Narasimha Murthy
-
అనైతిక సంబంధం భర్తకు తెలిసిందనే హత్య
బనశంకరి: కురబరహళ్లి జేసీ నగర్లో గురువారం జరిగిన నరసింహమూర్తి హత్యోదంతం మిస్టరీ వీడింది. తన అనైతిక సంబంధం భర్తకు తెలియడం, దీనిని నిత్యం ప్రశ్నిస్తుండటంతోనే ప్రియుడితో కలిసి నరసింహమూర్తిని అంతమొందించినట్లు భార్య అనిత వెల్లడించిందని పోలీసులు తెలిపారు. వివరాలు... మాగడి ప్రాంతానికి చెందిన అనితకు ఏడేళ్ల క్రితం నరసింహమూర్తి అనే వ్యక్తితో వివాహమైంది. దంపతులకు నాలుగేళ్ల కుమారుడు ఉన్నారు. అనితకు ఆరునెలల క్రితం టీ.నరసీపుర నివాసి రోషన్‌తో ఫేస్బుక్లో పరిచయమైంది. రోషన్ కంతూరు చక్కెర ప్యాక్టరీలో ఏసీ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు.ఫేస్బుక్ స్నేహం ఇద్దరిమధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. పసిగట్టిన భర్త నరసింహమూర్తి అనితను వేధించేవాడు. దీంతో భర్తను హత్య చేసి రోషన్‌ను వివాహం చేసుకోవాలని అనిత కుట్ర పన్నింది. ఇందుకు రోషన్ కూడా అంగీకరించాడు. గురువారం రాత్రి నరసింహమూర్తి భోజనం చేసిన తర్వాత అనిత రోషన్‌కు ఫోన్ చేసింది. దీంతో రోషన్ తన కంపెనీలోనే పని చేస్తున్న సోమరాజుతో కలిసి అనితా ఇంటికి చేరుకున్నాడు. అనంతరం ముగ్గురూ కలిసి నరసింహమూర్తిని తాళ్లతో బంధించి మారణాయుధాలతో దాడి చేసి హత్య చేశారు. మృతదేహాన్ని ప్లాస్టిక్ సంచిలో పెట్టి మంచం కిందికి తోసేశారు. రక్తపుమరకలను శుభ్రం చేశారు. వేకువజామున 4.30 సమయంలో మృతదేహాన్ని తరలించడానికి యత్నించగా కిందిఅంతస్తులో ఉన్న ఇంటి యజమాని నిద్రలేచారు. ఇరుగుపొరుగు వారు వాకింగ్ వెళ్లడంతో దీనితో మృతదేహాన్ని తరలించడం సాద్యం కాలేదు. 6 గంటలకు రోషన్, సోమరాజు ఇంటి నుంచి పారిపోయారు. ఉదయం 8 గంటల సమయంలో అనిత తన అత్త హనుమమ్మ, ఇతరులకు ఫోన్ చేసి భర్త కనబడలేదని తెలిపింది. అనుమానం వచ్చిన హనుమమ్మ మంచం కింద ఉన్న మృతదేహన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించింది. మహాలక్ష్మీలేఔట్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనితా, ఆమె పాత ప్రియుడు ప్రవీణ్‌పై అనుమానం ఉందని హనుమమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. ప్రియుడు ప్రవీణ్ పాత్రలేదని విచారణలో తేలింది. అనితను మరింత లోతుగా విచారణ చేయగా రోషన్, మరో వ్యక్తితో కలిసి హత్య చేసినట్లు అంగీకరించింది. దీంతో ముగ్గురినీ అరెస్ట్ చేశారు. -
పద్యం నేర్చుకుంటే మీరూ కేసీఆర్ కావొచ్చు!
