ఏనుగుల బారిన పడి ఓ రైతు దుర్మరణం చెందాడు. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు వివరాలు...
సాక్షి, బెంగళూరు : ఏనుగుల బారిన పడి ఓ రైతు దుర్మరణం చెందాడు. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు వివరాలు... తుమకూరు జిల్లా గళిగేనహళ్లి గ్రామానికి చెందిన నరసింహమూర్తి (53) కొన్ని రోజులుగా కొడుకు మహేశ్‌తో పాటు గ్రామశివారులోని పొలం వద్దనే పడుకుంటూ తెల్లవారుజామునే వ్యవసాయ పనులు మొదలు పెట్టేవాడు.
ఈ క్రమంలోనే ఆదివారం తెల్లవారుజామున కూడా వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉండగా సమీప అటవీ ప్రాతం నుంచి వచ్చిన రెండు ఏనుగులు నరసింహమూర్తిపై దాడి చేసి కాళ్లతో తొక్కి చంపేసాయి. సంఘటన జరిగిన ప్రాంతానికి కొంత దూరంలో మహేశ్ ఉండటంతో ప్రాణాలతో బయటపడ్డాడు.