యాదగిరీశుడి ఆదాయం 11.. వ్యయం 14 | Yadagiri temple income 11 and Expenditure 14 | Sakshi
Sakshi News home page

యాదగిరీశుడి ఆదాయం 11.. వ్యయం 14

Published Sat, Apr 9 2016 3:34 AM | Last Updated on Sun, Sep 3 2017 9:29 PM

యాదగిరీశుడి ఆదాయం 11.. వ్యయం 14

యాదగిరీశుడి ఆదాయం 11.. వ్యయం 14

యాదగిరికొండ: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆదాయం 11, వ్యయం 14, అమ్మవారి ఆదాయం 11, వ్యయం 5గా పంచాంగ శ్రవణంలో సత్యనారాయణశర్మ సిద్ధాంతి వినిపించారు. ఉగాది పండగను పురస్కరించుకుని ఆలయంలో పంచాంగాన్ని దేవస్థానం చైర్మన్ నరసింహమూర్తి, ఈఓ గీతారెడ్డి ఆవిష్కరించారు.

పంచాంగ శ్రవణంలో ఈ ఏడాది రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని, పంటలు బాగా పండుతాయని, సకాలంలో వర్షాలు కురుస్తాయని సిద్ధాంతి పేర్కొన్నారు. స్వామి, అమ్మవార్ల ఆదాయం కన్నా వ్యయం ఎక్కువగా ఉంటుందనే భావన అవసరం లేదని, అమ్మవారితో స్వామి వారు కూడా ఉన్నందున ఆదాయ వ్యయాలలో సమాన భాగాలుగా ఉంటూ లోక కల్యాణం చేస్తారన్నారు. ఆహార ధాన్యాలు సరసమైన ధరలకు లభ్యమవుతాయన్నారు. కృష్ణా పుష్కరాల సమయంలో వివాహాది శుభ ముహూర్తాలు ఉండవన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement