అప్పుల బాధతో కౌలురైతు ఆత్మహత్య | Lease farmer committed suicide | Sakshi
Sakshi News home page

అప్పుల బాధతో కౌలురైతు ఆత్మహత్య

Published Fri, Apr 29 2016 7:10 PM | Last Updated on Mon, Oct 1 2018 2:36 PM

Lease farmer committed suicide

 పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం రాజవరంలో కౌలు రైతు శుక్రవారం వేకువజామున ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన మాధవరపు నరసింహమూర్తి (40) తాను సాగు చేస్తున్న పొలంలో పురుగు మందు తాగి మరణించాడు. నరసింహమూర్తి 10 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని వరి సాగు చేస్తున్నాడు.

 

నాలుగేళ్లుగా 8 లక్షల మేర అప్పులు చేశాడు. వరుస నష్టాలు రావడంతో అప్పులు తీర్చే దారిలేక ఇబ్బందులు పడుతున్నాడు. సొమ్ము చెల్లించాలని రుణదాతల నుంచి ఒత్తిడి పెరగడంతో నరసింహమూర్తి రెండు రోజుల క్రితం ఇల్లు వదిలి వెళ్లిపోయాడని తండ్రి చంద్రయ్య తెలిపాడు. అతని కోసం వెదుకుతుండగా సాగు చేస్తున్న పొలంలోనే శుక్రవారం విగతజీవిగా కనిపించాడు. నరసింహమూర్తికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement