‘ఈ-నామ్‌’ పటిష్టంగా అమలు చేయాలి | 'ee-nam' should be continue | Sakshi
Sakshi News home page

‘ఈ-నామ్‌’ పటిష్టంగా అమలు చేయాలి

Published Mon, Sep 19 2016 9:07 PM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM

వ్యాపారులతో మాట్లాడుతున్న మల్లేశం - Sakshi

వ్యాపారులతో మాట్లాడుతున్న మల్లేశం

  • మార్కెటింగ్‌ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ మల్లేశం
  • గజ్వేల్‌: గజ్వేల్‌ మార్కెట్‌యార్డులో ‘ఈ-నామ్‌’ పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలని మార్కెటింగ్‌శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ మల్లేశం సూచించారు. సోమవారం గజ్వేల్‌ యార్డులో కమీషన్‌ ఏజెంట్లు, వ్యాపారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు గిట్టుబాటు ధర అందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఈ-నామ్‌’ను యార్డుల్లో సమర్థంగా అమలు చేయడానికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.

    ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా వ్యాపారులు, కమీషన్‌ ఏజెంట్లు పనిచేయాలన్నారు. ఈ విధానం ద్వారా రైతు ఆన్‌లైన్‌లో దేశంలోని ఏ మార్కెట్‌లో అధిక ధర ఉన్నా అక్కడ తమ ఉత్పత్తులను అమ్ముకునే అవకాశముందని పేర్కొన్నారు. ఇంకా ఈ సమీక్షలో గజ్వేల్‌ మార్కెట్‌ కమిటీ కార్యదర్శి వెంకట్‌రాహుల్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement