టార్లు, ఎర్రరేగడి భూములు 2,70,704 హెక్టార్లు, ఇతర రకాల భూములు 1,94,123 హెక్టార్లు ఉంది. దీంట్లో కౌలు భూమి 32,145 హెక్టార్లు ఉన్నట్లు అధికారిక రికార్డులు చెబుతున్నాయి. ఆయా కౌలు భూములను 28,416 మంది రైతులు కౌలుకు తీసుకుని పంటలు సాగు చేసుకుంటున్నారు. ఏటా పెరుగుతున్న కౌలు ధర కౌలును యజమానులు ఏటా పెంచుతున్నారు. గత ఏడాది వర్షాధారం కింద ఎకరా భూమికి రూ. 5 వేలు పలుకగా, ఈ ఏడాది రూ.12-15 వేలు, నీటి పారుదల కింద ఎకరాకు రూ. 15 వేల నుంచి రూ. 18 వేల మధ్య కౌలు పలుకుతున్నట్లు ఆయా రైతులు తెలిపారు. వరి పంట సాగు చేసే భూముల్లో అయితే కౌలుకు బదులుగా ఆయా కౌలుకు సమానంగా వడ్లు ఇవ్వాల్సి ఉంటుందని రైతులు తెలిపారు. పండ్లతోటల యజమానులకైతే మేజు (ఉచితంగా) గా 300 నుంచి 500 కిలోలు ఆయా పండ్లుగాని, కాయలుగాని ఇవ్వాల్సి ఉంటుందని కౌలు రైతులు పేర్కొన్నారు. బుడ్డశనగ... పత్తి ధరలు విపరీతంగా పెరగడంతో మరిన్ని చిక్కులు... జిల్లాలో ఖరీఫ్‌లో పత్తి, రబీలో బుడ్డశనగ పంటలను సాగు చేసే రైతులకు చిక్కులొచ్చిపడ్డాయి. ఇటీవల కాలంలో పత్తి, బుడ్డశనగ ధరలు మార్కెట్లో ఆశాజనకంగా ఉంటున్నాయి. దీంతో ఆయా పంటల ఉత్పత్తులకు మార్కెట్లో ధరలు బాగా పెరగడాన్ని గమనించిన భూమి యజమానులు కౌలు ధరలను కూడా అమాంతంగా పెంచేశారు. బుడ్డశనగ సాగు చేసే ప్రాంతాల్లో ఎకరాకు రూ. 12 వేల నుంచి రూ. 18 వేలకు పెంచారు. కొందరు భూముల యజమానులు పంట సాగు కంటే ముందు కౌలు(మునిగుత్త) రాబడుతున్నారు. కడప అగ్రికల్చర్: భూములను కౌలుకు తీసుకుని సాగు చేసే కౌలు రైతుల సంఖ్య ఏటా పెరుగుతోంది. ఫలితంగా కౌలురేట్లు రెట్టింపవుతున్నాయి. వర్షాధారం, నీటి ఆధారం, ఆయకట్టు, ఆయకట్టేతర ప్రాంతాల్లో కౌలు భూములు విస్తారంగా ఉన్నాయి. భూములు కలిగిన ఆసాములు కొందరు వ్యాపారాల కోసం, మరికొందరు పిల్లల చదువుల కోసం, ఇంకొందరు ఉద్యోగాల రీత్యా ఇలా పల్లెల నుంచి నగరాలకు, పట్టణాలకు వెళ్లిపోవడంతో వారి భూములు ఒక పక్క కంపచెట్లు మొలకెత్తడం, మరోపక్క బీడువారి పోతున్నాయి. అలా భూములు పాడవకుండా పంటలను సాగు చేసుకునే వారికి కౌలుకు (గుత్తకు) ఇచ్చారు. మరి కొందరు బోరుబావులున్న భూములను ఉద్యాన తోటల సాగుకు అప్పగించారు. ఇటీవల కాలంలో అరటి, చీనీ, నిమ్మ, పత్తి, బుడ్డశనగ, కూరగాయల పంటలకు మార్కెట్లో మంచి ధరలు పలుకుతుడడంతో కౌలుకు తీసుకుని సాగు చేసుకునేందుకు భూములు లేని రైతులు ముందుకు వచ్చారు. దీంతో కౌలురేట్లు రెండేళ్లతో పోలిస్తే రెట్టింపయ్యాయి. జిల్లాలో సాగు భూమి.. కౌలు భూములు జిల్లాలో మొత్తం భూమి 5,48,912 హెక్టార్లుకాగా, ఇందులో నల్లరేగడి భూమి 84,085 హెక్టార్లు, ఎర్రరేగడి భూములు 2,70,704 హెక్టార్లు, ఇతర రకాల భూములు 1,94,123 హెక్టార్లు ఉంది. దీంట్లో కౌలు భూమి 32,145 హెక్టార్లు ఉన్నట్లు అధికారిక రికార్డులు చెబుతున్నాయి. ఆయా కౌలు భూములను 28,416 మంది రైతులు కౌలుకు తీసుకుని పంటలు సాగు చేసుకుంటున్నారు. ఏటా పెరుగుతున్న కౌలు ధర కౌలును యజమానులు ఏటా పెంచుతున్నారు. గత ఏడాది వర్షాధారం కింద ఎకరా భూమికి రూ. 