కౌలురైతు ఆత్మహత్య
Published Sat, Mar 18 2017 11:42 PM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM
పాణ్యం : గడివేముల మండలం పెసరవాయి గ్రామ సమీపంలో ఓ కౌలు రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్‌ఐ రామాంజినేయరెడ్డి వివరాల మేరకు.. నంద్యాల మండలం కొత్తపల్లికి చెందిన వడ్డే ఖాదర్(61) పెసరవాయి గ్రామ పరిధిలో 4.50 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని పంటలు సాగు చేశాడు. పైరు సరిగా లేకపోవడంతో తొలగించి కొర్ర వేశాడు. ఇందుకోసం రూ. 6లక్షల వరకు అప్పు చేశాడు. పొలానికి వెళ్తున్నట్లు చెప్పి శుక్రవారం ఉదయం ఇంటి నుంచి బయలుదేరిన ఖాదర్ తర్వాత రాలేదు. శనివారం ఉదయం అటుగా వెళ్లిన స్థానికులు ఖాదర్ మృతదేహాన్ని గమనించి కుటుంబీకులకు సమాచారం అందించారు. కుమారుడు శివశంకర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.
Advertisement
Advertisement