పగ వీడండి.. ప్రశాంతంగా జీవించండి
పగ, ప్రతీకారాలతో రగిలిపోతూ జీవితాలను అంధకారం చేసుకోవద్దని నందికొట్కూరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ నరసింహమూర్తి ఫ్యాక్షన్ గ్రామాల వారికి సూచించారు. ఫ్యాక్షన్‌కు దూరంగా ఉండి పిల్లలపై భవిష్యత్తుపై దృష్టి పెట్టాలని, వారిని ఉన్నతంగా చదివించి ఆదర్శవంతులుగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. నందికొట్కూరు మార్కెట్ యార్డు వైస్ చైర్మన్, పగిడ్యాల మండలం ముచ్చుమర్రి కాంగ్రెస్ నాయకుడు సాయి ఈశ్వరుడి హత్య నేపథ్యంలో సోమవారం ముచ్చుమర్రితోపాటు ప్యాక్షన్ నేపథ్యం ఉన్న నెహ్రూనగర్, పగిడ్యాల గ్రామాల్లో సోమవారం సీఐ ఆధ్వర్యంలో స్పెషల్‌పార్టీ పోలీసులు కవాతు నిర్వహించారు.
ఆయా గ్రామాల్లో బహిరంగ సభలు నిర్వహించి ఫ్యాక్షన్ దుష్ఫలితాలపై అవగాహన కల్పించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియకు భంగం కల్గించడం, అభ్యర్థులను భయబ్రాంతులకు గురి చేయడం తదితర చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని నాయకులకు హెచ్చరికలు జారీ చేశారు. హత్యలు, ఇతర నేరాలు, అందుకు బాధ్యులైన వారి గురించి పిల్లలకు చెప్పడం, వారిని గొప్ప చేసి మాట్లాడడం తగదని సూచించారు. వీలైతే మహాత్ముల చ రిత్రలను వివరించి వారి అడుగు జాడల్లో నడిచేలా ప్రోత్సహించాలన్నారు. ి
సనిమాల ప్రభావంతో పెడతోవ పట్టకుండా భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని యువకు సూచించారు. గొడవలకు దూరంగా ఉండేలా మీ భర్తలను కట్టడి చేయండంటూ మహిళలను సీఐ కోరారు. గ్రామాల్లో ప్రశాంత జీవనానికి భ ంగం కల్గించే వారి పేర్లును తమ దృష్టికి తెస్తే తగు చర్యలు తీసుకుంటామన్నారు. పోలీసులకు సహకరించి పల్లెల్లో ప్రశాంత వాతావరణం నెలకొనేలా చూడాలని ఆయా గ్రామాల ప్రజలకు సీఐ పిలుపునిచ్చారు. ఆయన వెంటన ముచ్చుమర్రి ఎస్‌ఐ అరుణ్‌కుమార్‌రెడ్డి ఉన్నారు.
పాత పోలీస్ స్టేషన్ సందర్శన:
2001లో నక్సల్స్ పేల్చివేసిన పాత పోలీస్‌స్టేషన్ భవనాన్ని సీఐ నరసింహమూర్తి సోమవారం సం దర్శించారు. ప్రస్తుతం ముచ్చుమర్రిలో ఉన్న పోలీస్‌స్టేషన్‌నుపగిడ్యాలకు తరలించాలని గతం లో పోలీసు ఉన్నతాధికారుల నుంచి మౌఖిక ఆదేశాలున్నప్పటికీ ప్రభుత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్ రాకపోవడంతో ఫలితం లేకుండా పోయింది.