5 వేలు పలుకగా, ఈ ఏడాది రూ.12-15 వేలు, నీటి పారుదల కింద ఎకరాకు రూ. 15 వేల నుంచి రూ. 18 వేల మధ్య కౌలు పలుకుతున్నట్లు ఆయా రైతులు తెలిపారు. వరి పంట సాగు చేసే భూముల్లో అయితే కౌలుకు బదులుగా ఆయా కౌలుకు సమానంగా వడ్లు ఇవ్వాల్సి ఉంటుందని రైతులు తెలిపారు. పండ్లతోటల యజమానులకైతే మేజు (ఉచితంగా) గా 300 నుంచి 500 కిలోలు ఆయా పండ్లుగాని, కాయలుగాని ఇవ్వాల్సి ఉంటుందని కౌలు రైతులు పేర్కొన్నారు. బుడ్డశనగ... పత్తి ధరలు విపరీతంగా పెరగడంతో మరిన్ని చిక్కులు... జిల్లాలో ఖరీఫ్‌లో పత్తి, రబీలో బుడ్డశనగ పంటలను సాగు చేసే రైతులకు చిక్కులొచ్చిపడ్డాయి. ఇటీవల కాలంలో పత్తి, బుడ్డశనగ ధరలు మార్కెట్లో ఆశాజనకంగా ఉంటున్నాయి. దీంతో ఆయా పంటల ఉత్పత్తులకు మార్కెట్లో ధరలు బాగా పెరగడాన్ని గమనించిన భూమి యజమానులు కౌలు ధరలను కూడా అమాంతంగా పెంచేశారు. బుడ్డశనగ సాగు చేసే ప్రాంతాల్లో ఎకరాకు రూ. 12 వేల నుంచి రూ. 18 వేలకు పెంచారు. కొందరు భూముల యజమానులు పంట సాగు కంటే ముందు కౌలు(మునిగుత్త) రాబడుతున్నారు. కౌలు రైతుకు పెరుగుతున్న సాగు ఖర్చు రెట్టింపైన కౌలు రేట్లు పంట పండితే ఇవ్వడానికి బాధలేదు ప్రకృతి వైపరీత్యాలు..తెగుళ్లు,పురుగులు ఆశిస్తే కష్టమే కడప అగ్రికల్చర్: భూములను కౌలుకు తీసుకుని సాగు చేసే కౌలు రైతుల సంఖ్య ఏటా పెరుగుతోంది. ఫలితంగా కౌలురేట్లు రెట్టింపవుతున్నాయి. వర్షాధారం, నీటి ఆధారం, ఆయకట్టు, ఆయకట్టేతర ప్రాంతాల్లో కౌలు భూములు విస్తారంగా ఉన్నాయి. భూములు కలిగిన ఆసాములు కొందరు వ్యాపారాల కోసం, మరికొందరు పిల్లల చదువుల కోసం, ఇంకొందరు ఉద్యోగాల రీత్యా ఇలా పల్లెల నుంచి నగరాలకు, పట్టణాలకు వెళ్లిపోవడంతో వారి భూములు ఒక పక్క కంపచెట్లు మొలకెత్తడం, మరోపక్క బీడువారి పోతున్నాయి. అలా భూములు పాడవకుండా పంటలను సాగు చేసుకునే వారికి కౌలుకు (గుత్తకు) ఇచ్చారు. మరి కొందరు బోరుబావులున్న భూములను ఉద్యాన తోటల సాగుకు అప్పగించారు. ఇటీవల కాలంలో అరటి, చీనీ, నిమ్మ, పత్తి, బుడ్డశనగ, కూరగాయల పంటలకు మార్కెట్లో మంచి ధరలు పలుకుతుడడంతో కౌలుకు తీసుకుని సాగు చేసుకునేందుకు భూములు లేని రైతులు ముందుకు వచ్చారు. దీంతో కౌలురేట్లు రెండేళ్లతో పోలిస్తే రెట్టింపయ్యాయి. జిల్లాలో సాగు భూమి.. కౌలు భూములు జిల్లాలో మొత్తం భూమి 5,48,912 హెక్టార్లుకాగా, ఇందులో నల్లరేగడి భూమి 84,085 హెక్టార్లు, ఎర్రరేగడి భూములు 2,70,704 హెక్టార్లు, ఇతర రకాల భూములు 1,94,123 హెక్టార్లు ఉంది. దీంట్లో కౌలు భూమి 32,145 హెక్టార్లు ఉన్నట్లు అధికారిక రికార్డులు చెబుతున్నాయి. ఆయా కౌలు భూములను 28,416 మంది రైతులు కౌలుకు తీసుకుని పంటలు సాగు చేసుకుంటున్నారు. ఏటా పెరుగుతున్న కౌలు ధర కౌలును యజమానులు ఏటా పెంచుతున్నారు. గత ఏడాది వర్షాధారం కింద ఎకరా భూమికి రూ. 