మానసిక వేదనతో ఓ కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం రామదుర్గం గ్రామంలో బుధవారం జరిగింది. వరసగా రెండేళ్ళు తీవ్ర మైన పంట నష్టం రావడంతో.. కొనకండ్ల చిన్న హనుమంతు(65) తీవ్ర మనో వేదనకు గురయ్యాడు. ఈ క్రమంలోనే బుధవారం తెల్లవారు జామున ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ.. మరణించాడు.
రైతు ఆత్మహత్య
Published Wed, Sep 30 2015 4:37 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM
Advertisement
Advertisement