ఒక్కొక్కరికి రూ.3 వేలు ఇచ్చాను..! | Sakshi
Sakshi News home page

ఒక్కొక్కరికి రూ.3 వేలు ఇచ్చాను..!

Published Wed, Oct 4 2023 12:30 AM

- - Sakshi

తమిళనాడు: పెరోల్‌పై బయటకు వెళ్లి మళ్లీ జైలుకు వచ్చిన జీవిత ఖైదీ సంచలన ఆరోపణలు చేశాడు. జైలులో పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులకు రూ.3 వేల చొప్పున ఇచ్చినట్లు అధికారులకు తెలిపాడు. వివరాలు.. సేలం సెంట్రల్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్న జీవిత ఖైదీ, చైన్నె తండయార్‌పేటకు చెందిన హరి అలియాస్‌ హరికృష్ణన్‌ (35) గతేడాది జూన్‌న్‌లో 3 రోజుల పెరోల్‌పై వెళ్లాడు. అతన్ని ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లిన వార్డెన్‌ రామ కృష్ణన్‌ను అరెస్టు చేశారు. అనంతరం ఉద్యోగం నుంచి తొలగించారు. ఈ కేసులో జీవిత ఖైదీ హరిని పోలీసులు సోమవారం ఉదయం అరెస్ట్‌ చేశారు.

అనంతరం కోర్టులో హాజరుపరిచారు. సోమవారం రాత్రి సేలం సెంట్రల్‌ జైలుకు తీసుకొచ్చి కేసు నమోదు చేశారు. ఖైదీ హరి అపస్మారక స్థితికి చేరుకోగానే జైలు అధికారులకు వాయిస్‌ మెసేజ్‌ పంపాడు. పెరోల్‌పై వెళ్లి తిరిగి వచ్చినందుకు అధికారులకు డబ్బులు చెల్లించాలని.. చిత్రహింసలకు గురిచేశారని అందులో పేర్కొన్నాడు. కోయంబత్తూరు జైలు శాఖ డీఐజీ షణ్ముగసుందరం విచారణ చేపట్టారు.

విచారణ జరిపి పెరోల్‌ విభాగంలో పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులకు మెమో ఇచ్చారు. త్వరలోనే వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. అదే సమయంలో పెరోల్‌పై వచ్చిన ఖైదీని 3 రోజుల పాటు సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ చిత్రహింసలకు గురిచేసిన ఇద్దరు వార్డెన్లు కూడా పట్టుబడ్డారు. వారిపై కూడా విచారణ జరుపుతామని అధికారులు తెలిపారు. పెరోల్‌ తర్వాత జైలుకు తిరిగి వచ్చిన తర్వాత కూడా ఇద్దరికి ఒక్కొక్కరికి రూ. 3 వేలు చెల్లించినట్లు ఖైదీ హరి అధికారులకు తెలిపాడు.

 
Advertisement
 
Advertisement