5 వేలు పలుకగా, ఈ ఏడాది రూ.12-15 వేలు, నీటి పారుదల కింద ఎకరాకు రూ. 15 వేల నుంచి రూ. 18 వేల మధ్య కౌలు పలుకుతున్నట్లు ఆయా రైతులు తెలిపారు. వరి పంట సాగు చేసే భూముల్లో అయితే కౌలుకు బదులుగా ఆయా కౌలుకు సమానంగా వడ్లు ఇవ్వాల్సి ఉంటుందని రైతులు తెలిపారు. పండ్లతోటల యజమానులకైతే మేజు (ఉచితంగా) గా 300 నుంచి 500 కిలోలు ఆయా పండ్లుగాని, కాయలుగాని ఇవ్వాల్సి ఉంటుందని కౌలు రైతులు పేర్కొన్నారు. బుడ్డశనగ... పత్తి ధరలు విపరీతంగా పెరగడంతో మరిన్ని చిక్కులు... జిల్లాలో ఖరీఫ్‌లో పత్తి, రబీలో బుడ్డశనగ పంటలను సాగు చేసే రైతులకు చిక్కులొచ్చిపడ్డాయి. ఇటీవల కాలంలో పత్తి, బుడ్డశనగ ధరలు మార్కెట్లో ఆశాజనకంగా ఉంటున్నాయి. దీంతో ఆయా పంటల ఉత్పత్తులకు మార్కెట్లో ధరలు బాగా పెరగడాన్ని గమనించిన భూమి యజమానులు కౌలు ధరలను కూడా అమాంతంగా పెంచేశారు. బుడ్డశనగ సాగు చేసే ప్రాంతాల్లో ఎకరాకు రూ. 12 వేల నుంచి రూ. 18 వేలకు పెంచారు. కొందరు భూముల యజమానులు పంట సాగు కంటే ముందు కౌలు(మునిగుత్త) రాబడుతున్నారు. Lease farmer , farmers , land, కౌలు రైతు, రైతులు, భూములు -
కౌలు రైతు ఆత్మహత్యాయత్నం
కడప సెవెన్‌రోడ్స్ : ఇతరుల ఆక్రమణలో ఉన్న తన భూమిని తనకు ఇప్పించాలని పలుసార్లు ‘మీకోసం’ కార్యక్రమంలో కలెక్టర్‌కు అర్జీలు సమర్పించినా రెవెన్యూ అధికారులు స్పందించలేదని వైఎస్సార్ జిల్లా బి.కోడూరు మండలం రెడ్డివారిపల్లెకు చెందిన రంపతాడు రామయ్య (70) అనే కౌలురౌతు గురువారం కలెక్టరేట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఉదయం నుంచే ఆయన కలెక్టర్ చాంబర్ ఎదుట నేలపై కూర్చొని ఉన్నాడు. కలెక్టర్ ఎప్పుడు వస్తారంటూ దారిన వెళ్లిన వారందరినీ విచారించాడు. ఓ ఉద్యోగి విషయం ఏమిటో తెలుసుకుందామని ఆయన వద్దకు వెళ్లాడు. మాట తడబడడమే కాకుండా పురుగులమందు తాగిన వాసన గుప్పుమనడంతో ఆయన వెంటనే బయట ఉన్న పోలీసులకు సమాచారం ఇచ్చాడు. 108 వాహనానికి ఫోన్ చేయగా, తాము రావడానికి ఆలస్యమవుతుందని బదులిచ్చారు. దీంతో విధి నిర్వహణలో ఉన్న ఎస్ఐ నాగరాజు హుటాహుటిన ఆ రైతును తన వాహనంలో రిమ్స్‌కు తరలించారు. వైద్యులు ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రాణాపాయం ఏమీ లేదని, ఏడు రోజులపాటు చికిత్స తీసుకోవాల్సి ఉంటుందని వైద్యులు పేర్కొన్నారు. కౌలు రైతు రామయ్య చెప్పిన కథనం మేరకు.... షెడ్యూల్డ్ కులానికి చెందిన ఆయన స్వగ్రామం రెడ్డివారిపల్లె కాగా, ప్రస్తుతం తమ అత్తగారి గ్రామమైన శంఖవరంలో ఉంటున్నాడు. ఆయనకు భార్య నారాయణమ్మ, కుమారుడు ఓబులేశు, కుమార్తె ఈశ్వరమ్మ ఉన్నారు. కుమార్తె టీటీసీ(టీచర్ ట్రైనింగ్ కోర్సు) చదివి ప్రస్తుతం ఇంటి వద్దనే ఉంటోంది. కుమారుడు, తను, తన భార్య కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గత ఆరేళ్లుగా రెండెకరాలు కౌలుకు తీసుకుని సేద్యం చేస్తున్నారు. ఒక ఎకరాకు రూ. 4500, మరో ఎకరాకు రూ. 5000 చొప్పున గుత్త చెల్లిస్తున్నాడు. బ్యాంకు రుణం, సబ్సిడీ విత్తనాలు, బీమా వంటి సంగతులేవీ ఆయనకు తెలియవు. ఇదిలా ఉండగా గతంలో ఆయన సర్వే నెంబరు 1274లో 3.62 ఎకరాల ప్రభుత్వ భూమిని అనుభవించుకుంటూ ఉండేవాడు. అయితే ఆ ప్రాంతానికే చెందిన ఓ వ్యక్తి ఆ భూమిని ఆక్రమించుకున్నాడని రామయ్య ఆరోపిస్తున్నాడు. తన భూమిని తిరిగి తనకు ఇప్పించి న్యాయం చేయాలని కాళ్లరిగేలా కలెక్టరేట్, తహశీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరిగాడు. మీకోసంలో పలుమార్లు అర్జీలు సమర్పించినప్పటికీ క్షేత్రస్థాయి అధికారులు పట్టించుకోకపోవడంతో విసిగి వేసారి పోయాడు. కలెక్టరేట్లోనే ఆత్మహత్య చేసుకుంటే కనీసం తన కుటుంబానికైనా న్యాయం జరుగుతుందనే ఆశతో ఈ యత్నానికి పాల్పడినట్లు ఆయన తెలిపారు. ఆక్రమణలో ఉన్న ఎస్సీ ఎస్టీల భూములను విడిపించి తిరిగి వాటిని వారికే అప్పగిస్తామని బుధవారం జరిగిన విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో కలెక్టర్ కేవీ సత్యనారాయణ చెప్పి 24 గంటలు కూడా ముగియకుండానే ఈ సంఘటన చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. -
అప్పుల బాధతో కౌలురైతు ఆత్మహత్య
సుండుపల్లి: అప్పుల బాధతో కౌలురైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వైఎస్సార్ జిల్లా సుండుపల్లి మండలం అగ్రహారంలో శనివారం చోటుచేసుకుంది. రైతు రాజగోపాల్‌రెడ్డి (46) సొంతూరు రాయచోటి మండలం సుజ్జాల. సుండుపల్లి అగ్రహారానికి 15 ఏళ్ల క్రితం వచ్చాడు. అప్పటినుంచి యేటిగడ్డరాచపల్లి, నర్సరీ సమీపంలో ఉన్న 5 ఎకరాలు కౌలుకు తీసుకొని వరి, కూరగాయలు, వేరుశనగ పంటలను సాగుచేసేవాడు. అయితే పంటల్లో దిగుబడి సరిగా రాక చేసిన అప్పులు తీరకపోవడంతో శనివారం తెల్లవారుజామున గుళికలమందు తిని పొలంవద్ద పడిపోయాడు. సమీపంలోని రైతులు గమనించి బంధువులకు తెలియజేయడంతో వారంతా వచ్చిచూసేసరికి అప్పటికే మృతిచెందాడు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. రాజగోపాల్‌రెడ్డికి ప్రైవేటుగా, బ్యాంకుల్లో కలిపి రూ.10లక్షల వరకు అప్పు ఉంది. కుమారుడు కె. రమేష్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్లు ఎస్సై మధుసూధన్‌రెడ్డి తెలిపారు. అనంతరం మృతదేహాన్ని రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు తరలించారు. -
