e-nam
-
మార్కెట్.. ఇక వైఫై జోన్
♦ ఈ–నామ్ అమలుకు ఆమోదం ♦ రూ.41లక్షలతో అభివృద్ధి పనులకు శ్రీకారం ♦ కమిటీ సమావేశంలో పలు తీర్మానాలు జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): మహబూబ్‌నగర్ మార్కెట్ యార్డ్ ప్రాంతాన్ని త్వరలోనే ఫ్రీ వై ఫై జోన్‌గా మార్చనున్నట్లు మార్కెట్ కమిటీ చైర్మన్ చెరుకుపల్లి రాజేశ్వర్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డ్‌లో కమిటీ సర్వసభ్య సమావేశం సోమవారం జరిగింది. ఈ సమావేశంలో రైతులకు మేలు జరిగేలా ఈ–నామ్ విధానాన్ని పకడ్బందీగా అమలుచేసేందుకు ఉద్యోగులు, వ్యాపారులు కృషి చేయా లని తీర్మానించా రు. అనంతరం కమిటీ సర్వసభ్య సమావేశంలో చేసిన తీర్మానాలు, తీసుకున్న నిర్ణయాలను చైర్మన్ వెల్లడించారు. నిజామాబాద్ ఆదర్శం నిజామాబాద్ మార్కెట్‌ను ఆదర్శంగా తీసుకుని పాలమూరు మార్కెట్లో కూడా ఈ–నామ్ విధానంలో కొనుగోళ్లు, అమ్మకాలు చేపట్టాలని తీర్మానించినట్లు చైర్మన్ రాజేశ్వర్ వెల్లడించారు. తూకాల్లో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలకు చెక్ పెట్టెందుకు›‘వై ఫై’ టవర్లు ఏర్పాటు చేయడం ద్వారా వై ఫై జోన్‌గా మారుస్తామని తెలిపారు. అలాగే, రాబోయే మూడు నెలల్లో రూ.41లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. తాగునీటి వసతి కోసం వాటర్ ట్యాంకు, మహిళా రైతులు, సిబ్బందికి ప్రత్యేకంగా మరుగుదొడ్లు, విశ్రాంతి గదులు నిర్మించాలని, ప్రహరీ గోడ నిర్మాణాలు చేపట్టాలని తీర్మానించామన్నారు. వైస్ చైర్మన్ బాలరాజు, డైరెక్టర్లు కొప్పుల శ్రీనివాస్, కుర్వ శ్రీనివాసులు, బి.శ్రీనివాసులు, అల్తాఫ్, రవీందర్‌రెడ్డి, ప్రత్యేక శ్రేణి కార్యదర్శి నూర్జహాన్ బేగం, గ్రేడ్–2 కార్యదర్శి నవీన్ పాల్గొన్నారు. డెంగ్యూతో చికిత్స పొందుతున్న బాలిక జడ్చర్ల టౌన్: బాదేపల్లి ఎస్వీపీ నగర్‌కు చెందిన ఓ బాలిక డెంగ్యూ లక్షణాలతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. కొద్ది రోజుల క్రితం జ్వరం రాగా స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో చూపించారు. అ యితే బాలికకు డెంగ్యూలక్షణాలు ఉండటంతో హైదరాబాద్ పంపించారు. -
జమ్మికుంట మార్కెట్లో ‘నామ్’ ప్రారంభం
జమ్మికుంట: ఉత్తర తెలంగాణలో రెండో అతి పెద్దదైన జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో కేంద్రం అమలు చేస్తున్న ’నామ్’ పద్ధతిన (ఆన్లైన్లో) పత్తి కొనుగోళ్లు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. గతంలో వ్యాపారి నిర్ణయించిన ధరకే రైతు సరకు అమ్ముకోవాల్సి వచ్చేది. దాంతో ఆ వేలం పద్ధతిని రద్దు చేసి కేంద్ర ప్రభుత్వం ‘నామ్’ పద్ధతిన కొనుగోళ్లు చేపట్టాలని నిర్ణయించడంతో వ్యసాయ కమిషనర్ ఆదేశాల మేరకు కొత్త పద్ధతిన కొనుగోళ్లు ప్రారంభించారు. వంద వాహనాల్లో లూజు పత్తి, రెండు వేల టిక్కీల పత్తి మార్కెట్‌కు వచ్చింది. ఈ కొత్త పద్ధతిలో సీక్రెట్ క్యాబిన్లో ధరలు నిర్ణయిస్తారు. ముందుగా సరకుకు గ్రేడింగ్ చేసి ధర నిర్ణయిస్తారు. ఈ పద్ధతిలో ఆలస్యం జరుగుతుందని, కిరాయి వాహనాలతో వచ్చిన రైతులు ఆలస్యం కారణంగా వాహనాల కిరాయికి అధిక మొత్తం చెల్లించాల్సి వస్తుందని అంటున్నారు. గ్రేడింగ్ నిర్ధారణకు నిపుణుల కొరత కూడా ఉందని, నిపుణులను నియ మించాలని రైతులు కోరుతున్నారు. కాగా, కొందరు రైతులు నేరుగా మిల్లుల వద్దే సరకు విక్రయించుకునేందుకు వేచి ఉన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ పింగిలి రమేష్, వైస్ చైర్మన్ ఎర్రబెల్లి రాజేశ్వరరావు, కార్యదర్శిలు ‘నామ్’ పద్ధతిని ప్రారంబించారు. -
మార్కెట్‌యార్డుల్లో ‘ఈ– నామ్’