నాటి మెదక్ జిల్లా దుబ్బాక ప్రభుత్వ పాఠశాల.. ఓ శనివారం.. ముందు పెట్టుకున్న నిబంధన ప్రకారం ప్రతి విద్యార్థి ఏదో అంశంపై మాట్లాడటమో, కవిత చెప్పటమో చేయాలి.. ఇంతలో బక్క పలచని ఎనిమిదో తరగతి విద్యార్థి లేచి నాటి సామాజిక పరిస్థితిని ఓ పద్యం, కొన్ని మాటల్లో చకచకా వివరించాడు. ఉపాధ్యాయులు చూస్తూ ఉండిపోయారు. ఈ పద్యాలు, ఆ మాటలుæ నీకెక్కడివిరా అనేసరికి.. ‘పద్యమంటే నాకు ఇష్టం, నా మాటలను పద్యంగా చెప్పటం ఇంకా ఇష్టం’ అన్నాడు! 40 ఏళ్లు గడిచాయి... తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతోంది. లక్షల సంఖ్యలో జనం ఒకచోటకు చేరారు. భారీ బహిరంగ సభలో ఓ బక్క పలచని వ్యక్తి వేదిక మీదకు వచ్చి పిడికిలి బిగించి చూపేసరికి జనంలో హోరు మొదలైంది. ఆ తర్వాత మాటలు.. వాటిని మించిన పద్యాలు.. ఆ తర్వాత పిట్ట కథలు.. తూటాల్లా పేలేసరికి ఆ ప్రాంగణం చప్పట్లు, ఈలల హోరుతో మార్మోగిపోయింది. ఆ బక్క పలచని వ్యక్తే ప్రస్తుత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు. ఆయన వాగ్ధాటిలో అడుగడుగునా వినిపించే విరుపులు, పిట్ట కథలు, సూటిగా తాకే తూటాల్లాంటి మాటలు.. ఆ వాగ్ధాటి కొద్దిమందికే సాధ్యం. స్వతహాగా మంచి మాటకారి అయినప్పటికీ, ఆ మాటకు కొత్త పల్లవినిచ్చింది మాత్రం పద్యమే. చిన్నప్పుడు నేర్చుకున్న పద్యాలు, శతకాలు ఓ మంత్ర దండంగా పనిచేసి ఆయన మాటకు వెలుగునిచ్చాయి. ఈ మాట చెబుతోంది ఎవరో కాదు.. కేసీఆర్‌కు చిన్నప్పుడు తెలుగు సాహిత్యాన్ని బోధించిన గురువు వేలేటి మృత్యుంజయ శర్మ!ప్రపంచ తెలుగు మహాసభల ప్రారంభోత్సవం రోజున సభ మొదలుపెట్టేముందు వేదికపై ఈ గురువుకు ముఖ్యమంత్రి గురువందనం నిర్వహించారు. చిన్నప్పుడు తనకు పద్యాలు నేర్పింది ఈ గురువే అంటూ పాదాభివందనం చేశారు. తెలుగు భాషను సుసంపన్నం చేసే క్రమంలో గతంలో ఎన్నడూ జరగని రీతిలో ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించాలన్న తపన రావటానికి నాడు కేసీఆర్ తెలుగు సాహిత్యం చదవటమే కారణమంటున్నారు. వివరాలు ఆయన మాటల్లోనే... ప్రపంచం దృష్టిని ఆకర్షించేందుకు మంచి మాట అవసరం. ఆ మాట మధురంగా ఉండాలి, అవసరమైతే కఠినంగా వినిపించాలి. కానీ ఎదుటివాడిని ఆకట్టుకునేలా ఉండాలి. గాలివాటం మాట ప్రభావాన్ని చూపదు. ఆ మాటకు ఏదో ఓ మాయ ఉండాలి. అది చేరాలంటే మన నోట సాహిత్యం పలకాలి. సాహిత్యమంటే అర్థం కాని గ్రాంథికమే కావాల్సిన అవసరం లేదు. జనం నోట కమ్మగా వినిపించే పద్యం చాలు. అలాంటి పద్యాలు రావాలంటే తెలుగు సాహిత్యం చదవాలి. ఇదంతా ఓ కృషి. అది ఆసక్తి ఉంటేనే సాధ్యం. కేసీఆర్‌కు అదే బలం..: తెలుగు మహాసభల ప్రారంభ వేదికపై అలవోకగా కేసీఆర్ నోట వచ్చిన పద్యాలు ఆయన ఇప్పుడు నేర్చుకున్నవి కాదు. చిన్నప్పుడు భాష వెంటపడి ఔపోసన పట్టినవే. అప్పుడు నేర్చిన పద్యాలు ఆయన్ను మాటల మాంత్రికుడిని చేశాయి. అది భాష గొప్పదనం. సాహిత్యం చదివిన వాడు తన మాటతో ప్రపంచాన్నే జయించగలడు. అసాధ్యమనుకున్న తెలంగాణను తెచ్చి చూపిన కేసీఆర్‌కు ఆ భాషే బలం. సభ తొలిరోజు ఆయన పద్యాలు చదివిన తీరు లక్షల మందిలో కొత్త ఆలోచనను రేకెత్తించి ఉంటాయి. వారూ పద్యాలు నేర్చుకోవాలనే తపన తెచ్చుకుని ఉంటారు. మన అమ్మ భాషలోని కమ్మదనాన్ని ఆస్వాదించిన నాడు, అందులో కొంతలో కొంత వంటపట్టించుకున్న నాడు మనను గుర్తించే సమాజం ఆవిష్కృతమవుతుంది. ఉద్యోగం, వ్యవహారం, వ్యాపారం... ఏదైనా కావచ్చు మనకు కలిసి వస్తుంది. ఎనిమిదో తరగతితో మొదలు..: నేను దుబ్బాక ప్రభుత్వ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేసేందుకు వెళ్లినప్పుడు కేసీఆర్ ఎనిమిదో తరగతిలో ఉన్నాడు. ఓ రోజు ఉత్తర గోగ్రహణంలోని ‘భీష్మద్రోణ కృపాదిధన్వినికరాభీలంబు...’ పద్యం చెప్పా. దాన్ని మరుసటి రోజు పుస్తకం చూడకుండా అప్పగించిన వారికి నోటు పుస్తకం బహుమతిగా ఇస్తానన్నా. కానీ ఓ ఐదు సార్లు దాన్ని చదివి అప్పటికప్పుడు కే సీఆర్ అప్పగించటంతో ప్రధానోపాధ్యాయుడి చేతిమీదుగా ఆయనకు పుస్తకం బహుమతిగా ఇచ్చా. ఆ రోజే భాషపట్ల ఆ విద్యార్థికి ఉన్న అనురక్తి గుర్తించా. మా ఇంటికి పాలు తెస్తూ..: ఆయన అప్పట్లో రాఘవరెడ్డి అనే మరో ఉపాధ్యాయుడి వద్ద ఉండి చదివేవాడు. ఆయన ఉన్న ఇంటికి సమీపంలోని ఇంటివారు మాకు పాలుపోసేవారు. ఓసారి కేసీఆర్ ఆ పాలు తీసుకుని మా ఇంటికి ఉదయం ఐదున్నరకు వచ్చాడు. వచ్చేసరికి నేను గ్రంథపఠనంలో ఉన్నాను. కేసీఆర్ ఎంతో ఉత్సాహంగా విన్నాడు. అలా రోజూ రావటం మొదలుపెట్టాడు. ప్రతిరోజు కొత్త విషయాలు, కొత్త పద్యాలు నేర్చుకునేవాడు. అలా రెండేళ్లు మా సాంగత్యం కొనసాగింది. తర్వాత నేను బదిలీపై మరో గ్రామానికి వెళ్లిపోయా. కానీ కేసీఆర్ మాత్రం తెలుగు భాషపై పట్టు పెంచుకుంటూ పోయాడు. సాయంత్రం వేళ చింతమడక గ్రామానికి చేరువలో ఉండే రామసంద్రం ఊరు చెరువు గట్టుపైకి వెళ్లి సొంతంగా పద్యరచన చేసేవాడు. ప్రతి ఒక్కరికి ఉపయోగం: తెలుగులో మాట్లాడ్డమే మర్చిపోతున్న నేటి తరం భాష ప్రాధాన్యాన్ని గుర్తించాలి. ఆంగ్ల మాధ్యమంలో చదివేవారైనా సరే, తెలుగు సాహిత్యంపై కొంత మక్కువ పెంచుకోవాలి. అది తదుపరి రోజుల్లో వారి మాట శుద్ధికి ఉపయోగపడుతుంది. అది వేరే భాషలు నేర్చుకోవటంలోనూ ఉపకరిస్తుంది. పద్యాలు, సామెతలు, పొడుపు కథలు, పలుకుబడులు, జాతీయాలు, మన సాహితీ చరిత్రలను నేర్చుకుంటే మాటతో ముందడుగు వేస్తారు. వారి చుట్టూ జనం చేసి, వారి సాంగత్యం కోసం పరితపించే పరిస్థితి ఉంటుంది. మన తెలుగు భాషకు ఉన్న శక్తి అలాంటిది. దానికి కేసీఆరే నిదర్శనం. – గౌరీభట్ల నరసింహమూర్తి -
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సీఐ
విజయనగరం జిల్లా: విజయనగరం టూటౌన్ సీఐగా పనిచేస్తున్న నరసింహ మూర్తి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఇటీవల కొంత మంది వ్యక్తులు పేకాటాడుతూ పట్టుబడ్డారు. వారిని కేసు నుంచి తప్పించేందుకు నరసింహమూర్తి రూ.50 వేలు లంచంగా అడిగారు. కాగా, పక్కా సమాచారంతో నిందితుల నుంచి లంచం తీసుకుంటుండగా సీఐని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
భార్యను చంపి.. అడ్డొచ్చిన అత్తపై దాడి
ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరులో దారుణం చోటుచేసుకుంది. తన పుట్టింట్లో తల్లిదండ్రులతో ఉంటున్న భార్యను విచక్షణ లేకుండా కత్తితో అతి దారుణంగా నరికేశాడో భర్త. ఈ ఘటన కొవ్వూరు 19వ వార్డు దొగ్గువారివీధిలో గురువారం చోటుచేసుకుంది. తన భర్త పెట్టే వేధింపులను భరించలేని భార్య వరలక్ష్మీ కొవ్వూరులోని పుట్టింటికి వెళ్లి తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. ఈ నేపథ్యంలో భర్త నర్సింహమూర్తి ఆమె పుట్టింటికి వెళ్లి ఆమెను కత్తితో పొడిచాడు. అడ్డు వచ్చిన అత్తపై కూడా కత్తితో దాడి చేశాడు. అనంతరం తాను కూడా గొంతుకోసుకున్నాడు. ఈ దాడిలో అత్త అచ్చాయమ్మ తీవ్రంగా గాయపడింది. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని, అత్త అచ్చాయమ్మను ఆస్పత్రికి తరలించారు. కుటుంబ కలహాలే కారణమని పోలీసులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
అప్పుల బాధతో కౌలురైతు ఆత్మహత్య
పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం రాజవరంలో కౌలు రైతు శుక్రవారం వేకువజామున ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన మాధవరపు నరసింహమూర్తి (40) తాను సాగు చేస్తున్న పొలంలో పురుగు మందు తాగి మరణించాడు. నరసింహమూర్తి 10 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని వరి సాగు చేస్తున్నాడు. నాలుగేళ్లుగా 8 లక్షల మేర అప్పులు చేశాడు. వరుస నష్టాలు రావడంతో అప్పులు తీర్చే దారిలేక ఇబ్బందులు పడుతున్నాడు. సొమ్ము చెల్లించాలని రుణదాతల నుంచి ఒత్తిడి పెరగడంతో నరసింహమూర్తి రెండు రోజుల క్రితం ఇల్లు వదిలి వెళ్లిపోయాడని తండ్రి చంద్రయ్య తెలిపాడు. అతని కోసం వెదుకుతుండగా సాగు చేస్తున్న పొలంలోనే శుక్రవారం విగతజీవిగా కనిపించాడు. నరసింహమూర్తికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
యాదగిరీశుడి ఆదాయం 11.. వ్యయం 14
యాదగిరికొండ: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆదాయం 11, వ్యయం 14, అమ్మవారి ఆదాయం 11, వ్యయం 5గా పంచాంగ శ్రవణంలో సత్యనారాయణశర్మ సిద్ధాంతి వినిపించారు. ఉగాది పండగను పురస్కరించుకుని ఆలయంలో పంచాంగాన్ని దేవస్థానం చైర్మన్ నరసింహమూర్తి, ఈఓ గీతారెడ్డి ఆవిష్కరించారు. పంచాంగ శ్రవణంలో ఈ ఏడాది రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని, పంటలు బాగా పండుతాయని, సకాలంలో వర్షాలు కురుస్తాయని సిద్ధాంతి పేర్కొన్నారు. స్వామి, అమ్మవార్ల ఆదాయం కన్నా వ్యయం ఎక్కువగా ఉంటుందనే భావన అవసరం లేదని, అమ్మవారితో స్వామి వారు కూడా ఉన్నందున ఆదాయ వ్యయాలలో సమాన భాగాలుగా ఉంటూ లోక కల్యాణం చేస్తారన్నారు. ఆహార ధాన్యాలు సరసమైన ధరలకు లభ్యమవుతాయన్నారు. కృష్ణా పుష్కరాల సమయంలో వివాహాది శుభ ముహూర్తాలు ఉండవన్నారు. -
రైతును తొక్కి చంపిన ఏనుగులు
సాక్షి, బెంగళూరు : ఏనుగుల బారిన పడి ఓ రైతు దుర్మరణం చెందాడు. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు వివరాలు... తుమకూరు జిల్లా గళిగేనహళ్లి గ్రామానికి చెందిన నరసింహమూర్తి (53) కొన్ని రోజులుగా కొడుకు మహేశ్‌తో పాటు గ్రామశివారులోని పొలం వద్దనే పడుకుంటూ తెల్లవారుజామునే వ్యవసాయ పనులు మొదలు పెట్టేవాడు. ఈ క్రమంలోనే ఆదివారం తెల్లవారుజామున కూడా వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉండగా సమీప అటవీ ప్రాతం నుంచి వచ్చిన రెండు ఏనుగులు నరసింహమూర్తిపై దాడి చేసి కాళ్లతో తొక్కి చంపేసాయి. సంఘటన జరిగిన ప్రాంతానికి కొంత దూరంలో మహేశ్ ఉండటంతో ప్రాణాలతో బయటపడ్డాడు. -
పగ వీడండి.. ప్రశాంతంగా జీవించండి
పగ, ప్రతీకారాలతో రగిలిపోతూ జీవితాలను అంధకారం చేసుకోవద్దని నందికొట్కూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ నరసింహమూర్తి ఫ్యాక్షన్ గ్రామాల వారికి సూచించారు. ఫ్యాక్షన్‌కు దూరంగా ఉండి పిల్లలపై భవిష్యత్తుపై దృష్టి పెట్టాలని, వారిని ఉన్నతంగా చదివించి ఆదర్శవంతులుగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. నందికొట్కూరు మార్కెట్ యార్డు వైస్ చైర్మన్, పగిడ్యాల మండలం ముచ్చుమర్రి కాంగ్రెస్ నాయకుడు సాయి ఈశ్వరుడి హత్య నేపథ్యంలో సోమవారం ముచ్చుమర్రితోపాటు ప్యాక్షన్ నేపథ్యం ఉన్న నెహ్రూనగర్, పగిడ్యాల గ్రామాల్లో సోమవారం సీఐ ఆధ్వర్యంలో స్పెషల్‌పార్టీ పోలీసులు కవాతు నిర్వహించారు. ఆయా గ్రామాల్లో బహిరంగ సభలు నిర్వహించి ఫ్యాక్షన్ దుష్ఫలితాలపై అవగాహన కల్పించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియకు భంగం కల్గించడం, అభ్యర్థులను భయబ్రాంతులకు గురి చేయడం తదితర చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని నాయకులకు హెచ్చరికలు జారీ చేశారు. హత్యలు, ఇతర నేరాలు, అందుకు బాధ్యులైన వారి గురించి పిల్లలకు చెప్పడం, వారిని గొప్ప చేసి మాట్లాడడం తగదని సూచించారు. వీలైతే మహాత్ముల చ రిత్రలను వివరించి వారి అడుగు జాడల్లో నడిచేలా ప్రోత్సహించాలన్నారు. ి సనిమాల ప్రభావంతో పెడతోవ పట్టకుండా భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని యువకు సూచించారు. గొడవలకు దూరంగా ఉండేలా మీ భర్తలను కట్టడి చేయండంటూ మహిళలను సీఐ కోరారు. గ్రామాల్లో ప్రశాంత జీవనానికి భ ంగం కల్గించే వారి పేర్లును తమ దృష్టికి తెస్తే తగు చర్యలు తీసుకుంటామన్నారు. పోలీసులకు సహకరించి పల్లెల్లో ప్రశాంత వాతావరణం నెలకొనేలా చూడాలని ఆయా గ్రామాల ప్రజలకు సీఐ పిలుపునిచ్చారు. ఆయన వెంటన ముచ్చుమర్రి ఎస్ఐ అరుణ్‌కుమార్‌రెడ్డి ఉన్నారు. పాత పోలీస్ స్టేషన్ సందర్శన: 2001లో నక్సల్స్ పేల్చివేసిన పాత పోలీస్‌స్టేషన్ భవనాన్ని సీఐ నరసింహమూర్తి సోమవారం సం దర్శించారు. ప్రస్తుతం ముచ్చుమర్రిలో ఉన్న పోలీస్‌స్టేషన్‌నుపగిడ్యాలకు తరలించాలని గతం లో పోలీసు ఉన్నతాధికారుల నుంచి మౌఖిక ఆదేశాలున్నప్పటికీ ప్రభుత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్ రాకపోవడంతో ఫలితం లేకుండా పోయింది. -
మహిళ సజీవ దహనం
= బట్టలు ఆరవేసే తాడు అడ్డంగా కట్టారంటూ గొడవ... = బెంగళూరు జనతా కాలనీలో దుర్ఘటన = గురువారం సాయంత్రం వివాదం తీవ్ర రూపం = రాత్రి వరకూ ఇరు కుటుంబ సభ్యుల కొట్లాట = కర్రలతో దాడి.. మహిళపై కిరోసిన్ పోసి నిప్పు బెంగళూరు, న్యూస్‌లైన్ : ఇంటి ముందు బట్టలు ఆర వేసే విషయంలో రెండు కుటుంబాల మధ్య జరిగిన గొడవ ఓ మహిళ సజీవ దహనానికి కారణమైంది. ఇక్కడి సోలదేవనహళ్లి పోలీసు స్టేషన్ పరిధిలోని దొడ్డ బెలెకెరె జనతా కాలనీలో కారు డ్రైవర్ నరసింహమూర్తి, రవి కళ (26) దంపతులు ఇద్దరు పిల్లలతో కలసి నివాసం ఉంటున్నారు. ఇదే వీధిలో రవి కళ అన్న రవికుమార్ నివాసం ఉంటున్నాడు. నరసింహమూర్తి నాలుగు నెలల కిందటే ఈ ప్రాంతంలో అద్దె ఇల్లు తీసుకున్నాడు. రవి కళ ఎంఎస్ రామయ్య ఆసుపత్రిలో హౌస్ కీపింగ్ పని చేస్తున్నది. ఆమె ఇంటి వెనుక మునితాయమ్మ, ఆమె పిల్లలు మంజు, మురళి, రూప నివాసముంటున్నారు. రవి కళ ఇంటి ముందు బట్టలు ఆరవేసుకోవడానికి తాడు కట్టింది. దీని వల్ల వచ్చి పోవడానికి తమకు ఇబ్బంది కలుగుతోందని మునితాయమ్మ పలు సార్లు గొడవ పడింది. రవి కళ మరో తాడు కూడా కట్టి బట్టలు ఆరవేయడంతో గురువారం సాయంత్రం మునితాయమ్మ గొడవకు దిగింది. రాత్రి 8.30 గంటల వరకు గొడవ జరుగుతూనే ఉంది. రవి కుమార్ విషయం తెలుసుకుని అక్కడికి వెళ్లి సర్ది చెబుతుండగానే.. మంజు, మురళి పెద్ద కర్రతో అతని తల మీద చితకబాదారు. తరువాత ఇంటిలోకి వెళ్లి కిరోసిన్ డబ్బా తీసుకు వచ్చారు. రవి కళ పారిపోకుండా ఇద్దరు పట్టుకున్నారు. ఒకరు ఆమె మీద కిరోసిన్ పోసి నిప్పంటించారు. ఒక్క సారిగా అగ్ని కీలలు శరీరమంతా వ్యాపించడంతో రవి కుమార్‌తో పాటు చుట్టు పక్కల వారు ఆమెను రక్షించే సాహసం చేయలేక పోయారు. అక్కడే ఆమె సజీవ దహనమైంది. ఈ సంఘటన జరిగిన వెంటనే మునితాయమ్మ, మంజు, మురళి, రూప పారిపోయారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని సప్తగిరి ఆస్పత్రికి తరలించారు. రవి కుమార్ చికిత్స పొందుతున్నాడని పోలీసులు శుక్రవారం తెలిపారు.