కౌలు రైతు ఆత్మహత్య
వలిగొండ మండలం వెల్వర్తి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. అప్పుల బాధ తాళలేక కల్కూరి సత్తయ్య(59) అనే కౌలు రైతు క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి
రంగారెడ్డి జిల్లా యాలల మండలం బెన్నూరు గ్రామానికి చెందిన కౌలు రైతు కొత్త రాములు(35) విద్యుదాఘాతంతో గురువారం సాయంత్రం మృతిచెందాడు. పొలానికి నీళ్లు పెట్టేందుకు మోటారు ఆన్ చేయగా కరెంట్ షాక్ కొట్టి అక్కడికక్కడే చనిపోయాడు. మృతునికి బార్య మునెమ్మ, కుమార్తె శ్వేత ఉన్నారు. -
గుండెపోటుతో కౌలు రైతు మృతి
పత్తి విత్తనాలు మొలకెత్తక పోవడంతో కలత చెందిన కౌలు రైతు గుండె పోటుతో మృతి చెందాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా శాయంపేటలో సోమవారం జరిగింది. గ్రామానికి చెందిన ఉప్పుల విజేందర్(36) మేస్ర్తీ పనులు చేసుకుంటూనే రెండెకరాలు పొలం కౌలు తీసుకున్నాడు. ఇటీవల కురిసిన వర్షాలకు పత్తి విత్తనాలు వేశాడు. తర్వాత వర్షం ముఖం చాటేయడంతో విత్తనాలు సక్రమంగా మొలవలేదు. దీంతో కలత చెందాడు. ఇదే విషయాన్ని ఉదయం కుటుంబ సభ్యులతో చెబుతూ.. గుండె పోటుతో అక్కడికక్కడే కుప్పకూలి పోయాడు. ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించే లోపే మృతి చెందాడు. -
అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య
అప్పుల బాధతో ఓ కౌలు రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. కర్నూలు జిల్లా గూడూరులో ఈ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన దండు తిమ్మోతి(35)కి సొంత పొలం లేదు. దీంతో నాలుగు ఎకరాలను కౌలుకు తీసుకుని నాలుగేళ్ల నుంచి వ్యవసాయం చేసుకుంటున్నాడు. వర్షాభావ పరిస్థితులతో పంటలు సక్రమంగా పండక పెట్టుబడులు కూడా రాలేదు. అప్పులు దాదాపు రూ.4లక్షలు కావడంతో వాటిని తీర్చేందుకు ఆటో కూడా నడిపేవాడు. అయితే అప్పుల ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి అధికం కావడంతో తట్టుకోలేక జీవితంపై విరక్తి చెంది శనివారం సాయంత్రం పొన్నకల్లు రహదారి వైపు సొంత ఆటోలో చేరుకుని ముళ్ల కంచెల దాపులో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం ఉదయం అటువైపుగా వెళ్తున్న కూలీలు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కోడుమూరు సీఐ డేగల ప్రభాకర్, స్థానిక ఎస్ఐ చంద్రబాబు ఘటన స్థలాన్ని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. మతుడికి భార్య నయోమి, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. మతుడి తల్లి మరియమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.