
విజయనగరం జిల్లా: విజయనగరం టూటౌన్ సీఐగా పనిచేస్తున్న నరసింహ మూర్తి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఇటీవల కొంత మంది వ్యక్తులు పేకాటాడుతూ పట్టుబడ్డారు. వారిని కేసు నుంచి తప్పించేందుకు నరసింహమూర్తి రూ.50 వేలు లంచంగా అడిగారు.
కాగా, పక్కా సమాచారంతో నిందితుల నుంచి లంచం తీసుకుంటుండగా సీఐని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.