అప్పుల బాధలు తాళలేక ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది.
కరీంనగర్: అప్పుల బాధలు తాళలేక ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది.
వెలగటూరు మండలం చర్లపల్లి గ్రామానికి చెందిన మల్లేశం(32) పత్తి సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో సాగు చేసిన అప్పులు తీర్చే దారిలేక ఈ నెల 8న ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. దీంతో కుటుంబసభ్యులు అతనిని జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. గత ఐదు రోజులుగా చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం ఆయన మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.