* రాష్ట్రంలో తొలి దశగా 12 యార్డుల్లో అమలు * ఇప్పటికే గుంటూరు, దుగ్గిరాల యార్డుల్లో ఆన్లైన్ ట్రేడింగ్‌తో వ్యాపారం * అక్టోబర్‌లో తెనాలి యార్డులో ఈ– నామ్ ప్రారంభానికి చర్యలు తెనాలి టౌన్: దేశ వ్యాప్తంగా వ్యవసాయ మార్కెట్‌యార్డులలో ఆన్లైన్ ట్రేడింగ్, ఈ– నామ్ వ్యవస్థ ఏర్పాటు చేసేందుకు కేంద్రప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. దేశ వ్యాప్తంగా 585 మార్కెట్ యార్డులలో ఈ–నామ్ సిస్టమ్ ద్వారా వ్యవసాయ ఉత్పత్తులు అమ్మకాలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తొలిదశలో ఆంధ్రప్రదేశ్‌లో 12 మార్కెట్ యార్డులను రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. వీటిలో గుంటూరు జిల్లాలో తెనాలి, పిడుగురాళ్ల, పశ్చిమ గోదావరి జిల్లాలో దెందులూరు, గోపాలపురం, అనంతపురం జిల్లాలో ప్రత్తికొండ, అనంతపురం, చిత్తూరు జిల్లాలో పొదలకూరు, కలికిరి, గుర్రంకొండ, మదనపల్లి, పలమనేరు, పుంగనూరు యార్డులు ఉన్నాయి. ఈ యార్డులో ఈ– నామ్ సిస్టమ్‌ను అమలు చేసేందుకు ప్రతి యార్డుకు రూ.30 లక్షలు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఇప్పటికే జిల్లాలో గుంటూరు, దుగ్గిరాల యార్డుల్లో ఆన్లైన్ ట్రేడింగ్ వ్యవస్థ ద్వారా మిర్చి, పసుపు అమ్మకాలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు రైతులు తాము పండించిన వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్‌యార్డులలో వ్యాపారులు నిర్ణయించిన ధరకు అమ్ముకునే వారు. రైతుకు లాభం చేకూర్చాలనే లక్ష్యంతో ఆన్లైన్ ట్రేడింగ్, ఈ– నామ్ వ్యవస్థను ప్రవేశపెడుతున్నట్లు మార్కెటింగ్ శాఖాధికారులు తెలిపారు. ఈ వ్యవస్థలో సీక్రెట్ టెండర్లు ఉంటాయని, దీని ద్వారా ఎక్కువ రేటు వస్తుందని అంటున్నారు. రైతు ఒప్పుకుంటే వ్యవసాయ ఉత్పత్తులను కాటా వేసి నగదు వెంటనే చెల్లిస్తామని చెబుతున్నారు. తెలంగాణా రాష్ట్రంలో ఇప్పటికే 22 మార్కెట్ యార్డుల్లో ఆన్లైన్ ట్రేడింగ్ వ్యవస్థ ఉన్నట్లు చెప్పారు. అక్టోబర్‌ను నుంచి తెనాలిలో.. తెనాలిలో ఈ– నామ్ వ్యవస్థను అక్టోబర్‌లో ప్రారంభించేందుకు చర్యలు చేపట్టారు. దీని గురించి రైతులు, వ్యాపారులకు అవగాహన కల్పించేందుకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నారు. తెనాలి యార్డులో ఎనిమిది ఆన్లైన్ సిస్టమ్ క్యాబిన్లు ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌కు చెందిన నాగార్జున ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఎన్ఎఫ్సీఎల్) కంపెనీ దేశ వ్యాప్తంగా ఈ– నామ్ వ్యవస్థను ప్రవేశపెట్టే మార్కెట్ యార్డులకు సాఫ్ట్వేర్ సరఫరా చేయనున్నట్లు ఎన్ఎఫ్సీఎల్ మార్కెటింగ్ ప్రతినిధి స్వామి తెలిపారు. ప్రాజెక్టు రూపకల్పన చేసిన అనంతరం డేటా ఎంట్రీ ఆపరేటర్స్‌కు శిక్షణ ఇవ్వనున్నారు. వ్యాపారులకు లాగిన్ ఐడీ, పాస్వర్డ్ ఇచ్చిన అనంతరం దీనిపై అవగాహన కల్పించి వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేసే విధానంపై శిక్షణ ప్రారంభిస్తారు. ఈ విధానం పూర్తిగా అమలైతే రైతుకు కొంత మేరకు లాభం చేకూరే అవకాశం ఉందని మార్కెటింగ్ శాఖ అధికారులు చెబుతున్నారు. -
‘ఈ-నామ్’ పటిష్టంగా అమలు చేయాలి
మార్కెటింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ మల్లేశం గజ్వేల్: గజ్వేల్ మార్కెట్‌యార్డులో ‘ఈ-నామ్’ పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలని మార్కెటింగ్‌శాఖ డిప్యూటీ డైరెక్టర్ మల్లేశం సూచించారు. సోమవారం గజ్వేల్ యార్డులో కమీషన్ ఏజెంట్లు, వ్యాపారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు గిట్టుబాటు ధర అందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఈ-నామ్’ను యార్డుల్లో సమర్థంగా అమలు చేయడానికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లు పనిచేయాలన్నారు. ఈ విధానం ద్వారా రైతు ఆన్లైన్లో దేశంలోని ఏ మార్కెట్లో అధిక ధర ఉన్నా అక్కడ తమ ఉత్పత్తులను అమ్ముకునే అవకాశముందని పేర్కొన్నారు. ఇంకా ఈ సమీక్షలో గజ్వేల్ మార్కెట్ కమిటీ కార్యదర్శి వెంకట్రాహుల్ తదితరులు పాల్గొన్నారు.