కౌలు.. కష్టం | Lease farmers problems | Sakshi
Sakshi News home page

కౌలు.. కష్టం

Published Mon, Aug 15 2016 4:43 PM | Last Updated on Mon, Oct 1 2018 2:11 PM

కౌలు.. కష్టం - Sakshi

కౌలు.. కష్టం

కడప అగ్రికల్చర్: భూములను కౌలుకు తీసుకుని సాగు చేసే కౌలు రైతుల సంఖ్య ఏటా పెరుగుతోంది. ఫలితంగా కౌలురేట్లు రెట్టింపవుతున్నాయి. వర్షాధారం, నీటి ఆధారం, ఆయకట్టు, ఆయకట్టేతర ప్రాంతాల్లో కౌలు భూములు విస్తారంగా ఉన్నాయి. భూములు కలిగిన ఆసాములు కొందరు వ్యాపారాల కోసం, మరికొందరు పిల్లల చదువుల కోసం, ఇంకొందరు ఉద్యోగాల రీత్యా ఇలా పల్లెల నుంచి నగరాలకు, పట్టణాలకు వెళ్లిపోవడంతో వారి భూములు ఒక పక్క కంపచెట్లు మొలకెత్తడం, మరోపక్క బీడువారి పోతున్నాయి. అలా భూములు పాడవకుండా పంటలను సాగు చేసుకునే వారికి కౌలుకు (గుత్తకు) ఇచ్చారు. మరి కొందరు బోరుబావులున్న భూములను ఉద్యాన తోటల సాగుకు అప్పగించారు. ఇటీవల కాలంలో అరటి, చీనీ, నిమ్మ, పత్తి, బుడ్డశనగ, కూరగాయల పంటలకు మార్కెట్‌లో మంచి ధరలు పలుకుతుడడంతో కౌలుకు తీసుకుని సాగు చేసుకునేందుకు భూములు లేని రైతులు ముందుకు వచ్చారు. దీంతో కౌలురేట్లు రెండేళ్లతో పోలిస్తే రెట్టింపయ్యాయి. 
 
 జిల్లాలో సాగు భూమి.. కౌలు భూములు
 జిల్లాలో మొత్తం భూమి 5,48,912 హెక్టార్లుకాగా, ఇందులో నల్లరేగడి భూమి 84,085 హెక్టార్లు, ఎర్రరేగడి భూములు 2,70,704 హెక్టార్లు, ఇతర రకాల భూములు 1,94,123 హెక్టార్లు ఉంది. దీంట్లో కౌలు భూమి 32,145 హెక్టార్లు ఉన్నట్లు అధికారిక రికార్డులు చెబుతున్నాయి. ఆయా కౌలు భూములను 28,416 మంది రైతులు కౌలుకు తీసుకుని పంటలు సాగు చేసుకుంటున్నారు. 
 
ఏటా పెరుగుతున్న కౌలు ధర
కౌలును యజమానులు ఏటా పెంచుతున్నారు. గత ఏడాది వర్షాధారం కింద ఎకరా భూమికి రూ. 5 వేలు పలుకగా, ఈ ఏడాది రూ.12-15 వేలు, నీటి పారుదల కింద ఎకరాకు రూ. 15 వేల నుంచి రూ. 18 వేల మధ్య కౌలు పలుకుతున్నట్లు ఆయా రైతులు తెలిపారు. వరి పంట సాగు చేసే భూముల్లో అయితే కౌలుకు బదులుగా ఆయా కౌలుకు సమానంగా వడ్లు ఇవ్వాల్సి ఉంటుందని రైతులు తెలిపారు. పండ్లతోటల యజమానులకైతే మేజు (ఉచితంగా) గా 300 నుంచి 500 కిలోలు ఆయా పండ్లుగాని, కాయలుగాని ఇవ్వాల్సి ఉంటుందని కౌలు రైతులు పేర్కొన్నారు. 
 
బుడ్డశనగ... పత్తి ధరలు విపరీతంగా పెరగడంతో మరిన్ని చిక్కులు...
జిల్లాలో ఖరీఫ్‌లో పత్తి, రబీలో బుడ్డశనగ పంటలను  సాగు చేసే రైతులకు చిక్కులొచ్చిపడ్డాయి. ఇటీవల కాలంలో  పత్తి, బుడ్డశనగ ధరలు మార్కెట్‌లో ఆశాజనకంగా ఉంటున్నాయి. దీంతో  ఆయా పంటల ఉత్పత్తులకు మార్కెట్‌లో ధరలు బాగా పెరగడాన్ని గమనించిన భూమి యజమానులు కౌలు ధరలను కూడా అమాంతంగా పెంచేశారు. బుడ్డశనగ సాగు చేసే ప్రాంతాల్లో ఎకరాకు రూ. 12 వేల నుంచి రూ. 18 వేలకు పెంచారు.   కొందరు భూముల  యజమానులు పంట సాగు కంటే ముందు కౌలు(మునిగుత్త) రాబడుతున్నారు.  
 
 కౌలు రైతుకు పెరుగుతున్న సాగు ఖర్చు
 రెట్టింపైన కౌలు రేట్లు 
 పంట పండితే ఇవ్వడానికి బాధలేదు
 ప్రకృతి వైపరీత్యాలు..తెగుళ్లు,పురుగులు ఆశిస్తే కష్టమే
 
Lease farmer , farmers , land,  కౌలు రైతు, రైతులు, భూములు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement