అప్పుల భారం మరో కౌలు రైతు ఉసురు తీసింది. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలంలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన శేరిపల్లి యాదయ్య(52) గత కొన్నేళ్లుగా 15 ఎకరాలు భూమిని కౌలుకు తీసుకుని పంటలు సాగు చేస్తున్నాడు. పత్తి, మొక్కజొన్న పంటలు సరిగా పండకపోవటంతో రూ.లక్ష అప్పు మిగిలింది.
కూతురు పెళ్లి కోసం రూ.2 లక్షల అప్పు అయింది. పంటలు సరిగా లేక అప్పులు తీరేదారి కానరాక మనస్తాపం చెందిన యాదయ్య మంగళవారం మధ్యాహ్నం ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. ఆయనకు భార్య అంజమ్మ, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు.