అప్పుల బాధతో మరో అన్నదాత ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా కొత్తగూడెం మండలం కోయగూడెంలో ఆదివారం సాయంత్రం జరిగింది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన నాగేశ్వర్ రావు(32) తనకున్న నాలుగెకరాల భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
ఈ క్రమంలో గతేడాది పంట దిగుబడి రాకపోవడంతో పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పులు తీర్చలేకపోయాడు. ఈ ఏడాది కూడా పంట ఆశించిన విధంగా లేకపోవడంతో.. మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.