Mallesam
-
వకీల్‌సాబ్ నటిపై రూమర్లు.. మండిపడ్డ టాలీవుడ్ బ్యూటీ
టాలీవుడ్లో మల్లేశం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన భామ అనన్య నాగళ్ల. మొదటి మూవీతోనే మంచి గుర్తింపు పొందిన ఈ బ్యూటీ ఇప్పుడిప్పుడే కెరీర్లో ముందుకెళ్తోంది. అయితే ఇటీవల ఆమెపై గాసిప్స్ గుప్పుమంటున్నాయి. త్వరలోనే ఆమె పెళ్లి చేసుకోబోతున్నట్లు ఇటీవల కొన్ని వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. టాలీవుడ్లో ఓ అగ్రనిర్మాత కుమారుడితో వివాహబంధంలోకి అడుగు పెడుతున్నట్లు పలు కథనాలు వచ్చాయి. ఈ వార్తలపై సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసింది అనన్య . 'నాకోసం వరుడిని చూసినందుకు ధన్యవాదాలు. ఇంకా పెళ్లి ఎప్పుడు, ఎక్కడ చేస్తున్నారో దయచేసి నాకు తెలియజేయండి. దానివల్ల నా పెళ్లికి నేను కూడా హాజరవుతానంటూ' వ్యంగ్యాస్త్రాలు సంధించింది. పవన్ కల్యాణ్ ‘వకీల్‌సాబ్’, ‘మ్యాస్ట్రో’ చిత్రాల తర్వాత అనన్య ‘శాకుంతలం’లో నటించారు. Guys, thanks for selecting a groom for me 🙏 but please naku kuda evaro cheppandi with the date and time as well, so that i can attend my own wedding 😊 — Ananya Nagalla (@AnanyaNagalla) October 2, 2022 -
ఈ సినిమా ఎంతో హృద్యంగా ఉంది : కేటీఆర్
సాక్షి, హైదరాబాద్ : మల్లేశం పాత్రలో ప్రియదర్శి బాగా నటించారని టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రశంసించారు. మల్లేశం సినిమాకు తెలంగాణ ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతకింది మల్లేశం జీవితకథ ఆధారంగా..‘మల్లేశం’ సినిమా రూపొందిన తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒక సామాన్యుడి జీవితాన్ని తెరపై ఆవిష్కరించిన విధానం బాగుందని కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. మల్లేశం సినిమా ఎంతో హృద్యంగా, మానవీయంగా ఉందని పేర్కొన్నారు. అంతరించిపోతున్న చేనేత కళకు మల్లేశం చిత్రం జీవం పోసిందని మూవీ యూనిట్‌ను అభినందించారు. సినిమాటోగ్రఫీ మంత్రితో మాట్లాడి ఈ సినిమాకు వినోదపు పన్ను రాయితీ వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు. నవీన ఆవిష్కరణల రూపకల్పనలో ఎన్నో ఇబ్బందులు ఉంటాయని.. మల్లేశం వాటిని అధిగమించి ఆసుయంత్రం తయారుచేసి ఎంతో మంది తల్లులకు ఉపశమనం కల్పించారని కేటీఆర్ కొనియాడారు. ఈ సినిమా మాటల రచయిత పెద్దింటి అశోక్ కుమార్ అజ్ఞాతసూర్యుడు అంటూ ప్రశంసించారు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతో చేస్తుందన్నారు. ఇక ఈ సినిమా తర్వాత చేనేత వస్త్రాలు ధరించడం మరింత పెరుగుతుందని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. -
జైలర్ వేధింపులు..ఖైదీల ఆందోళన
చర్లపల్లి జైళ్లో ఖైదీల ఆందోళన హైదరాబాద్: నగరంలోని చర్లపల్లి సెంట్రల్ జైలు డిప్యూటీ జైలర్ దశరథం వేధింపులకు గురిచేస్తున్నాడంటూ.. జైళ్లోని ఖైదీలు ఆందోళనకు దిగారు. భోజనం సరిగ్గాలేదని నిరసన తెలిపిన మల్లేశం అనే ఖైదీపై కక్ష కట్టిన జైలర్ దశరథం అతన్ని చర్లపల్లి నుంచి వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించడానికి యత్నిస్తున్నారు. దీంతో ఆగ్రహించిన ఖైదీలు గురువారం జైల్లో ఆందోళన చేపట్టారు. చర్లపల్లి జైలు సూపరిండెంట్ దశరథం అవినీతి పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విచారించాలని ఖైదీలు వేడుకుంటున్నారు. ఆయన ఖమ్మం సెంట్రల్ జైలు నుంచి చర్లపల్లి జైలుకు ఓ.డి పై వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఖైదీలను మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నారు. జైళ్ల శాఖ డీజీ వి.కే సింగ్ తాను ఎలా చెబితే అలా వింటాడని ఓ వైపు జైలు సిబ్బందిని మరో వైపు ఖైదీలను తరచూ వేధింపులకు గురి చేస్తున్నారు. జైలర్ వేధింపులు తాళలేక గతంలో ఓ ఖైదీ ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. జీవిత ఖైదు అనుభవిస్తున్న మల్లేషం పై జైలర్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఆయన అవినీతి, అక్రమాలను ప్రశ్నించిన జైలు సిబ్బంది, ఖైదీలపై జైళ్ల శాఖ డీజీకి తప్పుడు ఫిర్యాదు చేసి వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. దశరథం పై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని ఖైదీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
సైకో కిల్లర్స్!
ఒక్కొక్కరు..ఇద్దరిని చంపారు కోరుట్ల సర్కిల్లో కలకలం కోరుట్ల : చూడటానికి సాదాసీదాగా ఉంటారు.. అందరితో మాములుగానే మెదులుతారు. మాటమంతీ బాగానే ఉంటుంది.. ఒక్కోసారి ఏమవుతుందో తెలియదు.. తరతమ బేధాలు మరిచిపోతారు. ఉన్మాదులుగా మారిపోతారు. తెలిసినవారు..తెలియని వారు అన్న తేడా ఉండదు. కర్కశత్వం నింపుకుని కనబడిన వారిని కడ తేరుస్తారు. నాలుగు రోజుల వ్యవధిలో కోరుట్ల సర్కిల్ పరిధిలోనే జరిగిన రెండు హత్యల్లో నిందితులు సైకోకిల్లర్స్‌ను తలపిస్తూ కలకలం సృష్టించారు. అమ్మో మల్లేశ్.. కోరుట్ల మండలం చిన్నమెట్పల్లికి చెందిన జెల్లపల్లి మల్లేశం(28) గతనెల 25న కథలాపూర్ మండలం దుంపెటలో తన మామ దండిక భూమయ్యపై రోకలిబండతో దాడి చేసి హతమార్చాడు. అత్త గంగరాజు, భార్య వనజపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చాడు. వీరు తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జెల్లపల్లి మల్లేష్‌ను రెండురోజుల క్రితం పోలీసులు అరెస్టు చేశారు. ఇతడికి గతంలో మేనత్తను మంత్రాలనెపంతో హత్య చేసిన గతం ఉండటం గమనార్హం. 2008లో మల్లేష్ తన మేనత్త జెల్లపల్లి చిన్నక్క(55) తలను మొండెం నుంచి వేరు చేసి హతమార్చాడు. అక్కడితో సరిపెట్టుకోకుండా చిన్నక్కను ఎవరో చంపారని పోలీసులకు ఫోన్ చేసి అందరితోపాటు ఏడుస్తూ ఉన్నారు. ఈ హత్య వెనక కారణాలు అంతుపట్టని క్రమంలో లోతుగా ఆరా తీసిన పోలీసులు చివరికి మల్లేష్‌ను నిందితునిగా తేల్చి అరెస్టు చేశారు. ఇతనిపై పోలీసులు రౌడీషీట్ ఒపెన్ చేయడం గమనార్హం. ఊరంతా..హడల్! పోరుమల్లకు చెందిన అలకుంట శేఖర్(26) ఇతని పేరు చెబితే చాలు.. ఊరంతా హడలిపోతారు. గతేడాది మార్చి16న రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామ శివారులో మామిడితోటలో ఉన్న రఘుపతిరెడ్డి అనే వ్యక్తి కేవలం బీడీ ఇవ్వనందుకు బండతో మోది హతమార్చాడు. ఆ తరువాత రఘుపతి రెడ్డి శవాన్ని ఎవరు గుర్తుపట్టకుండా ఉండేందుకు కాల్చివేశాడు. ఆ కేసులో కరీంనగర్ జైలులో రిమాండ్‌లో ఉన్న అలకుంట శేఖర్ అవస్థలు చూడలేక తల్లి శంకరమ్మ ఇరవై రోజుల క్రితం బెయిల్‌పై ఇంటికి తీసుకువచ్చింది. ఇంటికి వచ్చిన శేఖర్ ఎప్పటిలాగే గ్రామస్తులను హడలగొట్టడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మానసిక వైద్యులతో చికిత్స చేయించే ప్రయత్నం చేసినా.. ఫలితం లేకపోయింది. వైద్యులు లేక మళ్లీ ఇంటికి పంపించారు. ఇంటికి చేరిన శేఖర్ శుక్రవారం అర్ధరాత్రి తల్లి శంకరమ్మపై దాడి చేసి దారుణంగా హతమార్చి పరారయ్యాడు. ఈ రెండు సంఘటనల్లో ఇద్దరు నిందితులు డబుల్ మర్డర్లు చేసి సైకోలు కావడం ఈ ప్రాంతంలో సంచలనం సృష్టించింది. -
చెరువులో జారిపడి యువకుడి మృతి
ప్రమాద వశాత్తు చెరువులో పడి గల్లంతైన యువకుడి మృత దేహం మంగళవారం లభ్యమైంది. మెదక్ జిల్లా హత్నూరు మండలం నాగులదేవులపల్లి గ్రామానికి చెందిన నాలుగో వార్డు మెంబర్ చిన్న మల్లేశం(28) ఆదివారం రాత్రి స్నేహితులతో కలిసి చెరువుకట్ట వద్దకు వెళ్లాడు. ప్రమాదవశాతు కాలు జారి అందులో పడి గల్లంతయ్యాడు. అప్పటి నుంచి అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే సోమవారం అంతా యువకుడి ఆచూకీ తెలియలేదు. దీంతో మంగళవారం ఉదయం కూడా గాలింపు కొనసాగించారు. ఉదయం గాలింపు ప్రారంభించిన కొద్ది సేపటికే మల్లేశం మృతదేహం దొరికింది. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
‘ఈ-నామ్’ పటిష్టంగా అమలు చేయాలి
మార్కెటింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ మల్లేశం గజ్వేల్: గజ్వేల్ మార్కెట్‌యార్డులో ‘ఈ-నామ్’ పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలని మార్కెటింగ్‌శాఖ డిప్యూటీ డైరెక్టర్ మల్లేశం సూచించారు. సోమవారం గజ్వేల్ యార్డులో కమీషన్ ఏజెంట్లు, వ్యాపారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు గిట్టుబాటు ధర అందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఈ-నామ్’ను యార్డుల్లో సమర్థంగా అమలు చేయడానికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లు పనిచేయాలన్నారు. ఈ విధానం ద్వారా రైతు ఆన్లైన్లో దేశంలోని ఏ మార్కెట్లో అధిక ధర ఉన్నా అక్కడ తమ ఉత్పత్తులను అమ్ముకునే అవకాశముందని పేర్కొన్నారు. ఇంకా ఈ సమీక్షలో గజ్వేల్ మార్కెట్ కమిటీ కార్యదర్శి వెంకట్రాహుల్ తదితరులు పాల్గొన్నారు. -
అక్రమ అరెస్ట్‌లు తగదు
సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లేశం సీపీఎం ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం సంగారెడ్డి మున్సిపాలిటీ: మల్లన్న సాగర్ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం కేసులు బనాయించి అరెస్టులు చేయడాన్ని సీపీఎం తీవ్రంగా ఖండించింది. శుక్రవారం సీపీఎం కార్యాలయం నుంచి ఆ పార్టీ నాయకులు కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లేశం మాట్లాడుతూ... మల్లన్నసాగర్ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం మొండి వైఖరితో వ్యవహరిస్తోందని విమర్శించారు. అక్రమంగా అరెస్టు చేసిన సీపీఎం నాయకుడు మల్లేశం, భాస్కర్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే 2013 చట్టం ప్రకారం గ్రామ సభలు జరిపి ప్రజాభిప్రాయం ఎందుకు తీసుకోలేదన్నారు. టీఆర్ఎస్ నాయకులు దళారులను నియమించి రైతులను మభ్యపెడుతున్నారని విమర్శించారు. ముంపు గ్రామాల ప్రజలకు సీపీఎం అండగా ఉంటుందన్నారు. ఈ నిరసనలో సీపీఎం నాయకులు సాయిలు, యాదవరెడ్డి, ప్రవీణ్‌కుమార్, అశోక్, ఆశన్న, మహబుబ్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ షాక్‌తో రైతు మృతి
విద్యుత్ షాక్‌తో ఓ రైతు దుర్మరణం చెందిన సంఘటన కరీంనగర్ జిల్లా వేములవాడ మండలం అయ్యోరుపల్లిలో గురువారం జరిగింది. అయ్యోరుపల్లికి చెందిన తేలు మల్లేశం గురువారం తెల్లవారు జామున తన పొలానికి వెళ్లాడు. కరెంట్ మోటారు ఆన్ చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. విద్యుత్ షాక్‌తో అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉంది. -
విద్యుదాఘాతానికి రైతు బలి
పొలం వద్ద ఉన్న ట్రాన్స్ఫార్మర్పై ఫీజు మర్చడానికి వెళ్లిన రైతు విద్యుధ్ఘాతానికి గురై మృతిచెందాడు. ఈ సంఘటన వరంగల్ జిల్లా జనగామ మండలం షామీర్పేట గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బొజ్జుల మల్లేశం(40) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ రోజు పొలం వద్దకు వెళ్లిన అతను ట్రాన్స్ఫార్మర్ వద్ద మృతదేహంగా పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కాగా.. అప్పల బాధతోటే విద్యుత్ పట్టుకొని ఆత్మహత్య చేసుకున్నాడని భార్య నిర్మల ఆరోపిస్తోంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
చికిత్స పొందుతూ కౌలురైతు మృతి
కరీంనగర్: అప్పుల బాధలు తాళలేక ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. వెలగటూరు మండలం చర్లపల్లి గ్రామానికి చెందిన మల్లేశం(32) పత్తి సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో సాగు చేసిన అప్పులు తీర్చే దారిలేక ఈ నెల 8న ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. దీంతో కుటుంబసభ్యులు అతనిని జగిత్యాల ఆస్పత్రికి తరలించారు. గత ఐదు రోజులుగా చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం ఆయన మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
డెంగీతో ముగ్గురి మృతి
వేములవాడ: డెంగీ తెలంగాణ రాష్ట్రంలో బుధవారం ముగ్గురు మృతిచెందారు. కరీంనగర్ జిల్లా వేములవాడ మండలం శంకర్పల్లి గ్రామానికి చెందిన ఇద్దరు డెంగీతో బుధవారం మృతి చెందారు. గ్రామానికి చెందిన మల్లేశం (30), కాశం లావణ్య (37) తీవ్ర జ్వరంతో ఐదు రోజులుగా బాధపడుతున్నారు. మల్లేశంను కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించగా, లావణ్యను హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమించడంతో బుధవారం ఇరువురు మృతి చెందారు. మరో ఘటనలో వరంగల్ జిల్లా వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం పంథిని గ్రామానికి చెందిన రుషి (6) వారం రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతుడూ హన్మకొండలోని ఓ ప్రైవేటు పిల్లల ఆస్పత్రిలో మంగళవారం రాత్రి మృతి చెందాడు. డెంగీతోనే బాలుడు మృతి చెందాడని వైద్యులు వెల్లడించారు. -
తుపాకితో హల్చల్ చేసిన ముఠా అరెస్ట్
మెదక్ (చేగుంట): తుపాకీతో బెదిరించి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన మెదక్ జిల్లా చేగుంటలో చోటుచేసుకుంది. మెదక్ జిల్లా చేగుంట మండలంలోని గోవిందాపూర్‌కు చెందిన తిట్ల మల్లేశం కొంతకాలం క్రితం ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతులు చేపట్టడానికి మధ్యప్రదేశ్ వెళ్లాడు. అక్కడ అమిత్‌సింగ్ అనే వ్యక్తి నుంచి తుపాకి, 9 బుల్లెట్లు కొనుగోలు చేశాడు. వాటిని సొంతగ్రామంలోని మసీదుపల్లి మల్లేశం, ఉప్పల ఎల్లం అనే ఇద్దరికి అమ్మాడు. అప్పటి నుంచి వీరు తుపాకీ చూపిస్తూ బాటసారులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు. తాజాగా అదే మండలంలోని గువ్వలెగి గ్రామానికి చెందిన రమేష్ అనే వ్యక్తిని అడ్డగించి తుపాకీతో బెదిరించి రూ.20 వేలు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు. ముసుగుల్లో ఉన్న వ్యక్తులను గుర్తించిన రమేష్ చేగుంట పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే పోలీసులు విచారణ చేపట్టి వీరిరువురితో పాటు వీళ్లకు తుపాకీ అమ్మిన తిట్ల మల్లేశంను కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి తుపాకీతో పాటు 8 రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. -
‘ఉపాధి’ ఎత్తివేసేందుకు కేంద్రం కుట్ర
సిద్దిపేట అర్బన్: కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని ఎత్తి వేసేందుకు కుట్ర పన్నుతోందని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఏ. మల్లేషం పేర్కొన్నారు. ఉపాధి పథకంపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఆర్డీఓ కార్యాలయం ఎదుట బుధవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మల్లేషం మాట్లాడుతూ ఉపాధి హామీ ద్వారా గ్రామాల్లో అనేక మంది ఉపాధి పొందుతున్నారన్నారు. మండలాలను కుదించడం ద్వారా వలసలు, కూలీల ఆత్మహత్యలు పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం భూస్వాములకు పెత్తందారులకు తలొగ్గి ఈ పథకాన్ని ఎత్తి వేయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. పథకంలో ఉన్న లోపాలను సవరించి పని దినాలను 200 రోజులకు పెంచాలని రూ. 250 కూలీ చెల్లించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో కేవలం ఎనిమిది మండలాలకే ఈ పథకాన్ని పరిమితం చేయడం దారుణమని, సిద్దిపేట ప్రాంతంలో ఎక్కువ మంది ప్రజలు ఉపాధి పథకంపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారని ఈ పథకాన్ని ఈ ప్రాంతంలో కొనసాగించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీఓ ముత్యంరెడ్డికి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు రేవంత్‌కుమార్, గోపాలస్వామి, కనకయ్య, ఆనంద్, నాగరాజు, భాస్కర్, స్వరూప, నాగమణి తదితరులు పాల్గొన్నారు. ఐకేపీ వీఓఏల వేతనాలను చెల్లించాలి 19 సంవత్సరాలుగా పని చేస్తున్న ఐకేపీ వీఓఏలకు గతంలో పారితోషికాన్ని కేవలం రూ. 400లు మాత్రమే చెల్లించే వారని సీఐటీయూ పోరాట ఫలితంగా గత ప్రభుత్వం రూ. 2వేలు వేతనం చెల్లిస్తామని హామీ ఇచ్చిందని, అయితే ఆ వేతనాన్ని ఇప్పటి వరకు చెల్లించలేదని ,వెంటనే పెండింగ్ వేతనాలను చెల్లించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ. మల్లేషం డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఐకేపీ వీఓఏల వేతనాలను పెండింగ్‌లో ఉంచడాన్ని నిరసిస్తూ బుధవారం ఆర్డీఓ కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ఐకేపీ వీఓఏలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు.దీక్షలకు మల్లేషం సంఘీభావం ప్రకటిస్తూ మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు వీఓఏలకు రూ. 5వేలు వేతనం చెల్లిస్తామని ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా నిర్లక్ష్యం చేస్తోందన్నారు. ప్రభుత్వం వెంటనే వారికి రూ. 10వేల వేతనాన్ని చెల్లించడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, హెల్త్ కార్డులు అందజేయాలని, అధికారుల వేధింపులను అరికట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలోసంఘం జిల్లా అధ్యక్షుడు కిష్టయ్య, వీఓఏలు లావణ్య, కిష్టారెడ్డి, లక్ష్మణ్, శంకర్, కవిత, మల్లేషం, హారిక, షాదుల్లా, సత్తిరెడ్డి, మహేష్, మంజుల, బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. -
‘ఎంఆర్ఎఫ్’ ఎన్నికల్లో హరీష్‌రావు ఘన విజయం
సదాశివపేట, న్యూస్‌లైన్: ఎంఆర్ఎఫ్ పరిశ్రమలో కార్మిక సంఘానికి గురువారం జరిగిన ఎన్నికల్లో సిద్దిపేట మాజీ ఎమ్మెల్యే హరిష్‌రావు బీఎంఎస్ అభ్యర్థి మల్లేశంపై 576 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఆయన ఎంఆర్ఎఫ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడిగా విజయం సాధించడం ఇది రెండోసారి. ఈ ఎన్నికల్లో వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడిగా హరీష్‌రావు, బీఎంఎస్ తరఫున మల్లేశం పోటీ చేశారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగిన పోలింగ్‌లో పరిశ్రమ పర్మినెంట్ కార్మికులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పరిశ్రమలో మొత్తం 1524 మంది ఓటర్లు ఉండగా వీరిలో 1471 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 7 గంటల సమయంలో వచ్చిన హరీష్‌రావు తనను గెలిపిస్తే తెలంగాణ ప్రభుత్వంలో కార్మికులకు పూర్తి న్యాయం చేస్తానని హామీ ఇస్తూ బస్సు గుర్తుకు ఓటు వేయాలని కోరుతూ వెళ్లిపోయారు. హరీష్‌రావు గెలుపునకు సంగారెడ్డి టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చింత ప్రభాకర్, టీఆర్ఎస్ జిల్లా నాయకులు మల్లాగౌడ్, అల్లం బస్వరాజ్, రాధాకృష్ణ దేశ్‌పాండే, రాచిరెడ్డి, మాజీ కౌన్సిలర్లు చింతగోపాల్, కోడూరి అంజయ్య పట్టణ అధ్యక్షుడు కొత్తగొల్ల చంద్రశేఖర్, టీఆర్ఎస్ నాయకులు సుకుమార్, ఉల్లిగడ్డల శాంత్కుమార్తో పాటు ఎంఆర్ఎఫ్ వర్కర్స్ యూనియన్, ఐఎన్టీయుసీ నాయకులు తదితరులు హరీష్‌రావుకు ఓటు వేసి గెలిపించాలని పరిశ్రమ వద్ద కార్మికులను కోరారు. మల్లేశం తరఫున బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోవూరి సంగమేశ్వర్, పట్టణ, మండల బీజేపీ అధ్యక్షులు శ్రీశైలం యాదవ్, సత్యనారాయణ, బీఎంఎస్ నాయకులు శంకర్, అంబయ్య, శ్రీనివాస్,ఆశోక్, వీరేందర్, బీఎంఎస్ కాగడా గుర్తుకు ఓటు వేయాలని కార్మికులను అభ్యర్ధించారు. గురువారం సాయంత్రం 4.30 గంటలకు ఓట్ల లెక్కింపును ప్రారంభించారు. లెక్కింపులో హరీష్‌రావుకు 1023 ఓట్లు రాగా మల్లేశంకు 447 ఓట్లు వచ్చాయి. దీంతో హరీష్‌రావు ఘన విజయం సాధించినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి కోటేశ్వర్రావు అధికారికంగా ప్రకటించారు. హరీష్‌రావు గెలుపు సందర్భంగా కార్మికులు పరిశ్రమ ఎదుట భారీగా టపాసులు కాలుస్తూ నినాదాలు చేశారు. ఎంఆర్ఎఫ్ కార్మికులు టీఆర్ఎస్, టీఎంఎస్ నాయకులు నినాదానాలు చేశారు. ఓటు వేసి గెలిపించిన ఎంఆర్ఎఫ్ వర్కర్స్ యూనియన్, ఐఎన్టీయుసీ నాయకులకు ఎంఆర్ఎఫ్ కార్మికులకు టీఆర్ఎస్, టీఎంఎస్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. సంబరాలు చేసుకొన్న టీఆర్ ఎస్ శ్రేణులు జహీరాబాద్ టౌన్: ఎంఆర్ఎఫ్ కర్మాగారంలో గురువారం జరిగిన కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో హరీష్‌రావు గెలుపొందడంతో టీఆర్ఎస్ నాయకులు సంబురాలు జరుపుకుంటున్నారు. నాయకులు, కార్మికులు రోడ్డుపైకి వచ్చి టపాసులు కాల్చి మిఠాయిలు పంచారు. పట్టణంలోని ప్రధాన చౌరస్తాకు టీఆర్ఎస్ శ్రేణులు చేరుకొని పెద్ద పెట్టున నినాదాలు చే శారు. బాణసంచా కాల్చి, స్వీట్లు పంచుకొన్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు,మాజీ ఎమ్మెల్యే హరీష్‌రావు అందరివాడన్నారు. సామాన్య ప్రజలతో పాటు కార్మికులు,కర్షకుల కష్టాలు తెలిసిన నాయకుడన్నారు. ఎంఆర్ఎఫ్లో చేపట్టిన కార్యక్రమాలే ఆయనను భారీ మెజార్టీతో గెలిపించాయన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మాణిక్‌రావు, మాజీ ఎమ్మెల్యే బాగన్న, పట్టణ అధ్యక్షుడు యాకూబ్, జిల్లా కార్యదర్శి నామ రవికిరణ్ గుప్తా, నాయకులు, సినీ నిర్మాత ఎం.శివకుమార్, కౌన్సిలర్ రాములు నేత, మురళీకృష్ణ గౌడ్,విజయ్‌కుమార్, కలీం, టీఆర్ఎస్వీ తాలుకా అధ్యక్షుడు ఖాజా, పట్టణాధ్యక్షుడు ఓంకార్ తదితరులు పాల్గొన్నారు.