పంటలు సరిగా పండకపోవటంతో ఆవేదనకు గురైన రైతన్న పురుగు మందు తాగాడు.
పంటలు సరిగా పండకపోవటంతో ఆవేదనకు గురైన రైతన్న పురుగు మందు తాగాడు. కృష్ణా జిల్లా ఎ.కొండూరు మండలంలో కుమ్మరికుంట్ల గ్రామానికి చెందిన భూక్యా మత్యా(32)కు ఎకరం పొలం ఉంది. మరికొంత భూమిని కౌలుకు తీసుకుని ఐదేళ్లుగా వరి, పత్తి సాగు చేస్తున్నాడు. కుటుంబపోషణ, పంట సాగు నిమిత్తం రూ.3 లక్షల వరకు అప్పు చేశాడు. ఈ ఏడాది పంటల పరిస్థితి ఆశాజనకంగా లేకపోవటంతో మంగళవారం వేకువజామున పొలంలోనే పురుగు మందు తాగాడు. అపస్మారక స్థితిలో ఉన్న అతడిని ఉదయం గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ చనిపోయాడు. అతనికి భార్య జములమ్మ, ఇద్దరు పిల్లలున్నారు.