ఖమ్మం జిల్లా జైలు
ఖమ్మంరూరల్: స్థానిక రామన్నపేటలో గల జిల్లా జైలులో మాదాసు శ్రీనివాస్ అనే జీవిత ఖైదు శిక్షను అనుభవిస్తున్న ఖైదీ ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఖమ్మం నగరానికి చెందిన శ్రీనివాస్ గత ఐదు సంవత్సరాల క్రితం హత్యకేసులో జీవిత ఖైదుగా జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ మధ్య కాలంలోనే నెలరోజుల పెరోల్ కింద ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో గడిపి, రెండు రోజులక్రితం తిరిగి జైలుకు వచ్చాడు. అప్పటి నుంచి వింతగా ప్రవర్తిస్తుండటంతో జైలు అధికారులు ఒక దఫా కౌన్సెలింగ్ ఇచ్చారు.
తన జీవితం జైలులో పూర్తవుతుందని, ఇక తాను ఏమీ చేయలేనని మనోవేదన చెందుతున్నాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి తోటి ఖైదీలతో కలిసి భోజనం చేసి పడుకున్నాడు. తెల్లవారుజామున గది డోర్ కర్టెన్‌కు ఉన్న ఇనుప క్లిప్పులతో మెడపై కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన ఖైదీలు విధుల్లో ఉన్న జైలు వార్డర్‌కు చెప్పపడంతో చికిత్స నిమిత్తం ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ డ్యూటీ డాక్టర్ సెలవులో ఉండటంతో వరంగల్ ఎంజీఎం హాస్పిటకు పంపారు. వైద్యులు శ్రీనివాస్‌కు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment