చింతకాని మండలం నాగిలిగొండలో బుధవారం ఎస్‌కే బాషా(45) అనే కౌలు రైతు తన పొలంలో ఉన్న వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
చింతకాని మండలం నాగిలిగొండలో బుధవారం ఎస్‌కే బాషా(45) అనే కౌలు రైతు తన పొలంలో ఉన్న వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవల వేసిన పంటకు తెగులు వచ్చి పూర్తిగా పాడవటం, చేసిన అప్పులు రూ.8 లక్షలు తీర్చే మార్గం కనపడకపోవటంతో మనస్తాపం చెంది బలవన్మరణానికి పాల్పడినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.