జమ్మికుంట మార్కెట్‌లో ‘నామ్’ ప్రారంభం
జమ్మికుంట మార్కెట్‌లో ‘నామ్’ ప్రారంభం
Published Wed, Feb 1 2017 11:56 AM | Last Updated on Tue, Sep 5 2017 2:39 AM
జమ్మికుంట: ఉత్తర తెలంగాణలో రెండో అతి పెద్దదైన జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌లో కేంద్రం అమలు చేస్తున్న ’నామ్’ పద్ధతిన (ఆన్‌లైన్‌లో) పత్తి కొనుగోళ్లు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. గతంలో వ్యాపారి నిర్ణయించిన ధరకే రైతు సరకు అమ్ముకోవాల్సి వచ్చేది. దాంతో ఆ వేలం పద్ధతిని రద్దు చేసి కేంద్ర ప్రభుత్వం ‘నామ్’ పద్ధతిన కొనుగోళ్లు చేపట్టాలని నిర్ణయించడంతో వ్యసాయ కమిషనర్ ఆదేశాల మేరకు కొత్త పద్ధతిన కొనుగోళ్లు ప్రారంభించారు. వంద వాహనాల్లో లూజు పత్తి, రెండు వేల టిక్కీల పత్తి మార్కెట్‌కు వచ్చింది. ఈ కొత్త పద్ధతిలో సీక్రెట్ క్యాబిన్‌లో ధరలు నిర్ణయిస్తారు. ముందుగా సరకుకు గ్రేడింగ్ చేసి ధర నిర్ణయిస్తారు.
ఈ పద్ధతిలో ఆలస్యం జరుగుతుందని, కిరాయి వాహనాలతో వచ్చిన రైతులు ఆలస్యం కారణంగా వాహనాల కిరాయికి అధిక మొత్తం చెల్లించాల్సి వస్తుందని అంటున్నారు. గ్రేడింగ్ నిర్ధారణకు నిపుణుల కొరత కూడా ఉందని, నిపుణులను నియ మించాలని రైతులు కోరుతున్నారు. కాగా, కొందరు రైతులు నేరుగా మిల్లుల వద్దే సరకు విక్రయించుకునేందుకు వేచి ఉన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ పింగిలి రమేష్, వైస్ చైర్మన్ ఎర్రబెల్లి రాజేశ్వరరావు, కార్యదర్శిలు ‘నామ్’ పద్ధతిని ప్రారంబించారు.
Advertisement