ప్రమాద వశాత్తు చెరువులో పడి గల్లంతైన యువకుడి మృత దేహం మంగళవారం లభ్యమైంది.
ప్రమాద వశాత్తు చెరువులో పడి గల్లంతైన యువకుడి మృత దేహం మంగళవారం లభ్యమైంది. మెదక్ జిల్లా హత్నూరు మండలం నాగులదేవులపల్లి గ్రామానికి చెందిన నాలుగో వార్డు మెంబర్ చిన్న మల్లేశం(28) ఆదివారం రాత్రి స్నేహితులతో కలిసి చెరువుకట్ట వద్దకు వెళ్లాడు. ప్రమాదవశాతు కాలు జారి అందులో పడి గల్లంతయ్యాడు. అప్పటి నుంచి అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే సోమవారం అంతా యువకుడి ఆచూకీ తెలియలేదు. దీంతో మంగళవారం ఉదయం కూడా గాలింపు కొనసాగించారు. ఉదయం గాలింపు ప్రారంభించిన కొద్ది సేపటికే మల్లేశం మృతదేహం దొరికింది. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.